Back

ⓘ రావూరు
రావూరు
                                     

ⓘ రావూరు

రావూరు, ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 523 291. శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న బండ్లమాంబ దేవి ఆలయం ఈ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణ. శ్రీ బండ్లమాంబ దేవి రాజరాజేశ్వరీ దేవి ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచీ, కర్ణాటక నుంచి కూడా భక్తులు దేవిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రధాన ఉత్సవాలు వరలక్ష్మీ వ్రతం, జనవరి ఒకటి, శ్రీ రాజమాతాదేవి జన్మదినోత్సవం, మే నెలలో అమ్మవారికి జరిగే అభిషేకం, ఉగాది, మొదలైనవి. కావలి నుంచి బస్సులో ఈ గ్రామాన్ని చేరడానికి అర్థ గంట పడుతుంది. బస్సు కలకత్తా, చెన్నై జాతీయ రహదారి మీదుగా వెళుతుంది.

                                     

1. గణాంకాలు

జనాభా 2011 - మొత్తం 3.195 - పురుషుల సంఖ్య 1.629 - స్త్రీల సంఖ్య 1.566 - గృహాల సంఖ్య 841

2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2.845. ఇందులో పురుషుల సంఖ్య 1.459, మహిళల సంఖ్య 1.386, గ్రామంలో నివాస గృహాలు 679 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1.618 హెక్టారులు.