Back

ⓘ రెడ్డిచెర్ల
రెడ్డిచెర్ల
                                     

ⓘ రెడ్డిచెర్ల

పూర్వము ఈ ఊరిని రెడ్డిరాజులు పాలించారు. గ్రామ సమీపములొ చెరువును నిర్మించారు. తర్వాత క్షత్రియ రాజులు వశపరఛుకున్నారు. రెడ్దిరాజులు నిర్మించిన చెరువు ఉండడం వల్ల ఈ ఊరికి రెడ్దిచెర్ల అనే పేరు వచ్చింది. గ్రామ లో సుశీలమ్మ గారు నిర్మించిన తిరుమలనాధస్వామి దేవాలయం ప్రసిద్ధిచెందినది. తర్వాత రామరాజు.

                                     

1. గ్రామ భౌగోళికం

తూర్పున చెరువు, దక్షిణాన వలపరాయని కొండ, పడమర కనుమలు, ఉత్తరాన సారవంతమైన నల్లరేగడి పొలాలు ఉన్నాయి.

సమీప గ్రామాలు

అల్లినగరం 3.2 కి.మీ,సూరావారిపల్లె 4.5 కి.మీ,పుల్లారెడ్డిపల్లె 6.9 కి.మీ,ఇడమకల్లు 7 కి.మీ,గాడికోట 10.6 కి.మీ.

సమీప పట్టణాలు

కొమరోలు 6.9 కి.మీ,గిద్దలూరు 20.7 కి.మీ,రాచెర్ల 27.9 కి.మీ,చంద్రశేఖరపురం 31.6 కి.మీ.

సమీప గ్రామాలు

మూలపల్లి,మల్లారెడ్డిపల్లి,పోసుపల్లి,పామూరుపల్లి, గోనెపల్లి,మిట్టమీదపల్లి,బ్రాహ్మణపల్లి,అల్లీనగరం,బావాపురం.

                                     

2. గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  • శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.
  • గ్రామంలో అచ్చమాంబ దేవాలయము, రామాలయము, సాయిబాబదేవాలయము, కొండపైన రామస్వామిసెల ఉన్నాయి.
                                     

3. గణాంకాలు

జనాభా 2011 - మొత్తం 5.141 - పురుషుల సంఖ్య 2.605 - స్త్రీల సంఖ్య 2.536 - గృహాల సంఖ్య 1.373

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5.342. ఇందులో పురుషుల సంఖ్య 2.743, మహిళల సంఖ్య 2.599, గ్రామంలో నివాస గృహాలు 1.282 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 3.174 హెక్టారులు.