Back

ⓘ రాజ్‌గఢ్
రాజ్‌గఢ్
                                     

ⓘ రాజ్‌గఢ్

రాజ్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. బ్రిటిషు పాలనా కాలంలో రాజ్‌గఢ్ సంస్థానానికి ముఖ్యపట్టణంగా ఉండేది. మాళ్వా ప్రాంతానికి చెందిన ఈ పట్టణం చుట్టూ ఒక గోడ ఉంది. రాజ్‌గఢ్ ఇప్పుడు ఎన్‌టిపిసి సౌర విద్యుత్కేంద్రానికి, ఆనకట్ట ప్రాజెక్టులకూ ప్రసిద్ది చెందింది. టాటా, రిలయన్స్ పవర్ వంటి సంస్థలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపించాయి. రాజ్‌గఢ్ జల్పామా ఆలయానికి కూడా ప్రసిద్ది

                                     

1. జనాభా

2011 జనగణన ప్రకారం రాజ్‌గఢ్ జనాభా 29.726. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. రాజ్‌గఢ్ అక్షరాస్యత 70%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 78%, స్త్రీల అక్షరాస్యత 61%. రాజ్‌గఢ్ జనాభాలో 14% మంది అరేళ్ళ లోపు పిల్లలు.