Back

ⓘ రాజుపాలెం లక్ష్మీపురం
రాజుపాలెం లక్ష్మీపురం
                                     

ⓘ రాజుపాలెం లక్ష్మీపురం

రాజుపాలెం లక్ష్మీపురం, R.L.PURAM కంభంపాడు లేదా కమ్మంపాడు ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 226., యస్.టీ.డీ.కోడ్ 08592.

                                     

1. గ్రామం పేరు వెనుక చరిత్ర

పూర్వం ఈ గ్రామం ఉన్న స్థలంలో ఎటువంటి గ్రామం ఉండేది కాదు అంతకు ముందు ఈ గ్రామస్థులు మైలవరం చెరువు దగ్గర నివసిస్తూ ఉండేవారు అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడి ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమ్మంపాడు దగ్గర ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నారు.గ్రామానికి చెందిన రాజు రాజుపాలెం ఉండటం ఆ గ్రామానికి రాజుపాలెం అనే పేరు వచ్చింది అలాగే లక్ష్మీపురంని మొదట లక్ష్మీపురం అని తర్వాత ప్రస్తుతం కమ్మంపాడు లేదా కంభంపాడు అని వ్యవహరిస్తున్నారు

                                     

2. గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ మోక్షరామలింగేశ్వరస్వామివారి ఆలయం, రామతీర్ధం

చీమకుర్తి మండలం, ఆర్.ఎల్.పురం గ్రామ పంచాయతీ పరిధిలోని రామతీర్ధం క్షేత్రంలో, దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ ఆలయ ప్రాంగణంలో, పునర్నిర్మాణం చేసిన మండపంలో, ఆదిత్యాది నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, మార్చి-23, సోమవారం నాడు ప్రాంభించారు. ఈ విగ్రహాల దాతలు, మాజీ ఎం.ఎల్.ఏ. శ్రీ బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ దంపతులు. 25వ తేదీ బుధవారం నాడు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మేళతాళాల మధ్య విగ్రహాల ఊరేగింపు ఘనంగా సాగినది. ప్రతిష్ఠా మహొత్సవం అనంతరం, శివపార్వతుల కళ్యాణం వేడుకగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు పెద్ద యెత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కారక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

==గ్రామంలో ప్రధాన పంటలు== వాన కాలంలో వరి, సజ్జలు అలాగే అలాగే ఎండాకాలంలో నువ్వులు చలికాలంలో ఎక్కువగా కంది, పొగాకు, వరి సాగు చేస్తారు. అలాగే అలాగే కొన్ని పొలాలలో జామాయిల్, సుబాబులు వంటివి కలప కోసం వేస్తారు.

                                     

3. గ్రామ విశేషాలు

గెలాక్సీ గ్రానైట్ గనులతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన గ్రామం. గ్రానైట్ సీనరేజ్ రూపంలో ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న గ్రామం. ఇన్ని వసతులున్నా ఈ గ్రామంలో మౌలిక వసతులు కరవు. 1990 లో ఈ గ్రామంలో గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు వెలుగు చూసేవరకూ రాజుపాలెం లక్ష్మీపురం ఆర్.ఎల్.పురం గ్రామ ఆదాయం, గుర్తింపు గూడా అంతంతమాత్రమే. గ్రానైట్ పరిశ్రమ వచ్చాక గ్రామ స్వరూపం పూర్తిగా మారిపోయింది. తమ భూములకు విలువ పెరిగి కొందరు ధనవంతులైనారు. గ్రానైట్ క్వారీలకు అనుబంధంగా సమీపంలోనే, పరిశ్రమలు వెలిశాయి. గ్రామ ఆదాయం పెరిగి సుమారు కోటి రూపాయల వరకూ చేరింది.

                                     

4. గణాంకాలు

జనాభా 2011 - మొత్తం 3.437 - పురుషుల సంఖ్య 1.766 - స్త్రీల సంఖ్య 1.671 - గృహాల సంఖ్య 879

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2.864. ఇందులో పురుషుల సంఖ్య 1.471, మహిళల సంఖ్య 1.393, గ్రామంలో నివాస గృహాలు 637 ఉన్నాయి.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.