Back

ⓘ తెలుగు వికీపీడియా
                                               

అంగజాల రాజశేఖర్

డాక్టర్ అంగజాల రాజశేఖర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యులు. వీరు నేషనల్ పాథాలజీ లాబొరేటరీని హైదరాబాదులో స్థాపించారు. ఆయన తెలుగు భాషాభిమాని. తెలుగు వికీపీడియా సంస్థలో అధికారి.

                                               

సి.చంద్రకాంతరావు

వారి తండ్రిగారు మండల విద్యాధికారిగా పనిచేసారు.వారు కోడంగల్ వాస్తవ్యులే కాని ఉద్యోగరీత్యా తాండూరులో ఉండటంతో వారు తాండూరులో స్థిరపడాల్సి వచ్చింది. చంద్రకాంతరావు డిగ్రీ వరకు తాండూరులో చదివారు.ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ., ఎం.ఫిల్, బి.యిడి, బి.ఎల్.ఐ.ఎస్.సి లను పూర్తి చేసారు. 1995 లో బషీరాబాదు మండల కేంద్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు.నాలుగు నెలలలోనే గ్రూప్-2ఎకు ఎంపికై రాష్ట్ర ఆడిట్ శాఖలో సీనియర్ ఆడిటరుగా ఉద్యోగాన్ని సాధించారు. మహబూబ్‌నగర్‌లోనే 2009 వరకు పనిచేశారు. 2009 నుంచి 2012 వరకు రంగారెడ్డి జిల్లా హైదరాబాదులో పనిచేసి మళ్ళీ మహబూబ్ నగర్ వచ్చారు. ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస ...

                                               

సెప్టెంబర్ 7

1953 - 2017: తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి వికీవత్సరం అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2017, సెప్టెంబరు 7న వికీవత్సరం పూర్తిచేశాడు.

                                               

డిసెంబర్ 10

1955: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరవ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం 10 డెసెంబర్ 1973 నుంచి 1978 మార్చి 6 వరకు. 1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారిగా విధింఛిన రాష్ట్రపతి పాలనకు ఆఖరి రోజు 1973 జనవరి 10 నుంచి 1973 డిసెంబర్ 10 వరకు. 2004: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు. 2003: తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.

                                               

మే 8

1886: న్యూ యార్క్ హార్బరులో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రూపు దిద్దుకుంటున్న సమయంలో, అక్కడికి 800 మైళ్ళ దూరంలో ఉన్న అట్లాంటా లోని జాన్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ కోకా కోలా డ్రింక్ ని తయారుచేసాడు. 2004 - 2008 - తెలుగు వికీపీడియా 40.000 వ్యాసాల మైలు రాయిని దాటిన రోజు.

                                               

జూన్ 4

2010: జపాన్ ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు. 2004: భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు. 1938: మూడవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి. 2019: తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి వికీఛాలెంజ్ అనే కాన్సెప్ట్‌తో వరుసగా 1000రోజులు - 1000వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2019, జూన్ 4న వికీవెయ్యిరోజులు పూర్తిచేశాడు.

                                               

1985

జనవరి 1: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది. డిసెంబర్ 19: భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడు. ఆగష్టు 17: పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి భారత ప్రధాని రాజీవ్ గాంధీచేత శంకుస్థాపన.

                                               

2003

ఫిబ్రవరి 20: 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్లో ప్రారంభమైనది. 2003: అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది. డిసెంబరు 9: తెలుగు వికీపీడియా ఆవిర్భవించింది.

                                               

1966

డిసెంబర్ 9: ఐదవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.

                                               

అయోమయ నివృత్తి పద అర్ధం

అయోమయ నివృత్తి ని ఆంగ్లంలో డిసంబిగేషన్ అంటారు., ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉండవచ్చు లేక అనేక పదాలు ఉండవచ్చు. అలాగే ఒకే పదం రెండు లేక అంతకంటే ఎక్కువ పదాలకు వేరు వేరు అర్ధాల నివ్వవచ్చు. ఒకే పదానికి ఉన్న వేరు వేరు అర్ధాలను నివృత్తి చేసుకొనుటను అయోమయ నివృత్తి అంటారు. తెలుగు వికీపీడియాలో ఒకే అర్ధాన్నిచ్చే వ్యాసాలు ఉన్నప్పుడు అయోమయ నివృత్తి పేజీ తయారు చేసి అనగా వ్యాసంలో అయోమయ నివృత్తి మూస చేర్చి ఆ పేజీ లో నుండి సంబంధించిన వ్యాసాలకు వికీలింకులిస్తారు. అయోమయ ప్రయోజనాల కోసం ఉపయోగించే ఇతర వనరులు రోజెట్ యొక్క థెసారస్ మరియు వికీపీడియా, ఇటీవల, బాబెల్ నెట్ అనే బహుభాషా ఎన్సైక్లోపెడిక్ నిఘంటువు, ...

                                               

నవంబర్ 2006

వికీపీడియా గురించి ఈనాడు ఆదివారం పుస్తకంలో వ్యాసం వచ్చింది. ఇది తెవికీ ప్రస్థానంలో ఓ మలుపు. ఈ వ్యాసానికి స్పందనగా ఎన్నడూ లేనంత ఎక్కువ మంది కొత్త సభ్యులు ఈ ఒక్క రోజే చేరారు.

                                               

తెలుగు పద్యము

పద్యము తెలుగు కవితా రచనలో ఒక విధానము. పూర్వం తెలుగులో సాహిత్యరచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు. వైజ్ఞానిక రచనలు, గణిత రచనలు, సాహిత్యపరమైన రచనలు మొదలుకొని అనేకానేకమైన విధాలైన రచనలు కూడా పద్యాల్లో ఉండేవి. పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు. 848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లున ...

తెలుగు వికీపీడియా
                                     

ⓘ తెలుగు వికీపీడియా

2001, జనవరి 15న మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞానసర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్, లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం, మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. అంతర్జాలంలో ప్రజాదరణ పొందిన వెబ్ సైట్లలో 2017 లో ఈ వెబ్సైట్ 5వ స్థానంలో ఉంది.

ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం, భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరువాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అభివృద్ధి పథంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే వెన్న నాగార్జున కృషితో 2003 డిసెంబరు 10 న ఆవిర్భవించిన తెలుగు వికీపీడియా తెవికీ. దీనిలో చాలామంది సభ్యులై అభివృద్ధి పథంలో నడిపించారు. తెలుగు వికీపీడియా మొదటిపేజీ వివిధ రకాల శీర్షికలతో అందరినీ ఆకట్టుకొనేటట్లుగా ఉంటుంది. తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి వ్యాసాలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనే లక్ష్యంతో విశేష వ్యాసం అనే శీర్షికతో అప్పుడప్పుడు మొదటిపేజీలో మంచి వ్యాసాన్ని ప్రదర్శించేవారు. 2005 నవంబరు 14న గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది. ఈ ప్రక్రియ తరువాత "ఈ వారపు వ్యాసాలు"గా మారింది. 2007- 23 వ వారం జూన్ లో మొదటిసారి సుడోకు వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా ప్రదర్శించడమైందిది.

2011 లో ఆంగ్ల వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. వాటిలో క్రియాశీలంగా ఉన్న ఎక్కువ మంది తెలుగు వికీ ప్రాజెక్టుల సభ్యులు ముఖాముఖిగా కలుసుకొని వివిధ అంశాలపై చర్చించారు. వికీపీడియాలో అనేక మార్పులతో పాటు, సాంకేతికాభివృద్ధి కారణంగా ఆధునిక స్మార్ట్ ఫోన్లకు తెలుగు వికీపీడియా అందుబాటులోకి వచ్చింది.

వికీపీడియా సంస్థాగత రూపంలో సాధారణ సభ్యులతో పాటు సభ్యులు ఎన్నుకున్ననిర్వాహకులు, అధికారులు ఉంటారు. కొత్త సభ్యులకు వికీ గురించి నేర్చుకునేందుకు పాఠాలు, సహాయాలు, ప్రోత్సాహకాలు ఉంటాయి. 2011-2019 మధ్యకాలంలో వికీమీడియా భారతదేశం చాప్టర్, సిఐఎస్-ఎ2కే సంస్థలు వికీపీడియా అవగాహన సదస్సుల ద్వారా వికీపీడియాని అభివృద్ధి పరచటానికి సహాయం చేశాయి.

                                     

1. తెలుగు వికీపీడియా ఆవిర్భావం

బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న వెన్న నాగార్జున తెలుగు వీకీపీడియాకు శ్రీకారం చుట్టాడు. ఈయన రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం ఇది ఇంగ్లీషు కీబోర్డ్ తో తెలుగు వ్రాసే తెలుగు భాషా అనువాద పరికరం నెట్ లో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయి. ఇది క్రమంగా తెలుగు భాషాభిమానులను విశేషంగా ఆకర్షించింది. పద్మ అనే లిప్యంతరీకరణ పరికరం సృష్టితో వెలుగులోకి వచ్చిన నాగార్జునకి వికీ నిర్వాహకులలో ఒకరైన విలియంసన్ పంపిన విద్యుల్లేఖ టపా తెలుగు వీకీపీడియా ఆవిర్భావానికి నాంది పలికింది. ఆసక్తి ఉండి నిర్వహిస్తామని నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియాను రూపొందించి ఇస్తామని దాని సారాంశం. దానిని సవాలుగా తీసుకొని నాగార్జున అనుకూలంగా స్పందించాడు. ఈ విధంగా తెవికీ 2003 డిసెంబరు 10న ఆవిర్భవించింది. తెలుగు వికీపీడియా మొదటి చిహ్నాన్ని లోగోని రూపొందించిన ఘనత ఆయనదే.

                                     

2. తెలుగు వికీపీడియా అభివృద్ధి

2003 డిసెంబరులో ఆరంభించిన తెవికీలో 2004 ఆగస్టు వరకూ ఒక్క వ్యాసం కూడా నమోదు కాలేదు. తన తరువాతి ప్రయత్నాలలో ఒక భాగంగా నాగార్జున రచ్చబండ వంటి తెలుగు సమాచార సమూహములలో ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రయత్నం సక్రమ ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. రావు వేమూరి, మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా బాధ్యతను నిర్వహిస్తున్న కట్టా మూర్తి లాంటి విద్యాధికులు స్పందించారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించిన హంసవింశతి గ్రంథం, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో రాయలవారు వర్ణించిన ఊరగాయ రుచులను ఆధారంగా వ్రాసిన ఊరగాయ వ్యాసం నెట్ వాడుకరులను తెలుగు వికీపీడియా వైపు అడుగులు వేసేలా చేసింది. ఆ తరువాత వాకా కిరణ్, చావాకిరణ్‌, వైజాసత్య, మాకినేని ప్రదీపు, చదువరి మొదలైన వారి విశేష కృషితో మరింత ముందుకు సాగింది.

2005లో జూలైలో వైజాసత్య, చదువరి కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల గురించిన సమాచారం తెలుగులో చూసుకొనగలిగిన అవకాశం పాఠకులకు కలిగింది. ఈ ప్రాజెక్టులో బాటు ఆటోమేటిక్ ప్రోగ్రాం స్క్రిప్ట్లను తయారుచేసి మ్యాపులతో పేజీలను సిద్ధం చేయడంలో మాకినేని ప్రదీప్ కృషి గుర్తింపదగినది. 2005 సెప్టెంబరులో విశేషవ్యాసం, మీకు తెలుసా, చరిత్రలో ఈ రోజు శీర్షికలు ప్రారంభమయ్యాయి.

ఆ తరువాత వీవెన్ కృషితో తెవికీ రూపురేఖలు సుందరంగా తయారయ్యాయి. బ్లాగర్ల సాయంతో వైజాసత్యతో చేతులు కలిపిన కాజా సుధాకరబాబు, చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాస్, నవీన్ మొదలైనవారి కృషితో తెలుగు చిత్రరంగ వ్యాసాలు మొదలయ్యాయి. బ్లాగేశ్వరుడు, విశ్వనాధ్ పుణ్యక్షేత్రాల వ్యాసాలను రూపొందించడంలో కృషి చేశారు. రాజశేఖర్, వందన శేషగిరిరావు వంటి వైద్యులు వ్యాధులు, మానవశరీరం వంటి వ్యాసాలలో తమవంతు కృషి అందించారు. చంద్ర కాంత రావు కృషి ఆర్థిక శాస్త్రం, క్రీడారంగం వ్యాసాలను అందించడానికి దోహదమైంది. విక్షనరీలో విశేషంగా కృషి చేసిన టి.సుజాత తెవికీలో కూడా ప్రపంచ ప్రసిద్ధ నగరాలు, వంటకాల వ్యాసాలపై కృషి చేశారు. చిట్కాలు, ప్రకటనలపై దేవా, ఇస్లాము, ఉర్ధూ భాష వివరాలపైఅహ్మద్ నిసార్ కృషి చేశారు. 2007 జూన్ లో ఈ వారం వ్యాసం శీర్షిక, అక్టోబరులో ఈ వారపు బొమ్మ శీర్షిక ప్రారంభమయ్యాయి. కాసుబాబు ఈ శీర్షికలను దాదాపు ఐదేళ్లు ఒక్కడే నిర్వహించడం విశేషం. వీటిని కొంత కాలం అర్జున కొనసాగించగా, 2013 నుండి ప్రధానంగా కె.వెంకటరమణ, రవిచంద్ర నిర్వహిస్తున్నారు.

తెవికీ తెరవెనుక సంగతులను, వికీపీడియన్లను అందరికి పరిచయంచేసి, తెవికీ సముదాయ చైతన్యాన్ని పెంచే ఆశయాలతో తెవికీ వార్త 2010 జూలై 1న ప్రారంభమైంది. 8 సంచికలు తరువాత ఆగిపోయింది. 2010 లో ప్రారంభమైన గూగుల్ అనువాద వ్యాసాలు 2011 లో దాదాపు 900 పైగా వ్యాసాలు చేర్చిన తరువాత వాటి నాణ్యత పెంచడానికి తెవికీ సభ్యుల సూచనలు అమలు చేయకుండానే ఆగిపోయాయి. వీటివలన సగటు వ్యాస పరిమాణం పెరిగింది. 2011 లో వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. తెలుగు వికీపీడియన్లు భారత వికీ సమావేశం 2011 లో పాల్గొన్నారు. వికీమీడియా భారతదేశం విశిష్ట వికీమీడియన్ గుర్తింపు రాజశేఖర్,టి.సుజాత లకు లభించింది

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 ఏప్రిల్ 10.11 తేదీలలో థియేటర్ ఔట్రీచ్ యూనిట్ టి.ఓ.యు ఆధ్వర్యంలో హైదరాబాదులోని గోల్డెన్ త్రెషోల్డ్లో జరిగింది. దీనిలో భాగమైన వికీ సర్వసభ్యసమావేశం, వికీ అకాడమీ, వికీచైతన్యవేదికలలో వికీపీడియా సభ్యులు పాల్గొని వికీపీడియా అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలను చర్చించారు. తరువాత వికీపీడియా గురించి ఫోన్ ద్వారా వీక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాల కార్యక్రమాన్ని హెచ్ఎమ్‌టీవీ ప్రసారంచేసింది. ఇందులో రాజశేఖర్, రహ్మానుద్దీన్, మల్లాది, విష్ణులు పాల్గొన్నారు.

తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో గత 10 సంవత్సరాలలో విశేష కృషి చేసిన చదువరి, మాకినేని ప్రదీపు, చావా కిరణ్, వీవెన్, పాలగిరి రామకృష్ణా రెడ్డి, రవిచంద్ర, అహ్మద్ నిసార్, వీర శశిధర్ జంగం, జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్, ఎల్లంకి భాస్కర నాయుడు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇచ్చిన కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము నకు ఎంపికయ్యారు.

తెలుగు వికీమీడియా 11వ వార్షికోత్సవాలు 2015, ఫిబ్రవరి 14, 15 తేదీలలో తిరుపతి లోని ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగాయి. 2014 సంవత్సరం తెలుగు వికీపీడియాలో విశేష కృషి చేసిన రాజశేఖర్, టి. సుజాత, వెంకటరమణ, సుల్తాన్ ఖాదర్, పవన్ సంతోష్ లకు కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము అందజేయడం జరిగింది.

ప్రతిరోజూ ఒక వ్యాసం చొప్పున 2016 లో ప్రారంభించి 2019 లో వెయ్యి వ్యాసాలకు పైబడి అభివృద్ధి చేసి ప్రణయ్ రాజ్ తెవికీ అభివృద్ధికి తోడ్పడ్డాడు. 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు అనుగుణంగా, జిల్లా, మండల, గ్రామ వ్యాసాలను సవరించడంలో యర్రా రామారావు విశేషకృషి చేశాడు.

స్మార్ట్ ఫోన్లలో తెలుగు వికీపీడియా

స్మార్ట్ ఫోన్లలో తెర విస్తీర్ణము చిన్నదిగా ఉండటంవలన దీనికి తగ్గ మొబైల్ రూపంలో వికీపీడియా అందుబాటులో ఉంది. దీనికొరకు ప్రత్యేక ఉపకరణం కూడా విడుదలైంది.

                                     

2.1. తెలుగు వికీపీడియా అభివృద్ధి భౌతిక సంస్థ

వికీమీడియా భారతదేశం జనవరి 2011 నుండి పని ప్రారంభించింది. వివిధ కార్యక్రమాల ద్వారా వికీపీడియా, సోదర ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తున్నది. నగర, భాషా ప్రత్యేక ఆసక్తి జట్టుల ద్వారా కార్యక్రమాలను దేశమంతటా విస్తరించింది. అయితే విదేశీ ద్రవ్యం పొందేందుకు అవసరమైన చట్టపరమైన ఇబ్బందుల వలన, నేరుగా సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ సిఐఎస్ ద్వారా వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలు, ఇతర చర్యల వలన వికీమీడియా భారతదేశం బలోపేతం కాలేకపోయింది. ఇతర కారణాల వలన సోదర సంస్థగా కొనసాగుటకు కావలసిన నిబంధనలను పాటించలేకపోయింది. 2019 సెప్టెంబరు 14 నుండి అమలు అయ్యేటట్లు వికీమీడియా భారతదేశం గుర్తింపును వికీమీడియా ఫౌండేషన్ రద్దుచేసింది. సిఐఎస్ లో ప్రత్యేక ఉద్యోగి ద్వారా తెలుగు వికీపీడియా అభివృద్ధికై కృషి 2013 నుండి 2019 జూలై వరకు కొనసాగింది.

                                     

3. గణాంకాలు

నెలవారీగా వెల్లడించే సారాంశ గణాంకాల ఆధారంగా తెలుగు వికీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాల కొరకు, ఇతర భాషలతో పోల్చిచూడడం కొరకు గణాంకాలు చూడవచ్చు. నెలవారీగా పేజీవీక్షణల వివరాలు అందుబాటులోవున్నాయి. భారతదేశ భాషల పేజీవీక్షణలు కూడా చూడవచ్చు. తెలుగు వికీపీడియా అభ్యర్థించే విశిష్ట పరికరాలు 2018 ఆగస్టు 1 నాటికి 10 లక్షలు చేరాయి. నవంబరు 2018 పేజీ అభ్యర్ధనల గణాంకాల ప్రకారం, దేశాలవారీగా భారతదేశం, అమెరికా, హాంగ్‌కాంగ్, యునైటెడ్ కింగ్డమ్ మొదటి నాలుగు స్థానాలలో ఉన్నాయి.

                                     

4. తెవికీ మార్గ దర్శనం

తెవికీలో ఉన్న వ్యాసాలను చేరుకోవటానికి శోధన పెట్టె, లింకులు, వ్యాసం చివర కనిపించే వర్గాలు, మార్గదర్శన పెట్టె ఉపయోగంగా ఉంటాయి. వీటిద్వారా కంప్యూటర్ పరిజ్ఞానం లేని వాళ్లుకూడా వారికి కావలసిన వ్యాసాలకు సునాయాసంగా చేరుకోవచ్చు.

                                     

5.1. తెవికీ సంస్థాగత స్వరూపం సభ్యులు, నిర్వాహకులు, అధికారులు

తెలుగు వికీపీడియాలో 2019 డిసెంబరు నెలాంత గణాంకాల ప్రకారం 93 లక్షల పేజీ వీక్షణలు, 16 లక్షల నిర్దిష్ట పరికరాల ద్వారా జరుగుతున్నాయి. 2019 నవంబరులో కొత్తగా 243 మంది నమోదు కాగా, కనీసం ఐదు సవరణలు చేసే సభ్యులు 71 మంది వున్నారు. సభ్యత్వానికి ఎటువంటి షరతులు నిబంధనలు ఉండవు. వ్రాయాలన్న కుతూహలం, కొంత భాషా పరిజ్ఞానం మాత్రమే అర్హత. సభ్యత్వం లేకున్నా రచనలు, దిద్దుబాట్లు ఎవరైనా చేయవచ్చు. కొత్తగా చేరిన సభ్యులకు సహాయంగా సాంకేతిక వివరణలనూ, విధానాలనూ తెలుసుకొనే విధంగా సులభ శైలిలో వివరించిన పాఠాలు సభ్యులందరికి అందుబాటులో ఉంటాయి. మొదటి పేజీలో వీటికి లింకులు ఉంటాయి. లింకుల వెంట పయనిస్తూ రచనలను కొనసాగించవచ్చు. ఖాతా తెరచి పనిచేసే సభ్యులు చేసే దిద్దుబాట్లను గణాంకాలు చూపిస్తూ ఉంటాయి. సభ్యులు చర్చల్లోనూ పాల్గొనవచ్చు, సలహాలు, సహాయం తీసుకోవచ్చు, అందించనూ వచ్చు.

ఆధారాలుంటే, అనంతమైన ఆకాశం నుండి మట్టి రేణువు వరకూ దేని గురించైనా ఏదైనా వ్రాయవచ్చు. అచ్చుతప్పులుంటే సరిదిద్ద వచ్చు. ప్రాజెక్టులుగా, వర్గాలుగా విడదీసి పనులు జరుగుతుంటాయి కనుక ఆసక్తి ఉన్న రంగంలో వ్రాసే వీలుంటుంది. విస్తారమైన సమాచారం ఉంటుంది కనుక చదివి తెలుసుకోవడమూ చక్కని అనుభవమే. సభ్యుల ఊహలకు ఇక్కడ తావులేదు. సమాచారానికి వాస్తవం, నిష్పాక్షికత ప్రధానం. ఇతర వికీపీడియాలనుండి నాణ్యత గల వ్యాసాలకు అనువాదాలను సమర్పించ వచ్చు. ఇతరుల రచనలను అనుమతి లేకుండా ప్రచురించకూడదు. రచనలనే కాకుండా, బొమ్మలనూ చిత్రం, ఛాయా చిత్రాలను అప్ లోడ్ చేయవచ్చు. అవి చట్టపరమైన ఇబ్బందులు కలిగించనివి అయి ఉండాలి. వాటిని వివిధ వ్యాసాలలో వివరణ చిత్రాలుగా వాడుకొనే వీలుంది. రచనలను తెలుగులోనే చేయాలి. ఇతర భాషాపదాల వాడుకను ప్రోత్సహించడం లేదు. అనివార్య కారణాలలో మాత్రమే ఇతరభాషా పదాలను వాడటానికి అనుమతి ఉంటుంది.

సర్వజనీనమైనవి, సమాచార పూరితమైనవి, వాస్తవికతను ప్రతిబింబిచేవి అయిన రచనలకు మాత్రమే తెలుగు వికీపీడియాలో స్థానం. అవాంఛనీయమైన రచనలను నిర్వాహకులు తొలగిస్తూ ఉంటారు. వారికి ఈ విషయంలో విశేష అధికారాలు ఉంటాయి. తొలగించడంతో పాటు సభ్యుల రచనలపై కొంతకాలం నిషేధం అమలవుతుంది. దుశ్చర్య, అవాంఛనీయమైన రచనలను నియంత్రించడానికి ఈ విధానాలు పాటిస్తుంటారు; శిక్షలు అమలు చేస్తుంటారు.

నిర్వహణ కోసం తెవికీ సభ్యులలో కొందరిని నిర్వాహకులు, అధికారులుగా సభ్యులు ఎన్నుకుంటారు. తెవికీ నిర్వాహకుల, అధికారుల వివరాలు చూడండి.                                     

5.2. తెవికీ సంస్థాగత స్వరూపం సభ్యులకు ప్రోత్సాహం

తెలుగు వికీపీడియా అభివృద్ధికి ముఖ్య కారణం కొత్త సభ్యులను ప్రోత్సహించడం. కొత్త సభ్యులను ప్రోత్సహించడంలో సభ్యులు, నిర్వాహకులు, అధికారులు సైతం ఓర్పు నేర్పుతో వ్యవహరిస్తుంటారు. అత్యుత్సాహంతో కొత్తవారు చేసే పొరపాట్లను సరిచేస్తూ సూచనలు, సలహాలు అందిస్తూ ఉంటారు. కావలసిన సహాయం అందించడంలో అందరూ ఉత్సాహం చూపుతూనే ఉంటారు. సభ్యుల మధ్య ఉండే స్నేహపూరిత వాతావరణం కొత్త వారి ఆందోళనను ఒకింత తగ్గిస్తూ ముందుకు సాగేలా చేస్తుంది. మృదుమధురంగా సూచనలను అందించడం ఎక్కువమంది సభ్యుల పద్ధతులలో ఒకటి.

తెలుగు వికీపీడియా చేసే కృషికి గుర్తింపుగా సభ్యులు ఒకరికి ఒకరు పతకాలు ప్రధానం చేస్తూ ఉంటారు. దిద్దుబాట్లు గణించి, కొన్ని ప్రాజక్టులలో సాధించిన విశేష కృషి, ఉపయోగకరమైన విషయాలు సమర్పించినప్పుడు పతకాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు. ఈ పతకాలు ఇవ్వడానికి ప్రత్యేక అర్హతలు అవసరం లేదు. సభ్యులు ఎవరైనా ఎవరికైనా వారు గుర్తించిన సభ్యుల కృషికి తగినట్లు పతకాలు సమర్పించ వచ్చు.

                                     

5.3. తెవికీ సంస్థాగత స్వరూపం చర్చలు

ప్రతి పేజీకి ఒక చర్చాపేజి ఉంటుంది. వ్యాసానికి సంబంధించి ఆ చర్చాపేజీలో ఎవరైనా తమ అభిప్రాయాలను వెలిబుచ్చవచ్చు; రచయిత నుండి సమాధానం పొందవచ్చు. వ్యాసంపై అభిప్రాయం అక్కడ జతచేయవచ్చు. సభ్యుని పేజీలో ఒక చర్చాపేజీ ఉంటుంది. దానిలో సభ్యునితో అనేక విషయాలపై చర్చించవచ్చు. అభినందనలు, ప్రశంసలు, నెనర్లు ధన్యవాదాలు కూడా అక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి. రచ్చబండ- ఇది తెలుగు వికీపీడియా సభ్యుల అభిప్రాయవేదిక. సభ్యులందరి సలహాలూ, సంప్రదింపులూ, సందేహాలూ ఇక్కడ చోటు చేసుకుంటాయి. తెవికీ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలకు ఇది ప్రధానమైన నెలవు.

                                     

5.4. తెవికీ సంస్థాగత స్వరూపం ప్రచారం

తొలిగా బ్లాగరుల సమావేశాలు, ఆ తరువాత తెవికీ అకాడమీ, వార్షిక పుస్తకప్రదర్శనల ద్వారా, అనుబంధ సంస్థల ద్వారా శిక్షణ, ప్రచార కార్యక్రమాల వలన, పత్రికలలో వచ్చిన ప్రత్యేక వ్యాసాల ద్వారా తెవికీ ప్రచారం జరుగుతున్నది.

                                     

5.5. తెవికీ సంస్థాగత స్వరూపం సమావేశాలు

క్రియాశీలంగా ఉండే వికీపీడియా సభ్యులు హైద్రాబాదు లాంటి నగరాలలో ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి కొత్త సాంకేతికతలు, ప్రాజెక్టుల గురించి చర్చిస్తారు. దేశంలో జరిగే సోదర భాష ప్రాజెక్టుల సమావేశాలలో, వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే సాంకేతిక సదస్సులలో పాల్గొనటం, అలాగే వికీమీడియా ఫౌండేషన్ ప్రతిసంవత్సరం ప్రపంచంలో వివిధ నగరాలలో నిర్వహించే వికీమేనియా అనే అంతర్జాతీయ సమావేశానికి హాజరయి వికీపీడియా అభివృద్ధికి జరుగుతున్న చర్యలను తెలుసుకొని తదుపరి తెలుగు వికీ ప్రాజెక్టులలో అమలు చేయడానికి సహకరిస్తారు.

                                     

6. సోదర ప్రాజెక్టులు

మెటా-వికీ, కామన్స్, విక్షనరీ, వికీబుక్స్, వికీకోట్,వికీసోర్స్ మొదలైనవి తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులు.

 • వికీకోట్‌లో ప్రముఖుల వ్యాఖ్యలు ఉంటాయి.
 • వికీబుక్స్ లో అందరూ కలిసి రూపొందించే పాఠ్యపుస్తకాలుంటాయి.
 • వికీసోర్స్‌లో సార్వజనీయమైన రచనలను మూలరూపంలో భద్రపరుస్తారు. ఉదాహరణకు శతకములు, పురాణములు, వేదములు మొదలైనవి. ఈ పనులు ప్రణాలికాబద్దంగా చేస్తారు.
 • మెటా-వికీ దీనిలో వికీ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు చర్చిస్తారు.
 • కామన్స్ లో తెలుగు వికీపీడియాకు ఉపయోగపడే చిత్రాలు, ఛాయాచిత్రాలు, దృశ్య శ్రవణమాధ్యమాలను భద్రపరుస్తారు. ఇవి ఏ వికీప్రాజెక్టులోనైనా వాడుకోవచ్చు
 • విక్షనరీలో తెలుగుపదాలకు అర్థాలు, బహువచనాలు, ఇతర భాషానువాదాలు, వ్యాకరణ వివరాలు ఒక్కొక్క పదానికి ఉంటాయి.
                                     

7. గుర్తింపులు

"ఉత్సాహం, చొరవ ఉండి, కొద్దిమందే అయినా చేయి చేయి కలిపితే సాధించగల అద్భుతానికి తెలుగు వికీపీడియా మచ్చుతునక" అని ప్రముఖ మాధ్యమాల యజమాని, సంపాదకుడు రామోజీరావు కొనియాడాడు.

                                     

8. ఇవి కూడా చూడండి

 • తెలుగు వికీపీడియాలో సంవత్సరాల వారీగా అభివృద్ధి
 • పత్రికాశైలిలో రాసిన వికీపీడియా వ్యాసము 2013తెలుగు వికీపీడీయా మహోత్సవము సందర్భముగా
 • వికీమీడియా భారతదేశం
 • వికీపీడియాలో రచనలు చేయుట
 • వికీపీడియా:వికీపీడియా మైలురాళ్ళు
 • ప్రసార మాధ్యమాల్లో తెలుగు వికీపీడియా
                                     
 • వ క ప డ య వ వ ధ భ షల ల లభ చ ఒక స వ చ ఛ వ జ ఞ న సర వస వ ద న న ల భ ప క ష రహ త స స థ వ క మ డ య ఫ డ షన న ర వహ స త ద వ క అనగ అన క మ ద సభ య ల
 • ఈ వ య స స వ చ ఛ వ జ ఞ న సర వస వమ న వ క ప డ య చర త రక స బ ధ చ ద వ క ప డ య మ దటగ న య ప డ య అన ఆ గ లభ ష వ జ ఞ న సర వస వ ప ర జ క ట క సహ య ప ర జ క ట గ
 • సర వస వ త ల గ భ ష సమ త వ ర వ జ ఞ న సర వస వ ప రచ రణ అయ య య త ల గ వ క ప డ య ఆధ న క అ తర జ ల య గ ల ప రత ఒక కర ప ల గ నగల వ జ ఞ న సర వస వ 2004
 • ప రణయ ర జ వ గర త ల గ న టక ర గ పర శ ధక డ , త ల గ వ క ప డ య న ర వ హక డ వ న త న న టక లత జన ద ష ట న ఆకర ష చ ప రయత న చ స త న న ప ప క ర న థ య టర క
 • ప ర జ క ట ల వ క షణల జతగ సభ య న మ ర ప ల వ శ ల షణ త ల గ వ క ప డ య గణ క ల క ల ప త గ త ల గ వ క ప డ య న లవ ర గణ క ల - పట ట కల ద శ లవ ర గ ప జ
 • న షనల ప థ లజ ల బ ర టర న హ దర బ ద ల స థ ప చ ర ఆయన త ల గ భ ష భ మ న త ల గ వ క ప డ య స స థల అధ క ర అ గజ ల ర జశ ఖర గ ర వ జయనగర జ ల ల స ల ర ల
 • అ దజ స ర ఆయన త ల గ వ క ప డ య అన వ జ ఞ న సర వస వ ల స చ ద రక తర వ ప ర ట వ దల స ఖ యల వ య స లన వ ర స ర ఆయన త ల గ వ క ప డ య న ర వ హక లల ప లమ ర
 • ఇద వ క ప డ య ప స తక ల ప ర జ క ట ల భ గ గ చ యబడ న త ల గ స హ త య ల వ శ ష టమ న స థ న కల గ న ప స తక ల జ బ త ఈ జ బ త ల ఏ ప స తక ల చ ర చబడ న య ఇ క
 • వ క ప డ య న ర వ హక ల అనగ వ క ప డ య ల న ర వ హక వ ధ ల న ర వర త స త న న వ డ కర ల చ ల క ల న డ వ క ప డ య ల వ య స ల ర స త న న వ శ వసన య వ డ కర లన
 • క మ వ ట ద న స ష ట చడ న క మద దత న చ చ డ బ మ స ల వచ చ న డబ బ ల వ క ప డ య స థ పనక ఉపయ గపడ డ య మ ర చ 2000 ల అ దర చ త ర వ య చ య యబడ ల అ దర క
 • 251వ ర జ స వత సర తమ నక ఇ క 115 ర జ ల మ గ ల నవ 1953 - 2017: త ల గ వ క ప డ య సభ య డ ప రణయ ర జ వ గర వ క వత సర అన క న స ప ట త వర సగ 365ర జ ల

Users also searched:

...

News18 Telugu pedia: కష్టాల్లో telugu news.

ఇదీ వికీపిడియా వ్యవస్థాపకులు జిమ్మీ వేల్స్, వికీపీడియా సంస్థ విరాళాల కోసం పెట్టిన వికీపీడియా తెలుగు నిర్వాహకుల్లో ఒకరిగా ఉన్న ఆయన, గతంలో కొన్ని వికీ. జీవిత బీమా పాలసీ ఇండియాలో SBI Life. English हिंदी मराठी தமிழ் తెలుగు ಕನ್ನಡ മലയാളം. Sign In User image. Hi, Guest. Hey! Unlock special offers & great benefits. Login Register. Hi Guest! Edit Profile. User image. Rewards & benefits await. Know more. Verify Your Mobile Number. Notifications. QuikPay Purchase History. వ్యక్తిత్వ వికాసం The Art Of Living India. తెలుగు మాత్రమే చదవగల ప్రజలకు కష్టమే. మనసులో ఉండి, ఈ అనువర్తనం అభివృద్ధి చేసాము​. ఇప్పుడు, ఇంగ్లీష్ నుండి ఆంగ్లంలోకి లేదా ఏ ఇతర భాషకు గాని SMS ను అనువదించడం ఈ.


...