Back

ⓘ కాశీయాత్ర చరిత్ర
                                               

ఏనుగుల వీరాస్వామయ్య

ఏనుగుల వీరాస్వామయ్య తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు కాశీయాత్ర చరిత్ర విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధుడు. కాశీయాత్ర చరిత్ర మొదటిసారి అచ్చు అయినపుడు కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన ముందుమాట వలన, తన రచనలో సందర్భానుసారంగా వీరాస్వామయ్య పేర్కొన్న విషయాల వలన, దిగవల్లి వేంకటశివరావు, ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంలో వెలువడిన కాశీయాత్ర చరిత్ర గ్రంథాలలోని పీఠికల ద్వారా వీరాస్వామయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి.

                                               

ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర మార్గం

తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తాను 1830-31లో చేసిన కాశీయాత్రను కాశీయాత్రచరిత్రగా గ్రంథస్తం చేశారు. ఈ గ్రంథం 19వ శతాబ్ది తొలి అర్థభాగంలో భారతదేశ సామాజిక, రాజకీయ స్థితిగతులకు ముఖ్యమైన ఆధారాల్లో ఒకటిగా నిలుస్తోంది. ప్రామాణిక సామాజిక చరిత్ర ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనలో సురవరం ప్రతాపరెడ్డి 19వ శతాబ్ది సమాజిక చరిత్రకు గాను ఈ గ్రంథంపైనే ప్రధానంగా ఆధారపడ్డారు. ఆ ప్రాధాన్యత సంతరించుకున్న కాశీయాత్ర జరిగిన ప్రాంతాలు, తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.

                                               

కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై

కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై 19వ శతాబ్దిలో చెన్నపట్టణంలోని తెలుగు ప్రముఖుల్లో ఒకరు. ఆయన ప్రజాసేవ, సాంఘిక సంస్కరణలు, సాహిత్య పోషణ వంటి విషయాల్లో కృషి చేశారు. తొలి తెలుగు యాత్రాచరిత్ర కాశీయాత్ర చరిత్ర గ్రంథాన్ని దాని రచయిత, శ్రీనివాస పిళ్ళై స్నేహితుడు అయిన ఏనుగుల వీరాస్వామయ్య మొదట తాను యాత్రలు చేస్తూ లేఖల రూపంలో శ్రీనివాస పిళ్ళైకే వ్రాశారు.

                                               

తెలుగులో యాత్రా రచనలు

పలువురు తెలుగు రచయితలు తాము చేసిన యాత్రలను వర్ణిస్తూ, తమ అనుభవాలను, అనుభూతులను, తెలుసుకున్న విశేషాలను క్రోడీకరిస్తూ, ఆయా ప్రాంతాల చరిత్రను, ప్రత్యేకతలను వివరిస్తూ గ్రంథాలను వెలువరించారు. ఈ యాత్రా సాహిత్యం వలన పాఠకులకు ఆయా ప్రాంతాల విశేషాలు, అక్కడి ప్రజల సాంఘిక, సాంస్కృతిక జీవన పరిస్థితులు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాలను దర్శించే వారికి ఈ పుస్తకాలు మార్గదర్శకమౌతాయి.

                                               

కాంచనపల్లి కనకమ్మ

కాంచనపల్లి కనకమ్మ జననం సెప్టెంబరు 3, 1893లో. సంస్కృతాంధ్ర రచయిత్రి. సెప్టెంబరు 3, 1893 న గుంటూరు జిల్లా, పల్నాటి సీమలోని దుర్గి గ్రామంలో రంగారావు, రంగమ్మ దంపతులకు జన్మించింది. బాల్యవితంతువైన కనకమ్మ తన తండ్రి ఇంటిపేరే జీవితాంతం ఉంచుకొన్నది. ఈమె బి.ఎ. ఆంగ్లములో పట్టభద్రురాలై కొంతకాలం నెల్లూరు, చెన్నైలలో లేడీ వెల్లింగ్టన్ ఉన్నత పాఠశాలలోను, క్వీన్ మేరీస్ కళాశాల లోను ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. మాక్విలన్ కంపెనీ వంటి విద్యాసంస్థల కోసం తెలుగు పుస్తకాలు రచించారు. ఆనాటి అన్ని స్త్రీల పత్రికలలోను వీరి రచనలు ప్రచురించబడ్డాయి. పద్యం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియలన్నిటిలోను ...

                                               

పుత్తూరు

1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో నమోదు అయింది. ఆయన వ్రాసుకున్నదాని ప్రకారం 1830ల నాటికే పుత్తూరిలో మునియప్పిళ్ళ సత్రం ఉంది. అక్కడ బ్రాహ్మణులకు, గోసాయిలకు, బైరాగులకు సదావృత్తి స్వయంపాకం వంటిది ఇచ్చేవారు. ఆ పట్టణంలో అప్పట్లో పరిపాలిస్తున్న ఈస్టిండియా కంపెనీ వారు దొరలకు హోటల్/సత్రం ముసాఫరుఖానా కట్టించారు. చిన్న పట్టణం చిన్న పేటస్థలం అని వివరించారు. కావల ...

                                               

నగరి

నగరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం. నగరి చిత్తూరు జిల్లాలోని ముఖ్యపట్టణం తిరుపతి 51 కి.మి దూరములో ఉంది. ఈ గ్రామం.లో కరిక మాణిక్యస్వామి దేవాలయం ఉంది. మహాభాగవత ఇతిహాస గజేంద్ర మోక్షం కథ ఇక్కడ జరిగినదని విష్ణువు ఇక్కడే గజ రాజుని మకరం బారి నుండి రక్షించాడనీ చెబుతారు. ఇక్కడ ఉన్న మాణిక్య స్వామి దేవాలయంలో ప్రత్యేకముగా జరిగే ఉత్సవాలు కంచి గరుడ సేవ, కనుమ, రథ సప్తమి, వైకుంఠ ఏకాదశి ఉత్సవములు.

                                               

ఇచ్చోడ

తొలి యాత్రాచరిత్ర కారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి తన కాశీయాత్ర చరిత్రలో భాగంగా వివరాలు నమోదుచేసుకున్నారు. దాని ప్రకారం ఈ ఊరు అప్పట్లో చాలా చిన్నగ్రామం. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ షహర్‌కు వెళ్ళే మార్గంలో కడం అనే నది ఉన్నదని, చిన్న ప్రవాహమే అయినా లోతు ఎక్కువనీ, దారి చాలా అడుసుగలదని వ్రాశారు. దానిని దాటడం కష్టం కావడంతో వాతావరణ అనుకూల్యత కొరకు ప్రజలు అప్పట్లో ఈ గ్రామంలో ఆగేవారని తెలిపారు. కంపెనీఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం వారి టపా కూడా ఇక్కడ రెండు మూడు రోజులు వాతావరణ అనుకూల్యత కోసం ఆగేదని ఆయన వివరించారు.

                                               

చెయ్యేరు నది

చెయ్యేరు, పెన్నా నదికి ఉపనది. దీనినే బాహుదా నది అని కూడా అంటారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అత్తిరాల ఈ నదీతీరాన్నే వెలసింది.ఈ నది కర్ణాటకలోని కోలార్ జిల్లా రాయపాడు కొండల్లో పుట్టి చిత్తూరు జిల్లా, మదనపల్లె ప్రాంతం నుంచి ప్రహహించి వైఎస్ఆర్ జిల్లా, సరిపల్లి సమీపంలో కడప జిల్లాను తాకుతుంది. ఈ నది మీద బాదనగడ్డ వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడింది.జిల్లాలో సుమారో 150 కి.మీ. మేర ఈ నది విస్తరించింది. టి.సుండుపల్లె మండలంలోని రాయవరం వద్ద బహుదా, పింఛ నదులు అనుసంధానం చేసుకుని బాలరాచపల్లి మీదుగా, అన్నమయ్య ప్రాజెక్టు ముందుభాగాన మాండవ్య, గంగనేరులను కలుపుకుని సిద్దవటం మీదుగాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ...

                                               

మేడ్చల్

మేడ్చల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండలానికి చెందిన రెవిన్యూ గ్రామం,జనగణన పట్టణం. ఇది హైదరాబాదును ఆనుకొని 44 వ నెంబరు జాతీయ రహదారి పై నాగపూర్ మార్గములో ఉంది.కిష్టాపూర్ గ్రామం మేడ్చల్ గ్రామపంచాయితీ పరిధిలోకి వస్తుంది.

                                               

కథలు గాథలు (చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి)

కథలు గాథలులోని వ్యాసాల్లో అధికభాగం నాటి ఆంధ్ర సచిత్ర వారపత్రిక, కృష్ణాపత్రిక, భారతి, త్రిలింగ, ఆంధ్రవాణి, ప్రౌఢభారతి, ఉదయలక్ష్మి, ప్రజామిత్ర, సమదర్శిని, జాగృతి, ఆదిశైవ, తెలుగుదేశం తదితర పత్రికల్లో ప్రచురితమైనవి. ప్రముఖ కవి, తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రాసిన వ్యాసాల్లో అధికభాగాన్ని కథలు గాథలులో సంకలనం చేశారు. ఆశుకవిత్వం, అవధానాలు, పద్యనాటకాలు, పద్యకావ్యాలు వంటివాటి రచనలో తెరిపిలేని వేంకటశాస్త్రి 1930ల నుంచి వచనం రచించడం ప్రారంభించారు. ఆయన వచన రచనలను సంకలనం చేసి తొలిసారిగా కథలు గాథలుగా గ్రంథకర్త కుమారుడు చెళ్లపిళ్ల దుర్గేశ్వరరావు 1960వ దశకంలో ప్రచురించారు. అనంతర కాలంల ...

కాశీయాత్ర చరిత్ర
                                     

ⓘ కాశీయాత్ర చరిత్ర

కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. eతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.

                                     

1. ఏనుగుల వీరాస్వామయ్య

శ్రీ ఏనుగుల వీరాస్వామి అనే మహాపురుషుడు మద్రాసు నుండి కాశీకి రెండుసార్లు కాలి మార్గంలో ప్రయాణం చేశాడు. ఆ వివరాలు ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర అనే గ్రంథంగా తర్వాతి కాలంలో అంటే 1838 లో కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్లై అనే విద్వాంసుడు అచ్చు వేయించాడు. శ్రీ వీరాస్వామి మద్రాసు సుప్రీం కోర్టు శాఖలో ఇంటర్‌ప్రిటర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆయనకు ధర్మబుద్ధి, పలుకుబడి ఎక్కువే. సకుటుంబ సపరివారంగా డేరాలతో సహా ఆయన చేసిన ప్రయాణాలలో మనకు అద్భుతం కల్గించే అంశాలు ఎన్నో ఉన్నాయి. 1941 లో దిగవల్లి వేంకట శివరావు ఈ గ్రంథాన్ని సంస్కరించి ఎన్నో క్లిష్టతరమైన ఆలనాటి తెలుగు-ఉరుదూ-తమిళం కలిసియున్న మాటలకు అర్ధములతో సరళమైన తెలుగు భాషలో వెలువరించి 3 వ సంకలనము ప్రచురించారు. వీరస్వామి వ్రాసింది తెలుగు భాషలోనే. ఐతే అది రెండు వందల సంవత్సరాల నాటి జనవ్యవహార భాష కావటంతో మూడవసంకలనములో చేసిన సంస్కరణలుకు భాషా శాస్త్రపరంగా కూడా ఎంతో ప్రాధాన్యం లభించి, గిడుగు రామమూర్తి పంతులుగారి మన్ననలకు పాత్రమయింది. వెళ్ళేటప్పుడు మద్రాసు, హైదరాబాద్‌, నాగపూర్‌, అలహాబాదుల మీదుగా వీరాస్వామిగారు కాశీ చేరారు. వచ్చేటప్పుడు గయ, ఛత్రపురం, భువనేశ్వర్‌, విశాఖపట్నం, ఒంగోలు, కావలి, నెల్లూరు మీదుగా సాగరతీరం వెంట మద్రాసు చేరారు. మొదటి రెండు సంకలనములలో క్లితరమైన భాషాశైలే కాక పేరాలుగానీ, విశేషములవారి విభజనలుగానీ లేవు. 1941 మూడవ సంకలనము నకు సంపాదకులు దిగవల్లి వేంకటశివరావుగారు ఆ పుస్తకముయొక్క గ్రంథకర్త అయిన ఏనుగుల వీరస్వామయ్య గారి జీవిత చరిత్రపై దీర్ఘ పరిశోధన జరిపారు, మొదటి రెండు సంకలనములలోగల క్లిష్టమైన భాషా శైలిని మచ్చుచూపించుటకు కొన్ని కొన్ని నమునాల ముఖపత్రములను తన సంకలనములో చేర్చారు. ఆ కాలమునాటి మాటల అర్ధములకొరకు అనేక చారిత్రక గ్రంథములలోనుండి సేకరించి మూడవ సంకలనములో విశేషములవారీగా పేరాగ్రాఫ్ విభజనలుచేసి వివిరణలిచ్చారు. గ్రంథకర్త ఏనుగుల వీరస్వామయ్యగారి జీవితవిశేషములు, రాజకీయ సాంఘిక పరిస్థితులను గూర్చి వివరణ, 39 పుటల అకారాది సూచిక, అనేక చిత్రపఠములు ఉన్నాయి. 3వ సంకలన మొదటిముద్రణలో యాత్ర మార్గసూచికాపఠము route map లేదు. 1991 సంవత్సరము రెండవముద్రణలో అప్పటికి 94 సంవత్సరముల వయస్సు గల సంపాదకులు దిగవల్లి వేంట శివరావుగారు వీరస్వామయ్యగారు ప్రయాణించిన మార్గసూచికాపఠమును route map ను 1991లో ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ క్రొత్త ఢిల్లీ వారు చేసినరెండవముద్రణలో జతచేయించారు. ఈ అమూల్య పుస్తకమును అనేక సాహిత్యకారులు, విద్వాంసులు సమీక్షించి బహుముఖముగా ప్రశంసించారు

                                     

2. కాశీయాత్ర చరిత్ర రచన ప్రాముఖ్యత

క్షేత్ర మహాత్మ్య కథలు, తీర్ధశార్ధ విధులు మతధర్మ చర్చలు, దేశచరిత్రాంశములు మొదలగునవి. గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య గారి జీవితవిశేషములు, రాజకీయ సాంఘిక పరిస్థితులను గూర్చి వివరణ,

                                     

3. యాత్రా క్రమం, విశేషాలు

 • కొన్ని ప్రదేశాలలో కుల, మత, ప్రాంత భేదాలు ఎన్ని అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయో, భిన్న ప్రాంతాలలో ఆర్థిక పరిస్థితులెలా ఉన్నాయో చిత్రీకరించాడు.
 • ఆనాటి వాడుకభాషలో సమకాలీన జీవిత దౌర్భాగ్యాలను, తన పోషకుల వంచనాశిల్పాన్ని, తన బలహీనతలనూ నిర్వికారంగా వ్రాయగలిగాడు.
 • పుప్పాడ లోని బెస్తలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా అప్పులపాలైనారో వివరించాడు.
 • అప్పటి సంస్థానాలలో, ఇంగ్లీషు రాజ్యభాగాలలో, పౌరోహిత్యంలో ఎన్ని విధాల మోసం, లంచగొండితనం, అవినీతి ఉన్నాయో దాపరికం లేకుండా వ్రాశాడు.
 • హైదరాబాదు, శంషాబాద్, కంటోన్మెంట్ వంటి నేటి హైదరాబాద్ నగర ప్రాంతాల్లోని నాటి జనజీవనం గురించి ఆయన రాసిన విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
 • విలియం బెంటింగ్ రాజప్రతినిధులు ఎన్ని విధాల, ఎన్ని కుమార్గాలలో స్వదేశీ సంస్థానాలను క్రమంగా ఆక్రమించుకొంటున్నారో, దేశంలో జమిందారుల, దోపిడీ దొంగల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురౌతున్నారో మొహమాటం లేకుండా వ్రాశాడు.
 • అప్పటికి 1831-1832 బ్రిటిషు వారు ఇంకా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు. కాబట్టి కొంత భాగం సంస్థానాలలో రాజు ల క్రింద ఉండేది.


                                     

4. ముద్రణలు

 • చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన వీరాస్వామి యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై మొదటిసారిగా 1838లో ముద్రించాడు.
 • ఈ గ్రంథం 1941లో దిగవల్లి వేంకట శివరావు అనేక వివరణలతో మూడవ సంకలనం ప్రచురించారు ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షరశాలలో ముద్రించారు. ఈ మూడవ సంకలనం రెండవ ముద్రణ తిరిగి 1991లో ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు క్రొత్త ఢిల్లీలో ముద్రించారు.
 • ఈ గ్రంథం 1869లో ద్వితీయ ముద్రణ పొందింది.
                                     

5. మూలాలు, వనరులు

 • "పాత కెరటాలు- ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్ర చరిత్ర" మాలతీ చందూర్ 1981 స్వాతి మే 1981
 • తెలుగు సంగతులు, బూదరాజు రాధాకృష్ణ, మీడియా హౌస్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2003.

"గుర్తింపుకు నోచుకోని బహుముఖ ప్రజ్ఞాశాలి దిగవల్లి శివరావు" కంచి వాసుదేవరావు, వ్యక్తులు వ్యక్తిత్వాలు 121, శ్రీవాణి అక్టోబరు 2001

                                     
 • త ల గ రచయ త, య త ర క డ ఇతడ క శ య త ర చర త ర వ శ ష ల ప స తకర ప గ వ ల వర చ న వ యక త గ స ప రస ద ధ డ క శ య త ర చర త ర మ దట స ర అచ చ అయ నప డ క మల శ వర
 • చర త రక గ న ఈ గ ర థ ప న ప రధ న గ ఆధ రపడ డ ర ఆ ప ర ధ న యత స తర చ క న న క శ య త ర జర గ న ప ర త ల త ద ల వ వర ల ఇల ఉన న య 1830 మ 18 - చ న నపట టణ
 • స హ త య ప షణ వ ట వ షయ ల ల క ష చ శ ర త ల త ల గ య త ర చర త ర క శ య త ర చర త ర గ ర థ న న ద న రచయ త, శ ర న వ స ప ళ ళ స న హ త డ అయ న ఏన గ ల వ ర స వ మయ య
 • ప స తక ల మ ర గదర శకమ త య క శ య త ర చర త ర 1838 - ఏన గ ల వ ర స వ మయ య న లగ ర య త ర 1953 - క ల శ ష చల య త ర చర త ర ర డ భ గ ల - 1915 - మ డప క
 • మ దట రచన. గ తమ బ ద ధ చర త రమ ప డవ ద తమ అన గద య క వ యమ ల క శ య త ర చర త ర పద య మ క త వళ మ న నగ గ ర థమ లన రచ చ న అమ తస రమ ల క న న
 • క ట బ స వక ల పర వ ర త క శ య త ర చ స న ఏన గ ల వ ర స వ మయ య ఆ య త రన త ల గ ల మ ద ర తమ న త ల ట ర వ ల గ క శ య త ర చర త రగ మల చ ర ఆ ప రయ ణ ఈ
 • క ట బ స వక ల పర వ ర త క శ య త ర చ స న ఏన గ ల వ ర స వ మయ య ఆ య త రన త ల గ ల మ ద ర తమ న త ల ట ర వ ల గ క శ య త ర చర త రగ మల చ ర ఆ ప రయ ణ ఈ
 • గ ర గ ర యన క ల డర య క క మ మ ల స వత సరమ ఏన గ ల వ ర స వ మయ య గ ర క శ య త ర చర త రన ఆయన మ త ర డ క మల శ వరప ర శ ర న వ స ప ళ ళ గ ర మ దట స ర గ
 • స వత సర తమ నక ఇ క 119 ర జ ల మ గ ల నవ 1831 : క శ య త ర చర త ర ఏన గ ల వ ర స వ మయ య రచ చ న క శ య త ర చర త ర వ శ ష ల మ ద సమగ రమ న రచన. త ల గ ల య త ర స హ త వ న క
1838
                                               

1838

ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838 లో ముద్రించారు. ఈ గ్రంథం 1869లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంథం 1941లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు క్రొత్త ఢిల్లీలో తిరిగి ముద్రించారు.

Users also searched:

...

ఇక్కడ ఒక నది ఉండేది!.

చరిత్రలో నేడు చరిత్రలో ఈ రోజు may 18 1830 కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రా సాహిత్వానికి ఈ. Untitled eGyanKosh. కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరస్వామయ్య కాశ్మీర దీపకలిక నాయిని కృష్ణకుమారి నా అమెరికా యాత్ర ఎన్‌. గోపి నేను చూసిన అమెరికా అక్కినేని నాగేశ్వరరావు. నవల: తొలి తెలుగు. The Mystery Of Floating Stone In Rameshwaram Telugu Nativeplanet. అనుకుని యధావిధిగా కాశీయాత్ర, లింగ ప్రతిష్ట చేసి ధ్యానించగానే లింగంలో శంకరుడు గడిపి తరించాడు, అందువల్లే నీకీ నాడు కల్పవృక్షం వంటి శ్రీ గురు చరిత్ర లభించింది. అతడి.


...