Back

ⓘ మస్జిదుల్ హరామ్
మస్జిదుల్ హరామ్
                                     

ⓘ మస్జిదుల్ హరామ్

అల్-మస్జిద్-అల్-హరామ్, ప్రపంచంలోనే అతి పెద్ద మస్జిద్. మక్కా నగరంలో గలదు. ఈ మస్జిద్ కాబా గృహం చుట్టూ గలదు. ప్రపంచంలోని ముస్లింలు అందరూ కాబావైపు తిరిగి ప్రార్థనలు చేస్తారు. దీనిని ఖిబ్లా అనిగూడా అంటారు. ముస్లింలు దీనిని ప్రపంచంలోనే పరమపవిత్రంగా భావిస్తారు. ఈ మస్జిద్ ను సాధారణంగా హరామ్ లేదా హరమ్ షరీఫ్ అని అంటారు.

ప్రస్తుతం ఈ మస్జిద్ యొక్క వైశాల్యం 356.800 చదరపు మీటర్లు. హజ్ సమయంలో దీని లోపలి, వెలుపలి భాగంలో దాదాపు 40 లక్షలమంది నమాజ్ చేసే సౌకర్యం గలదు.

                                     

1. చరిత్ర

ఇస్లాం సంప్రదాయాల ప్రకారం ఈ మస్జిద్ ను అల్లాహ్ ఆజ్ఞతో మానవసృష్టి అల్లాహ్ ను పూజించుటకు దేవదూతలు నిర్మించారు. ఈ మస్జిద్ కు సరాసరి పైభాగాన "అల్-బైతుల్-మామూర్" అరబ్బీ: البيت المعمور, "దేవదూతల ప్రార్థనా స్థలం" గలదు. మొదటిసారిగా కాబాను ఆదమ్ ప్రవక్త మానవుడు నిర్మించాడు. కాలగర్భంలో ఎన్నో ప్రాకృతిక ఆటుపోట్లకు లోనై శిథిలావస్థకు చేరుకున్నది. దీనిని తిరిగీ ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడైన ఇస్మాయీల్ సహకారంతో పునర్నిర్మించాడు. ఇక్కడే "హజ్ర్-ఎ-అస్వద్ నల్లని రాయి ఉల్కరూపంలో భూమిపై చేరింది. ఈ మస్జిద్ ప్రాంతంలోనే జమ్ జమ్ బావి కూడాయున్నది. అన్ని ఋతువులలోనూ సజలంగా వుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తూంది ఈ బావి.

హిజ్రత్ తరువాత, మహమ్మదు ప్రవక్త మక్కాపై రక్తరహిత విజయం సాధించిన తరువాత, మక్కావాసులు స్వయంగా కాబా గృహంనుండి విగ్రహాలను తొలగించారు, కాబాను పరిశుధ్ధం చేశారు. కాబా ముస్లింల ఏకేశ్వరోపాసక తీర్థయాత్ర అయింది. ముస్లింలు ఈ కాబా చుట్టూ ఒక మస్జిద్ ను నిర్మించారు.

692 లో మొదటిసారిగా ఈ మస్జిద్ ను విశాలీకరించారు. మూడు మీనార్లను కూడా నిర్మించారు.

1399 లో ఈ మస్జిద్ కొంతభాగం అగ్ని బారిన పడింది. ఇంకోసారి భారీవర్షాలమూలంగా కొద్దిగా దెబ్బతింది. తిరిగీ ఈ మస్జిద్ ను పునర్నిర్మించారు. ఈసారి పాలరాయినీ కలపనీ ఉపయోగించారు. 1570 లో ఇంకోసారి దీనినిర్మాణం చేపట్టారు. 1629 లోనూ విశాలీకరిస్తూ పునర్నిర్మించారు.

                                     

1.1. చరిత్ర సౌదీ అభివృధ్ధి

1620 లో భారీవర్షాల మూలంగా దెబ్బతింది. సౌదీయులు దీనిని తిరిగి పునర్నిర్మించారు. ఈ సారి, ఈ కట్టడం దాదాపు 3శతాబ్దాల పాటు వుండినది. ఈసారి దీనికి నాలుగు మీనార్లు నిర్మించారు. రెండవ నిర్మాణలో "ఫహద్ రాజు" బాహ్య ప్రార్థనా హాలును, ఫహద్ ద్వారాన్ని నిర్మించాడు. ఈ నిర్మాణం 1982-1988 లో జరిగింది.

సౌదీయుల మూడవ విశాలీకరణ 1988-2005 లో మరికొన్ని మీనార్లు నిర్మించారు. అరఫాత్, మినా, ముజ్ దలిఫా లను అభివృధ్ధిపరచారు. ఈ సారి మస్జిద్ కు 18 ద్వారాలతోనూ 500 పాలరాతి స్తంభాలతోనూ నిర్మించారు. నవీనపద్ధతులతో విశాలమైన హాలులతో అధునాతనరూపంలో దీనిని నిర్మించారు.

నాలుగవ విశాలీకరణ 2007 నుండి 2020 వరకూ జరుగునట్లు ప్రణాళికలు రూపొందించారు. ఈ సారి మస్జిద్ ను 35% విశాలీకరణ్ జరుగునట్లు 11.20.000 మంది సామూహిక ప్రార్థనలు జరుపుకొనునట్లు ప్రణాళికలను సిధ్ధపరిచారు.

                                     

2.1. మతపరమయిన ప్రాముఖ్యత ఖిబ్లా

ఖిబ్లా ముస్లింలు ప్రార్థనలకు నిలుచునపుడు ఈ కాబా దిక్కువైపునే తిరిగి ప్రార్థనలు చేస్తారు. కాబాను ఖిబ్లాగా చేయకమునుపు ముస్లింలకు బైతుల్-ముఖద్దస్ ఖిబ్లాగా వుండేది. కాని ఈ ఖిబ్లా కేవలం 17 నెలలు మాత్రమే వుండినది. మహమ్మదు ప్రవక్త సహాబా ల ప్రకారం ఓసారి మదీనాలో మధ్యాహ్నపు ప్రార్థనల నిమిత్తం మస్జిద్ అల్-ఖిబ్లతైన్లో బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి ప్రార్థిస్తూ వుండగా యకాయకిన అల్లాహ్ నుండి ఆదేశం వెలువడింది మీ ఖిబ్లాను కాబా దిశ వైపు మార్చు కోండి అని. ఒకేప్రార్థన నమాజ్ లో రెండు ఖిబ్లాలు గల నమాజును చేశారు గనుక ఈ మస్జిద్ను మస్జిద్ అల్-ఖిబ్లతైన్ అనే పేరొచ్చింది.

                                     

2.2. మతపరమయిన ప్రాముఖ్యత పుణ్యక్షేత్రం

"హరమ్" హజ్, ఉమ్రా తీర్థయాత్రికులకు కేంద్రబిందువు. హజ్ ఇస్లామీయ కేలండర్ లోని పన్నెండవ నెలయైన జుల్-హజ్జాలో సంభవిస్తుంది. ఉమ్రా సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చును. హజ్ యాత్ర ఇస్లాం ఐదు మూలస్థంభాలులో ఐదవది. స్తోమతవున్న ప్రతి ముస్లిం జీవితంలో కనీసం ఒక్కసారైనా దీనిని పూర్తి చేయవలెను. ప్రతియేటా 30లక్షలమంది తీర్థయాత్రికులు ఈ హజ్ తీర్థయాత్రను పూర్తిచేస్తారు.

                                     

2.3. మతపరమయిన ప్రాముఖ్యత కాబా

సాహిత్యపరంగా కాబా అనగా చతురస్రాకారపు గృహం.

కాబా కు కొన్ని ఇతర నామాలు:

  • అల్-బైత్ ఉల్-అతీఖ్ అనగా అత్యంత ప్రాచీన, స్వతంత్రమైన.
  • అల్-బైత్ ఉల్-హరామ్ అనగా అత్యంత గౌరవప్రధమయిన గృహం.

బూడిదనీలం రంగుగల రాళ్ళతో చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే ఈ కాబా. నలువైపులా నాలుగు విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున హజ్ర్-ఎ-అస్వద్ ఉత్తరం వైపున రుక్న్-అల్-ఇరాఖీ ఇరాకీ మూల, పశ్చిమాన రుక్న్-అల్-షామి సిరియన్ మూల, దక్షిణాన రుక్న్-అల్-యెమని యెమనీ మూల గలవు. నాలుగు గోడలూ కిస్వాహ్ తెర చే కప్పబడిఉన్నవి. కిస్వాహ్ సాధారణంగఅ నల్లని తెర, దీనిపై షహాద వ్రాయబడివుంటుంది. బంగారపు ఎంబ్రాయిడరీచే ఖురాన్ ఆయత్ లు వ్రాయబడివుంటాయి. హతీం:కాబా గర్భగుడికి ఒకవైపు 9 అడుగుల అర్ధచంద్రాకార ఖాళీ స్థలం.ఖాళీగా వదిలిన కాబా స్థలాన్ని కాబాలో కలిపేయాలని ముహమ్మద్ ప్రవక్త అనుకున్నారు. ముస్నద్ అహ్మద్.అబ్దుల్లా బిన్ జుబైర్ కాలంలో ఆ ఖాళీ స్థలం కలిపి కాబాను నిర్మించారు.కానీ ఆయన చనిపోయాక మళ్ళీ ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు.ఎందుకనో ముహమ్మద్ ప్రవక్త కోరుకున్నట్లుగా ఈ స్థలాన్ని సౌదీ ప్రభుత్వం ఈనాటికీ కాబాలో కలపలేదు.                                     

3. ముఅజ్జిన్ లు

హరమ్ షరీఫ్ లో ముఅజ్జిన్లు 16 మంది తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రంజాన్ నెలలో మరి ఆరు మంది నియుక్తులవుతారు. ముఅజ్జిన్ లు ధార్మికంగాను, సత్యసంధులుగాను, మధురమైన గొంతును అజాన్ పలుకుటకు కలిగివుండవలెనని నిబంధన.

                                     

4. ఘటనలు

1979 లో మస్జిద్ ఆక్రమణ

1979 నవంబరు 20 న కొంతమంది తీవ్రవాదులు మస్జిద్ పై ఆక్రమణ చేశారు. ఈ సంఘటన యావత్ ముస్లిం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సౌదీబలగాలు తీవ్రవాదులను వధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

1987 ఘటనలు

1987 జూలై 31 ఇరానీ యాత్రికులు సామూహికంగా ప్రదర్శన జరిపి మస్జిద్-అల్-హరామ్ ను తమ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నంచేశారు. సౌదీ సెక్యూరిటీగార్డుల కాల్పులలో 402 మంది యాత్రికులు మరణించారు ఇందులో 275 ఇరానీయులు, 85 మంది సౌదీయులు పోలీసులతోసహా, 45 మంది ఇతర దేశస్థులు). 649 మంది గాయపడ్డారు.
                                     

5. బయటి లింకులు

  • Great Mosque of al-Haram
  • QiblaLocator.com can find the direction of the kabah from anywhere in the world.
  • 3D Kabah has some computer generated images and clickable panoramic views of parts of the Masjid al-Haram.

మూస:Geolinks-buildingscale