Back

ⓘ ముస్లింల సాంప్రదాయాలు
ముస్లింల సాంప్రదాయాలు
                                     

ⓘ ముస్లింల సాంప్రదాయాలు

ముస్లింల సాంప్రదాయాలు: ముస్లింల సాంప్రదాయాలు అనగానే అరబ్బుల, తురుష్కుల, మొఘలుల సాంప్రదాయాలు గుర్తుకొస్తాయి. ముస్లింల సాంప్రదాయాలు అనే అంశమే చర్చనీయాంశంగా అనిపిస్తుంది. ఇస్లాం మతం 7వ శతాబ్దం అరేబియాలో స్థాపింపబడిన మతము. ఇస్లాం అనునది ఆధ్యాత్మిక ధార్మిక జీవనవిధానం. ప్రారంభదశలో అరబ్బుల సాంప్రదాయాలే ముస్లిం సాంప్రదాయాలనే భ్రమ వుండేది. కానీ ఇస్లాం అనునది కేవలం అధ్యాత్మిక ధార్మిక జీవనవిధానాలనేకాకుండా విశ్వజనీయత, విశ్వసోదరభావం, వసుదైకకుటుంబం, మానవకళ్యాణం, సామాజికన్యాయం, సర్వమానవసౌభ్రాతృత్వం మొదలగు విశ్వౌదారగుణాలనుగల్గిన సంపూర్ణ జీవనవిధానమని మరువగూడదు.

ఇస్లాం అరేబియానుండి, టర్కీ, పర్షియా, మంగోలియా, భారతదేశం, ఉత్తర తూర్పు ఆఫ్రికా, ఇండోనేషియా, జావా ప్రాంతం, మలయా, సుమిత్రా, బోర్నియో ప్రాంతాలలో శరవేగంగా విస్తరించింది.

ముస్లిం సాంప్రద్రాయం అనే పదం సాధారణంగా ఒక మతరహితమైన ఒక సామాజిక సంస్కృతిగా చారిత్రక ఇస్లామీయ సభ్యతగా పరిగణించేవారు. ముస్లింలు ప్రపంచంలోని పలు దేశాలలో విస్తరించారు. పర్షియన్లుగా, తురుష్కులుగా, భారతీయులుగా, మలయీలు మలేషియన్లు గా, బెర్బర్లు ఇండోనేషియన్లు గా స్థిరపడి ముస్లింల సాంప్రదాయాన్ని ప్రాపంచీకరించారు.

                                     

1. ముస్లింల సాంప్రదాయంపై అభిప్రాయభేదాలు

ముస్లింల సాంప్రదాయమనే పదము వివాస్పదమైనదనే అభిప్రాయంగలదు. ముస్లింలు ఎన్నోదేశాలలో నివసిస్తున్నారు. ఆయా దేశాల సభ్యతాసంస్కృతులలో విలీనమై గూడా మతపరమైన కొన్ని సాంప్రదాయాలను సజీవంగావుంచారు.

                                     

2. మతాచారాలు

ముస్లింల సాంప్రదాయాలు సాధారణంగా ఇస్లామీయధర్మాచారాలచుట్టూనే వుంటాయి. ఇవి సంస్కృతికంటే ఎక్కువగా ధార్మికతను గల్గివుంటాయి. ఒకముస్లిం తనజీవితాన్ని ఎక్కువగా ధార్మికతవైపునేవుంచి జీవిస్తాడు.

                                     

3. భాష, సాహిత్యము

అరబ్బీ

ప్రారంభదశలో ఇస్లామీయ భాషాసాహిత్యాలు మహమ్మద్ ప్రవక్త యొక్క మక్కా, మదీనా లలోగల తెగల మాతృభాషయయిన అరబ్బీ భాష వుండేవి. తదనుగుణంగానే ధార్మిక సాహిత్యాలుగా ఖురాన్, హదీసులు, సీరత్ సీరా, ఫిఖహ్, అరబ్బీ భాషలోనే వుండేవి. ఉమయ్యద్ ఖలీఫాల కాలంలో మతరహిత సాహిత్యాలు ఊపిరిపోసుకొన్నవి. వెయిన్నొక్క రాత్రులు అలీఫ్ లైలా కథలు ఈ కోవకు చెందినవే.

పర్షియన్

అబ్బాసీయ ఖలీఫాల పరిపాలనా కాలంలో పర్షియన్ పారశీ, పారశీకం భాష ముస్లిం సంస్కృతియొక్క ప్రధానమైన భాషగా విరాజిల్లింది, పర్షియన్ సాహిత్యం ఎంతోప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. రూమి మౌలానా రూమ్ యొక్క ప్రఖ్యాత కవితాకోశం విహంగాల సభ ఎంతో ప్రఖ్యాతిగాంచింది.

దక్షిణ ఆసియా

దక్షిణాసియాలో ప్రముఖంగా పారశీకం ఉర్దూ, హిందీ, బెంగాలీ, ఇతర భారతీయ భాషలలో ఇస్లామీయ సాహిత్యాలు అభివృద్ధి చెందినవి. సూఫీ సాహిత్యాలు ప్రముఖ పాత్రను పోషించాయి, పోషిస్తూనేవున్నాయి.

                                     

4. పండుగలు, పర్వాలు

ఈదుల్ ఫిత్ర్, బక్రీదు, ఆషూరా, మీలాదున్నబి, షబ్-ఎ-మేరాజ్, షబ్-ఎ-బరాత్, షబ్-ఎ-ఖద్ర్. వంటి పండుగలను ముస్లింలు జరుపుకుంటూంటారు. ఈ పండుగలలో మొహర్రం వంటివి భారత్ లాంటి దేశాల్లో ముస్లిములే కాకుండా ఇతర మతస్థులు కూడా చేసుకుంటూంటారు.

ఫాతిహా

ఫాతిహా అంటే ప్రారంభం అని అర్ధం.ఖురానులో మొదటి సూరా పేరు.సాయిబులు పెళ్ళిల్లలో దినాలలో భోజనం కార్యక్రమం మొదలు పెట్టే ముందు,కొత్త బట్టలు వస్తువులు వాడే ముందు చేయించేప్రార్థన ను, కూడా ఫాతిహా అని పిలుచుకుంటారు.

                                     

5. పెండ్లి

పెండ్లి లేక కళ్యాణాన్నే అరబ్బీలో ఒఖ్ద్ లేదా అన్-నికాహ్ అంటారు. పర్షియన్, ఉర్దూలో షాది లేక ఖానా-ఆబాది అంటారు. హదీసు లలో అన్-నికాహ్ మిన్-సున్నహ్ లేదా న నికాహ్ అనునది ప్రవక్తల సాంప్రదాయం. మహమ్మదు ప్రవక్త ఇలా అంటారు అన్-నికాహ్ నిస్ఫ్ ఈమాన్ అనగా నికాహ్ వలన సగం విశ్వాసము సంపూర్ణమగును. వైవాహిక జీవితం, కుటుంబ వ్యవస్థకు పునాదియని, సామాజిక వ్యవస్థకు అల్లిక వంటిదని, వివాహ ప్రాముఖ్యాన్ని వర్ణించారు.

ఇస్లాంలో షరియా ప్రకారం వివాహం ఒక స్త్రీ, పురుషుడి మధ్య ఒక చట్టపరమైన ఒడంబడిక, సామాజిక కట్టుబాటు. నికాహ్ గురించి ఖురాన్లో 4:4, 4:24 లో వర్ణింపబడింది.

                                     

6. కళలు

ఇస్లామీయ కళలు, ఇస్లామీయ శాస్త్రాల యొక్క భాగాలు. ఇవి చారిత్రకంగా చూస్తే ముఖ్యంగా ఆధ్యాత్మిక కళారూపాలు. వీటిలో కేవలం జామితీయాలు, పుష్ప, తీగల అలంకరణలు, వ్రాతలు, లిపుల చిత్రీకరణలు కనిపిస్తాయి. మానవ, జంతువుల కళా రూపాలు అసలే కనిపించవు. దీనికి అతిముఖ్య కారణం ఈశ్వరుడు అల్లాహ్ చిత్రకళలను, శిల్పకళలనూ, విగ్రహకళారూపాలనూ నిషేధించాడు.

ఇస్లామీయ కళలన్నీ అల్లాహ్ చుట్టూనే వుంటాయి. అల్లాహ్ నిరంకారుడని ఆకారము లేని వాడని మరువకూడదు.

ప్రకృతి రమణీయతను చిత్రాలలో ఉపయోగించవచ్చును.

మానవ కళారూపాల నిషేధన వున్నందున, ఖురాన్ వాక్యాలను సుందరమైన అరబ్బీ లిపిలో కళాకృతంచేయడం ప్రారంభమయినది. ఇది ఒక ఆచారంగా కూడా నెలకొల్పబడింది. ఈవిధంగా అరబ్బీ లిపి ప్రాచుర్యం పొందింది. ఖురాను వాక్యాలు, సామెతలు, హితోక్తులు ప్రచారమవుచున్నవి.

                                     

7. వాస్తుకళలు

ఇస్లామీయ శైలుల మూలాలు

ఇస్లామీయ ఇస్లామిక్ వాస్తుకళలు వాటిమూలాలు మహమ్మద్ నిర్మించిన మదీనా లోని మస్జిద్ మస్జిద్-ఎ-నబవిను అనుసరించి నిర్మాణమైనవి., ఇస్లాంకు పూర్వమైన చర్చీలు, సినగాగ్ ల నమూనాలనుగూడా స్వీకరించారు.

 • ఇవాన్ లు
 • ఇస్లామీయ అలంకృతులు, అరబ్బీలిపి.ఇస్లామీయ లిపీ కళాకృతులు.
 • భవననిర్మాణాలు.
 • వజూ కొరకు నీటికొలనులు.
 • విశాలమైన ముంగిటలు ప్రధానమైన ప్రార్థనాహాలుకు ముఖదశలో నిర్మించేవారు. ఈనమూనా మస్జిద్-ఎ-నబవి నిర్మాణానుసారం స్వీకరించారు.
 • వాస్తుకళలు అరబిక్ వాస్తుకళలలో పుష్పాలు, పుష్పతీగలు ప్రముఖంగా కనబడుతాయి.
 • భవనాల అంతర్నిర్మాణాలపట్ల బాహ్యనిర్మాణాలకన్నా ప్రత్యేకశ్రద్ధను గల్గివుండడం.
 • గుంబద్ గుంబజ్ లేక డూమ్లు ప్రథమంగా మస్జిదే నవవితో ఈ సాంప్రదాయం మొదలయినది.
 • గాఢమైన రంగుల ఉపయోగం.
 • మిహ్రాబ్ ప్రార్థనాహాలులో కాబా లేక ఖిబ్లా దిక్కునకు ఒక గర్భం నిర్మిస్తారు.
 • మీనార్లు లేక స్తంభాలు ప్రధానంగా దీపస్తంభాలు. వీటినమూనా దమిష్క్ డెమాస్కస్ లోని ప్రధాన మసీదును అనుసరించి నిర్మించడం ప్రారంభించారు. నూర్ అనగా కాంతి లేక తేజస్సు.


                                     

8. సంగీతం

ఇస్లాంలో సంగీతం నిషేధం. అయిననూ పెక్కు చోట్ల మతపరమైన కవిత్వాలకు, అనుమతింపబడిన సంగీతవాయిద్యాల దఫ్ ఉపయోగాలకు అనుగుణంగా సాంప్రదాయీకరించిన సంగీతాన్ని నిర్దిష్టీకరించారు. ఇస్లామీయ శాస్త్రీయ సంగీత కేంద్రాలైన అరేబియా, మధ్యప్రాచ్యము, ఉత్తర ఆఫ్రికా, ఈజిప్టు, ఇరాన్, మధ్యాసియా, ఉత్తర భారతదేశం, పాకిస్తాన్ లందు ఆధ్యాత్మిక కవితలూ, గీతాలూ ప్రాశస్తం పొందినవి.

 • ఉత్తరభారత శాస్త్రీయసంగీతం.
 • ఇరాన్ లో మతపరమైన సంగీతం
 • అరబ్ శాస్త్రీయసంగీతం

సెల్జుగ్ తురుష్కులు, ఒక సంచారజాతి ఇస్లాంను స్వీకరించిన తరువాత అనటోలియా ప్రస్తుతం టర్కీను ఆక్రమించి తరువాత ఖలీఫా పదవిని అధిష్టించి ఉస్మానియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇస్లామీయ సంగీతంపై వీరి ప్రభావం ఎక్కువ.

 • చూడండి టర్కీ శాస్త్రీయ సంగీతం.

మధ్య సహారా ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, దక్షిణ ఫిలిప్పైన్ లలో కూడా ముస్లింల జనాభా అధికం. కానీ ఈ ప్రాంతాలలో ఇస్లామీయ సంగీత ప్రభావం చాలా తక్కువ.

దక్షిణభారత: మాప్పిళ గీతాలు, దఫ్ ముత్తు

అరబ్బులు ఈ సాంప్రదాయాలను వర్తకం కొరకు ఈ ప్రాంతాలకు వచ్చినపుడు, భారతదేశంలో తమ రాజ్యాలను ఏర్పరచినపుడు నెలకొల్పి అవలంబించారు. ప్రధానంగా సూఫీలు ఈ సాంప్రదాయాలను నెలకొల్పారు., వీరి సంగీత సాంప్రదాయాలు త్వరగా వ్యాప్తినొందాయి.                                     

9. మూలాలు

 • Studies in Islamic culture in the Indian environment, by Aziz Ahmed Oxford India Paperbacks, 1999 ISBN 0-19-564464-6
 • The culture of hey changing aspects of contemporary Muslim life, by Lawrence Rosen University of Chicago Press, 2004 ISBN 0-226-72615-0