Back

ⓘ రామయపాలెం (మర్రిపూడి)
రామయపాలెం (మర్రిపూడి)
                                     

ⓘ రామయపాలెం (మర్రిపూడి)

రామయపాలెం, ప్రకాశం జిల్లా, మర్రిపూడి మండలానికి చెందిన గ్రామం. మండలంలోనే అతి చిన్న గ్రామం ఇది.

  • దేశాంతరాలు వెళ్ళినా జన్మభూమిపై మమకారం వీడని ఈ గ్రామప్రజలు, సొంతగ్రామానికి ఫ్లోరైడు నీటి బాధలు శాశ్వతంగా తొలగించారు. "శ్రీ రామా యూత్ ఫౌండేషను" పేరుతో గ్రామంలోని స్థలాన్ని తీసుకొని, తలా కొంత మొత్తం చందా వేసుకొని, రు.5 లక్షలతో, నూతనంగా గదులు నిర్మించి, శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 20 లీటర్ల నీటిని, 3 రూపాయలకే గ్రామస్తులకు అందించుచున్నారు.
                                     

1. గణాంకాలు

జనాభా 2011 - మొత్తం 788 - పురుషుల సంఖ్య 397 - స్త్రీల సంఖ్య 391 - గృహాల సంఖ్య 200

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 618. పురుషుల సంఖ్య 314, మహిళలు 304, నివాస గృహాలు 137. విస్తీర్ణం 563 హెక్టారులు