Back

ⓘ నర్గిస్ దత్




నర్గిస్ దత్
                                     

ⓘ నర్గిస్ దత్

నర్గిస్ దత్, వెండితెర పేరైన నర్గిస్ తోనే ప్రసిద్ధి., భారతీయ సినిమారంగ నటి. 1940 నుండి 1960 వరకూ ప్రస్థానం. తన విజయవంతమైన కెరీర్ తో విమర్శకులు సైతం అభినందించారు. అనేక కమర్షియల్ చిత్రాలలో పనిచేసింది. ఈమె విజయంతమైన సినిమా మదర్ ఇండియా, అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది. ఈ చిత్రంలో తనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు లభించింది. 1958 లో నర్గిస్ పెళ్ళి సునీల్ దత్ తో జరిగింది. 1967లో నటించిన రాత్ ఔర్ దిన్ లో ఈమెకు జాతీయ ఉత్తమనటి అవార్డు లభించింది.

                                     

1. జీవితం

నర్గిస్ అసలు పేరు ఫాతిమా రషీద్, అలహాబాదుకు చెందిన ముస్లిం-గాయని జద్దన్ బాయి, తండ్రి హిందువు మోహ్‌యాల్ రావల్పిండికి చెందినవాడు నర్గిస్ అన్న అన్వర్ హుసేన్, హిందీ నటుడు.

                                     

2. ప్రస్థానం

నర్గిస్ తన కెరీర్ ను పసితనంలోనే ప్రారంభించింది. బాలనటిగా 1935 లో తలాషె హక్ తన ఆరవయేట నటించింది. ఈ చిత్రంలో ఈమె పేరు బేబీ నర్గిస్, ఇదే పేరు తరువాత స్థిరపడిపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించింది. తన 14వ యేట మెహబూబ్ ఖాన్ సినిమా తక్దీర్ 1943 లో నటించింది. ఈమె విజయవంతమైన హిందీ-ఉర్దూ సినిమాలు 1940 - 1950 ల మధ్య విడుదలైన బర్సాత్ 1949, అందాజ్ 1949, ఆవారా 1951, దీదార్ 1951, శ్రీ 420 1955, చోరీ చోరీ 1956. ఈమె చాలా సినిమాలు రాజ్‌కపూర్, దిలీప్ కుమార్ సరసన నటించినవే.

తన ప్రసిద్ధిగాంచిన చిత్రం మెహబూబ్ ఖాన్ నిర్మించిన ఆస్కార్-అవార్డుకు నామినేట్ చేయబడిన జానపద-కథ మదర్ ఇండియా 1957. ఈ చిత్రంలో నటనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు తెచ్చిపెట్టింది. 1958లో సునీల్ దత్ తో వివాహమైన తరువాత నర్గిస్ సినిమాలలో నటించడం దాదాపు మానేసింది. తన ఆఖరు చిత్రం 1967 నాటి రాత్ ఔర్ దిన్, ఈ చిత్రం ఈమెకు జాతీయ ఉత్తమ నటి బహుమతి తెచ్చి పెట్టింది.

                                     

3. పురస్కారాలు

  • 1957 - ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు, మదర్ ఇండియా
  • కార్లోవి వేరీ అవార్డు సాధించిన తొలి నటి. ఈమె రాజ్యసభకు నామినేట్ చేయబడింది. 1980-81,
  • ఊర్వశి అవార్డు.
  • జనవరి 8, 2001, అమితాబ్ బచ్చన్ లను కలిపి "మిలీనియం కు చెందిన విశిష్ట కళాకారులు" అవార్డు హీరోహోండా కంపెనీ, సినీపత్రిక స్టార్‌డస్ట్ లు ప్రదానం చేశాయి.
  • 1968 - జాతీయ ఉత్తమనటి అవార్డు, రాత్ ఔర్ దిన్
  • 1958 - పద్మశ్రీ - పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి సినిమా వ్యక్తి.
  • జాతీయ సినిమాటోగ్రఫీ అవార్డు. భారతీయ సినిమాకు విశిష్ట సేవలందించినందుకు గాను.
                                     

4. ఫిల్మోగ్రఫీ

  • చోరీ చోరీ 1956
  • మీనా బజార్ 1950
  • బీస్వీఁ సదీ 1945
  • అదాలత్ 1958
  • తమన్నా 1942
  • జాన్ పెహ్‌చాన్ 1950
  • ప్యార్ 1950
  • ఆవారా 1951
  • అన్‌హోనీ 1952
  • రుమాల్ 1949
  • తక్దీర్ 1943
  • షికస్త్ 1953
  • అనోఖా ప్యార్ 1948
  • మేలా 1948
  • ఆధీ రాత్ 1950
  • జాగ్తేరహో 1956
  • అంగారే 1954
  • అందాజ్ 1949
  • ఆషియానా 1952
  • లాహోర్ 1949
  • షీషా 1952
  • మదర్ ఇండియా 1957
  • ప్యార్ కీ బాతేఁ 1951
  • యాదేఁ 1964
  • ఆహ్ 1953
  • ఛోటీ భాబి 1950
  • అంజుమన్ 1948
  • హుమాయూన్ 1945
  • పర్దేసీ
  • ధున్ 1953
  • లాజ్‌వంతి 1958
  • ఖేల్ 1950
  • శ్రీ 420 1955
  • ఆగ్ 1948
  • సాగర్ 1951
  • రాత్ ఔర్ దిన్ 1967
  • బేవఫా 1952
  • దారోగాజీ 1949
  • దీదార్ 1951
  • అంబర్ 1952
  • పాపి 1953
  • బాబుల్ 1950
  • తలాషె హక్ 1935
  • జోగన్ 1950
  • ఘర్ సంసార్ 1958
  • నర్గిస్ 1946
  • హల్‌చల్ 1951
  • బర్సాత్ 1949
  • మెహందీ 1947


                                     

5. ఇతర పఠనాలు

  • Darlingji: The True Love Story of Nargis and Sunil Dutt, Kishwar Desai. 2007, Harper Collins. ISBN 9788172236977.
  • Mr. and Mrs. Dutt: Memories of our Parents, Namrata Dutt Kumar and Priya Dutt, 2007, Roli Books. ISBN 9788174364555.