Back

ⓘ నాణెం
నాణెం
                                     

ⓘ నాణెం

భారత్ వలెనే ఎంతో పురాతన చరిత్ర కలిగిన దేశాలుగ్రీస్, చైనా, రోమ్, మొదలైనవి. గ్రీకులు, చైనీయులు క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దంలో నాణేలు విడుదల చేసుకున్నారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. రోమన్లు, పర్షియన్లు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో నాణేలను చెలామణీలోకి తెచ్చారని కూడా నిర్దిష్టమైన ఆధారాలు ఉణ్ణాయి. అయితే భారతదేశ నాణేల చరిత్రకు ఇలాంటి విస్పష్టమైన ఆధారలేమీ లేవు. ఇక్కడ నాణేలు ఎప్పటి నుంచి చెలామణీ అవుతున్నాయనే సంగతి ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలి ఉంది.

నాణేల మీద పుంఖానువుంఖాలుగా ముద్రలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వేర్వేరు రాజులవని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే నాణేం మీద గుర్తు మారినంత మాత్రాన పాలకుడు మారిపోయాడని చెప్పలేమని చరిత్రకారులు చెబుతున్నారు. జనపదాలలో స్థానిక పాలకుల నాణేలతో పాటు, సామ్రాజ్యాలు విడుదల చేసిన నాణేలు కూడా బయల్పడినాయి. ఆంధ్రజనపదమే ఇందుకు గొప్ప ఉదాహరణ. అమరావతిలో దొరికిన 7668 నాణేలలో కనిపించిన రకాలు దేశంలో ఇంకెక్కడా కనిపించలేదు. ఈ వెండి పంచ్‌మార్క్‌డ్ నాణేలలో 235 రకాలను కనుగొన్నారు. ఇందులో 48 రకాలు మరెక్కడా బయల్పడలేదు. పి ఎల్ గుప్తాయే వీటి గురించి పరిశోధించారు. పరిష్కారమైన సమస్యల కంటే పరిష్కారం కాని ప్రశ్నలే ఇందులో ఎక్కువ. మరో లోపం - నాణేలను ఇంతకాలం భూగర్భంలో దాచిపెట్టిన కుండలు కాలాన్ని చెప్పగలవు. కానీ ఆ ప్రయత్నం కూడా చాలాసార్లు విఫలమైంది. ఆ కుండలు మిగలడం లేదు. ఇందుకు బీహార్‌లో పైలా అనే చోట దొరికిన నిధి మాత్రమే మినహాయింపు. అక్కడ దొరికిన నాణేల కాలాన్ని శాస్త్రీయ పద్థతిలో నిర్థారించగలిగారు. కాని ఎక్కువ చోట్ల అది సాధ్యం కావడం లేదు. దాంతో శాస్త్రీయ పద్ధతులతో అవకాశాన్ని అలా జారవిడుచుకోవలసి వస్తున్నది. నాణేలలో కార్బన్ ఉంటుందా, కార్బన్ పరీక్ష జరిపి కాలాన్ని నిర్ధారించవచ్చా? అంటే ఈ అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి.

ఎందుకంటే ఒకసారి కార్బన్ పరీక్ష్ జరపాలంటే ఒక మిల్లీగ్రాము పదార్ధమైనా కావాలి. అంటే కొన్ని నాణేలనైనా త్యాగం చేయవలసి ఉంటుంది. కాబట్టి దీనికి ఎవరూ సాహసించడం లేదు. నాణేల కాలం తెలియవచ్చేమో కాని నాణేలు మాత్రం కరిగిపోతాయి. కాబట్టే భారతదేశంలో నాణేలు ఎప్పటి నుంచి చెలామణీ అవుతున్నాయో ఇప్పటికీ చిక్కువీడని ప్రశ్నేగానే ఉండిపోయింది.