Back

ⓘ పారా
పారా
                                     

ⓘ పారా

పారా దీనినే జుజ్ అర్థం "భాగము". ఖురాన్ను 30 భాగాలుగా విభజించారు. ప్రతిభాగం దాదాపు సమానంగావుండేటట్టు చూశారు. ఈవిధంగా భాగీకరించడము వలన ఒక నెలలో పఠించడానికి అనువుగావుంటుంది, ముఖ్యంగా రంజాన్ మాసంలో. రంజాన్ నెలలో తరావీహ్ నమాజులు చదువుతారు, ఈనమాజులలో ప్రతిరోజు ఒక ఖురాన్ భాగాన్ని పఠిస్తారు. ప్రతి జుజ్ రెండు హిజ్బ్ విభజింపబడివుంటుంది. ఖురాన్ లోని పార-యె-అమ్మా 30వ పారా. ఇందు 78 నుండి 114 సూరాలు గలవు. చాలా చిన్నసూరాలు గల ఈ పారా పఠించడానికి చాలా సులభం. సాధారణంగా నమాజ్ లలో వీటిని పఠిస్తారు. దీనిలోని సూర-ఎ-ఫాతిహా ప్రారంభించి పిల్లలకు పార-యె-అమ్మా ప్రథమంగానేర్పిస్తారు.