Back

ⓘ రాచపట్నం




రాచపట్నం
                                     

ⓘ రాచపట్నం

రాచపట్నం, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం. ఇది ఒక గ్రామపంచాయితీ. ఈ గ్రామం సరిగ్గా కైకలూరు నుండి కలిదిండి వెళ్ళే మార్గంలో ఈ రెండు పట్టణాలకు మధ్యలో ఉంటుంది. అనగా కైకలూరు నుండి కలిదిండికి 12 కి.మీ దూరం కాగా రాచపట్నం గ్రామం మధ్యలో వుంటుంది. రాచపట్నం గ్రామానికి సరిహద్దు గ్రామాలు 1. గోపవరం 2. చింతల చెరువు 3. వరహా పట్నం 4. చింతల మూరు గ్రామాలున్నాయి. యీ గ్రామంలో ఒకప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ళ చెరువులుండేవి. రెండు కాలువల మధ్యలో చుట్టూ పచ్చని పంట చేలతో ఎంతో మనోహరంగా వుండేది. ఇప్పుడక్కడ ఏ బావిలో కూడా మంచినీళ్ళు దొరకడం అనే ప్రశక్తే లేదు. ఊరిలో రెండు ఆంజనేయ స్వామి ఆలయాలు, ఒక రామాలయం, ఒక C B C N C చర్చి మరొక R C M చర్చి ఉన్నాయి. గ్రామం చుట్టూ వున్న పొలాల్లో విపరీతంగా కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, యింకా ఎన్నొ పండ్ల చెట్లు వుండేవి. కేవలం ప్రాథమిక విద్య మాత్రమే ఈ ఊరిలో వుండేది. ఉన్నత పాఠశాల అంటే 2 కీ.మీ దూరంలో పెద్ద కాలువ గట్టును ఆనుకుని వున్న ఆరుతెగల పాడు గ్రామానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్ కొరకు కైకలూరు వెళ్ళాల్సి ఉంటుంది. రాచపట్నానికి సరిహద్దుగా ఉన్న వరహాపట్నంకు, దీనికి ఒక్కటే సెంటర్.

                                     

1. గణాంకాలు

జనాభా 2011 - మొత్తం 2.402 - పురుషుల సంఖ్య 1.175 - స్త్రీల సంఖ్య 1.227 - గృహాల సంఖ్య 665

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2320. ఇందులో పురుషుల సంఖ్య 1184, స్త్రీల సంఖ్య 1136, గ్రామంలో నివాస గృహాలు 583 విస్తీర్ణము 634 hectares. ఉన్నాయి.