Back

ⓘ రావులకొల్లు (పొన్నలూరు)




రావులకొల్లు (పొన్నలూరు)
                                     

ⓘ రావులకొల్లు (పొన్నలూరు)

రావులకొల్లు అనే పదం రావుల అనే పూర్వపదం, కొల్లు అనే ఉత్తరపదాల నుంచి వచ్చింది. రావుల అనే పదం వృక్షనామసూచి కాగా కొల్లు అనే పదం కొలనుకు రూపాంతరం, జలనామసూచి. కొలను అన్నది అటు మరీ చిన్న గుంట కాక, ఇటు మరీ పెద్ద చెరువు కాక మధ్యస్థంగా ఉండే భౌగోళిక విశేషం.

                                     

1. గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

ఉప్పలదిన్నె 2 కి.మీ, పచ్చవ 4 కి.మీ, పొన్నలూరు 5 కి.మీ, వెల్లటూరు 5 కి.మీ, వర్ధినేనిపాలెం 6 కి.మీ, వేంపాడు 7 కి.మీ.

సమీప పట్టణాలు

పొన్నలూరు 4.5 కి.మీ, కొండపి 15.7 కి.మీ, వోలేటివారిపాలెం 15.7 కి.మీ, కందుకూరు 18.4 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన కొండపి మండలం, దక్షణాన వోలేటివారిపాలెం మండలం, తూర్పున కందుకూరు మండలం,పశ్చిమాన పెదచెర్లోపల్లి మండలం.

                                     

2. గ్రామంలోని ప్రముఖులు నాడు/నేడు

ఈ గ్రామానికి చెందిన శ్రీ పూనాటి మాలకొండయ్య, మధ్య తరగతి కుటుంబీకులు. పెద్దగా ఆసిపాస్తులు లేవు. ఈయన కాయకష్టం చేసి తన కుమారుడైన నాగేశ్వరరావును ఛార్టర్డ్ అకౌంటెంటు చదివించారు. నాగేశ్వరరావు వృత్తిరీత్యా బెంగుళూరులో స్థిరపడినాడు. అయినా స్వంత ఊరుపై మమకారంతో మన ఊరు ఛారిటబుల్ ట్రస్ట్ అను స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామంలో అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వర్తించేటందుకు శ్మశానంలో సరియైన వసతి లేకపోవడంతో ఈయన 3 లక్షల రూపాయలతో విశ్రాంతి భవనం నిర్మించారు. దాని ప్రక్కన 50 వేల రూపాయలతో ఒక చేతిపంపును గూడా ఏర్పాటు చేశారు. ఇదిగాక, గ్రామస్తుల మంచినీటి అవసరాలు తీర్చేటందుకు 8 లక్షల రూపాయలతో,ఒక శుద్ధజల కేంద్రం స్థాపించి, 15 పైసలకే 20 లీటర్ల నీటిని అందజేస్తునారు. ఈ యంత్రం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడవటం విశేషం.

                                     

3. గణాంకాలు

1.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2.099. ఇందులో పురుషుల సంఖ్య 1.050, మహిళల సంఖ్య 1.049, గ్రామంలో నివాస గృహాలు 508 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2.350 హెక్టారులు. 2.జనాభా 2011 - మొత్తం 2.292 - పురుషుల సంఖ్య 1.163 -స్త్రీల సంఖ్య 1.129 - గృహాల సంఖ్య 576