Back

ⓘ యౌమ్-అల్-ఖియామ
యౌమ్-అల్-ఖియామ
                                     

ⓘ యౌమ్-అల్-ఖియామ

ఒకానొక రోజు సర్వసృష్టీ అంతమగును. ఆ రోజునే ఇస్లాంలో యౌమ్-అల్-ఖియామ అర్థం ప్రళయాంతదినం, సృష్టి యొక్క ఆఖరి రోజు. ఖయామత్ పై విశ్వాసముంచడాన్ని అఖీదాహ్ అంటారు. ఖయామత్ గురించి ఖురాన్ లోను, హదీసుల లోనూ క్షుణ్ణంగా వర్ణింపబడింది. ఉలేమాలు అయిన అల్-ఘజాలి, ఇబ్న్ కసీర్, ఇబ్న్ మాజా, ముహమ్మద్ అల్-బుఖారి మొదలగువారు విశదీకరించారు. ప్రతి ముస్లిం, ముస్లిమేతరులు తమ కర్మానుసారం అల్లాహ్ చే తీర్పు చెప్పబడెదరు - ఖురాన్ 74:38. ఖురానులో 75వ సూరా అల్-ఖియామ పేరుతో గలదు.

                                     

1. వీక్షణం

మనిషికి తెలియని సమయానో, ముందే నిర్ణయింపబడిన, మానవులు యోచించిగూడా యుండరు, అల్లాహ్ ఖియామత్ కు ప్రారంభంకమ్మని అనుమతిస్తాడు. అపుడు మలక్ ఇస్రాఫీల్ తన బాకాను ఊదుతాడు, సత్య విస్ఫోటనం జరుగుతుంది. ఖురాన్: 50.37-42, 69.13-18, 74.8, 78.18. అనగా సత్యంగోచరిస్తుంది, "అసత్య వినాశనమే సత్యం". స్త్రీపురుషులందరూ మరణిస్తారు, దుర్మార్గులకు అల్లాహ్ గాఢమైన నిర్ణయాలేమో విశదంకావు, ప్రతి చెడూ నరకాగ్నికి ఆహుతి అవుతుంది. ఇంకోవైపు ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసముంచి జీవనకాలంలో సచ్చీలురుగాజీవిస్తారో, జీవించియున్నప్పుడు సత్యసంధతా, స్వచ్ఛమనస్సులతో, పరిశుభ్రమైన జీవితంగడుపుతూ, తమపాపములపట్ల పశ్చాత్తాపపడుతూ, అల్లాహ్ తో ప్రాయశ్చితంకోరుతూ గడుపుతారో వారు జన్నత్లో ప్రవేశిస్తారు, ఈ జన్నత్ క్రింద నదులు ప్రవహిస్తూవుంటాయి. ప్రపంచం నాశనం చేయబడుతుంది. మరణించినవారు వారివారి సమాధులనుండి లేచి ఒకచోట గుమిగూడుతారు, అచటవారు తమ క్రియాఫలాలకొరకు వేచివుంటారు.

విశ్వాసుల చిన్నచిన్న కార్యాలుగూడా దురుపయోగంచేయబడవని ఖురాన్ చెబుతోంది. ఎవరైనా అణువంత మంచిచేసియున్ననూ, చెడుచేసియున్ననూ గమనింపబడెదరు, ఖురాన్: 99:7-8. ఒకవేళ ముస్లింలైయుండి మంచిచేసినచో ఇహలోకంలోనేగాక పరలోకంలోగూడా బహుమానాలు పొందెదరు. ఏమైనా, ఆఖరితీర్పు అల్లాహ్ చేతుల్లోనేవుంది. ఖురాన్: 2:62

"అతను ప్రశ్నిస్తాడు: "ప్రళయదినం ఎప్పుడొస్తుంది?". చాలాసేపువరకూ కళ్ళుమిరమిట్లుగొలిపేదృశ్యం గోచరిస్తుంది, తరువాత సూర్యచంద్రులు తమస్సులో గాఢాంధకారంలో సమాధిచేయబడుతారు. సూర్యచంద్రులు ఇరువురూ కలిపివేయబడుతారు. ఖురాన్: 75.6-9

                                     

2. విగ్రహాల తిరస్కరణ

ఇన్నాళ్ళూ పూజలందిన విగ్రహాలు, మూర్తులు అల్లాహ్ యే సర్వేశ్వరుడని, తాము తప్పుగా పూజింపబడ్డామని ఘోషిస్తాయి. ఈసా ప్రవక్త తిరిగొస్తాడు, తనను సర్వేశ్వరుడిగా చిత్రీకరించడాన్ని తిరస్కరిస్తాడు. ఖురాన్ 9:31.43.61. మహమ్మదు ప్రవక్త ప్రవచించారు ప్రజలలో ఎవరైనా మతపెద్దలు,మహనీయులు,ఫకీరులు, సెయింట్లు మరణించినపుడు, వారి సమాధులపై పూజాగృహాలను ఏర్పాటుచేసేవారు, వారిచిత్రపటాలను తగిలించేవారు, అల్లాహ్ దృష్టిలో, "ఖయామత్ రోజున వారు అత్యంతనీచమైనవారు". సహీ బుఖారి.

 • ఆరోజున దేవుడు తనకు బదులుగా ప్రజలు పూజించిన విగ్రహాలను ఒకచోట చేర్చి ప్రజల్ని మీరు దారి తప్పించారా వాళ్ళకై వాళ్ళే దారితప్పారా?" అని అడుగుతాడు.అందుకు ఆ చిల్లర దేవుళ్ళు "అయ్యో దేవా, మాకు అంత దైర్యం లేదు. వాళ్ళే నిన్ను మరచి నాశనమై పోయారు" అంటారు. ఖురాన్ 25:17.18
 • మీరు కల్పించుకున్న దేవుళ్ళంతా ఇప్పుడు ఎటుపోయారు? అని ఆరోజున దేవుడు అడిగితే "నీ సాక్షి మేమెప్పుడూ బహుదైవతారాధన చేయలేదు దేవా" అని బొంకుతారు. ప్రజలు కల్పించుకున్న దైవాలన్నీ మాయమైపోతాయి. ఖురాన్ 6:22.24
                                     

3. ఖయామత్ ఎలాగుంటుంది

సకల చరాచర జగత్తూ నశిస్తుంది, మానవులందరూ నశిస్తారు, మొత్తం విశ్వం నశిస్తుంది. మానవులందరినీ తిరిగి జీవంపోసి అల్లాహ్ తీర్పునిస్తాడు. సహీ బుఖారి హదీసుల ప్రకారం మానవులకు వారి వారి కర్మానుసారం స్వర్గ నరక తీర్పులు జరిగాక "మరణానికి కూడా మరణం సంభవిస్తుంది", అనంతజీవనం ప్రారంభమవుతుంది, ఇక్కడ మరణమంటూ వుండదు.

                                     

4. బర్జఖ్

బర్జఖ్ మరణించిన తరువాత ఏర్పడు లేక కలుగు స్థితి లేక కాలం. ఈ స్థితికలుగు సమయంలో ఇజ్రాయీల్ మరణదూత జీవి యొక్క శరీరమునుండి ఆత్మను వేరుచేస్తాడు. ప్రాణంతీయడం సుళువుగానూ లేక అతికష్టం కలుగజేస్తూ గావచ్చు. జీవితంలో సత్ప్రవర్తనగలవారికి సుళువుగాను, దుర్ప్రవర్తనగలవారికి అతికష్టంగానూ ప్రాణాలు తీయబడును ఖురాన్ 79.1-2. మూడు ముఖ్యమైన సంఘటనలు బర్జఖ్ కాలంలో జరుగుతారు.

 • శరీరమునుండి ఆత్మ వేరుచేయబడును.
 • మున్కర్, నకీర్లు ప్రశ్నోత్తరాలు చేయుదురు.
"మీ ప్రభువెవ్వడు?" "మీ ధర్మమార్గమేది?" "మీ ధర్మ మార్గదర్శకుడెవ్వరు ఇమామ్ లేదా ప్రవక్త?" Sura 17.71
 • సమాధి గోరీ లోని "భయానక" "వహష్" స్థితి మనిషి తనజీవితంలో గడిపిన ధార్మికజీవనంపై ఆధారపడి వుంటుంది.

మహమ్మదు ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు ".ఇవి మనిషి జీవితంలోని అతి దుర్భర ఘడియలు".

                                     

5. అల్-కౌసర్

విశ్వాసులందరినీ గైకొని మహమ్మదు ప్రవక్త ఒక సరస్సు వద్దకు తీసుకెళతారు, ఈ సరస్సు పేరు అల్ కౌసర్ అల్-కౌతర్, అరబ్బీ الكوثر, విశ్వాసుల దప్పికను తీర్చబడును. ఈ సరస్సునందు పానీయము పాలవలె తెల్లగాను తియ్యగానుండును, ఈపానీయము త్రాగినవారికి మరెల్లడునూ దప్పికగలగదు. ఇంకొక హదీసులో ఇలా ఉల్లేఖించబడినది, "అల్-కౌసర్" అనునది జన్నత్ లోని ఒక నది" సహీ బుఖారి 76:583

                                     

6. "అల్లాహ్" దర్శనం

సహీ ముస్లిం, సహీ బుఖారి హదీసుల ప్రకారం, విశ్వాసులు మరణానికి పూర్వం అల్లాహ్ను చూడలేరు. ఇబ్న్ తైమియా ప్రకారం ఈ ఉల్లేఖనాలు హఖీఖి కావు, కానీ అందరూ ఈ విషయాన్ని మాత్రం అంగీకరిస్తారు "మరణించిన తరువాత అల్లాహ్ ను దర్శించవచ్చు" అని. ఇంకో హదీసుప్రకారం విశ్వాసులు అల్లాహ్ ను దర్శిస్తారు, ఏవిధంగా ఐతే మనం జీవించి యున్నప్పుడు సూర్యచంద్రులను చూస్తామో ఆవిధంగా చూడగలం.

                                     

7. తీర్పు

తీర్పుకాలంలో మనిషి పురుషుడు లేక స్త్రీ యొక్క స్వీయాలు జీవితంలో చేసిన క్రియల పుస్తకరూపం తెరవబడుతాయి, వీరుచేసిన ప్రతికార్యం, పలికిన ప్రతి పదమూ ముందుకు తీసుకు రాబడుతాయి ఖురాన్ 54.52-53. పసిప్రాయంలోచేసిన పనులు పరిగణలోకి తీసుకోబడవు. మానవ క్రియల లెక్కలు చాలా సంపూర్ణంగావుంటాయి, వీటిని చూసి వీటి సమగ్రత పట్ల ఆశ్చర్యచకితులవుతారు, ప్రతిచిన్న పనీ లిఖించబడివుంటుంది. ఖియామత్ ఘడియ ఆసన్నమైనపుడు, దీనిని తిరస్కరిస్తారు, వీరికి హెచ్చరిక, ఈ ఖయామత్ బాధాకరమైన ఘడియలు తీసుకువస్తుంది. ఖురాన్ 30.55-57, 19.39. ఎవరైతే తమ క్రియలను స్వీకరించరో, వారి దేహభాగాలు సాక్షాలు చెబుతాయి. ఖురాన్ ఈ విధంగా ప్రవచిస్తుంది "ఈనేరాలే సాక్షాలు చెబుతాయి, అసత్యమాడడం, అగౌరవాలు, లంచాలు, అల్లాహ్ సూక్తులపట్ల నిర్లక్షతా భావన, తీర్పుదినాన విశ్వాసం లేకపోవడం, పేదలపట్ల నిర్దయ, చెడ్డ అలవాట్లు, పేదలను వంచించి అక్రమార్జన చేయుట వగైరాలు".

తీర్పుదినాన, ప్రాశస్తమైన విషయం అల్లాహ్ నిష్పాక్షికంగా తీర్పు చెపుతాడు. సత్ప్రవర్తనగలవారికి ఒకటీ అరా పాపాలున్ననూ అల్లాహ్ తన దయ, కరుణతో వారిని మన్నించి మోక్షమును కల్గించి స్వర్గప్రాప్తిని కలిగిస్తాడు. హిందూ ధర్మం ప్రకారంకూడా ప్రతిజీవీ తనకర్మానుసారం స్వర్గం లేక నరక ప్రాప్తిని పొందుతాడు. అలాగే పరమేశ్వరుడు అమిత దయాళువు, తన దయాకరుణలతో భక్తులకు విశ్వాసులకు మన్నించి మోక్షాన్ని, స్వర్గప్రాప్తినీ కలిగిస్తాడు. ఇస్లాం ఇదేవిషయాన్ని అల్లాహ్ తన సంపూర్ణమయిన నిష్పాక్షికమయిన తీర్పును తన దయాగుణాన్ని రెండిటినీ ప్రదర్శిస్తాడని చాటుతుంది.                                     

8. జహన్నమ్ నరకం, జన్నత్ స్వర్గం

తీర్పు తరువాత స్త్రీపురుషులందరూ ఓపెద్ద అగాధాన్ని దాటవలసివుంటుంది. ఈ అగాధం నుండి నరకాగ్నిజ్వాలలు ఎగిసిపడుతూంటాయి, ఈ అగాధంపై ఓ వంతెన "అస్-సిరాత్" الصراط పుల్ సిరాత్, చాలా సున్నితమైన వంతెన, ఈ వంతెనను దాటడం చాలా కష్టం, కారణం కంటికి కనపడనే కనపడదు. హదీసుల ప్రకారం ఈ వంతెన వెంట్రుకలోని 7వ భాగమంత మందం కలిగినది, కత్తికన్నా పదునంగా వుంటుంది. విశ్వాసులు స్వర్గప్రవేశ తీర్పును పొందినవారు ఈ వంతెనను సునాయాసంగా దాటగలరు, కారణం వీరికి తమసత్కార్యాలవల్ల ఈ వంతెన మందమైన రాతివంతెనలా మార్చబడును, ఇతరులు ఈ సున్నితమైన వంతెనను దాటలేక జహన్నమ్ నరకం లో పడిపోతారు.

స్వర్గ నరకాల తీర్పు అయిన తరువాత, షిఫాఅత్ الشفاعة, ప్రక్రియ ప్రారంభమగును. సహీ బుఖారి హదీసుల ప్రకారం మహమ్మదు ప్రవక్త విశ్వాసులు, సకల మానవాళి కొరకు అల్లాహ్ వద్ద ప్రార్థనలు చేసి షిఫాఅత్ లేదా మోక్షం లేదా ముక్తిని ప్రసాదింపజేయమని అర్థిస్తారు. అల్లాహ్ తీర్పు దిన అధిపతి సర్వశక్తిమంతుడూ, మానవుల స్వర్గ నరక ఇతని దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి వుంటుంది, అమిత దయాళువు అయిన అల్లాహ్ తన దయాకారుణ్యాలతో ముక్తిమోక్షాలను ప్రసాదిస్తాడు.                                     

9. తిరిగి జీవం పొందుట

ఒక హదీసులో ఇలా వర్ణింపబడింది, మహమ్మదు ప్రవక్త చే బఖ్షిష్ మహమ్మద్, అల్లాహ్ ను ప్రార్థించి క్షమాబిక్షను ప్రసాదింపజేయించుట తరువాత, అల్లాహ్ కూడా క్షమాబిక్ష ప్రసాదిస్తాడు, తన దూతలను ఆదేశిస్తాడు, ఎవరైనా తనపై విశ్వాసం ఉంచినవాళ్ళు జహన్నుమ్ నరకం లో వుంటే దుర్పవర్తనలవల్ల వారిని తీసుకురండి జన్నత్లో తీసుకుపోండి సహీ బుఖారి, మూడవ గ్రంథం కితాబుల్ ఇల్మ్. ఇంకనూ ఈ విధంగా వర్ణింపబడినది దూతలు ఆదేశింపబడుతారు, ఎవరైనా రవ్వంత సత్కార్యం చేసున్ననూ, వారి హృదయాలలో అణువంత సత్యమున్ననూ వారిని జహన్నుమ్ నుండి తీసి జన్నత్ లో వేయండి అని. అసత్యదేవతలను పూజించువారునూ, బహుదేవతారాధకులకునూ షిర్క్ చేయు వారు, విగ్రహారాధకులకునూ జహన్నుమ్ నుండి విముక్తి లేదు. తదనంతరం మోక్ష ప్రసాదాలనంతరం జీవితం తిరిగి ప్రారంభం అవుతుంది, జన్నత్ స్వర్గం లేక జహన్నుమ్ నరకం లో. ఇది అనంతజీవనం.

                                     

10. మూలాలు

 • ఖయామత్ సూచనలు
 • Richard C. Martin, Said Amir Arjomand, Marcia Hermansen, Abdulkader Tayob, Rochelle Davis, John Obert Voll, ed. 2003. ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం అండ్ ది ముస్లిం వర్ల్డ్. MacMillan Reference Books. ISBN 978-0028656038. CS1 maint: multiple names: editors list link
 • అల్ ఘజాలి
 • ఖురాన్
 • ఎస్పొసిటో, జాన్ 2003. ద ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఇస్లాం. Oxford University Press. ISBN 0-19-512558-4.
 • హదీసులు, సహీ బుఖారి
                                     

11. బయటి లింకులు

 • Tajweed ul Quran
 • Signs of the Appearance of the dajjal and His Destruction
 • Signs of Qiyamah
 • Judgment day in the Qurân and hadith
 • Islam Basics
 • The two blowings of the Trumpet of Light which ushers in the period of Judgment
 • Signs of the Last Hour