Back

ⓘ రాజుపాలెం (కొత్తపట్నం)




రాజుపాలెం (కొత్తపట్నం)
                                     

ⓘ రాజుపాలెం (కొత్తపట్నం)

రాజుపాలెం, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 523280

  • ఈ గ్రామానికి చెందిన శ్రీ గోలకొండ సుబ్బారెడ్డి, 1995 నుండి 2001 వరకూ, ఈ గ్రామ పంచాయతీకి సర్పంచిగా పనిచేసారు. ఆ రోజులలో వ్యక్తిగతంగా డబ్బులు అడిగేవారుగాదు. గ్రామ ఉమ్మడి అవసరాలయిన గుడి, మసీదు, పొలాలకు బోర్ల ఏర్పాటు వంటివి అడిగేవారు. అప్పట్లో ఓటుకి డబ్బు తీసుకోవటం, నామోషీగా, తప్పుగా భావించేవారు.
                                     

1. గ్రామంలోని మౌలిక సదుపాయాలు

  • త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామంలో, 2014, అక్టోబరు-2న గాంధీజయంతి సందర్భంగా, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు.
                                     

2. గణాంకాలు

జనాభా 2011 - మొత్తం 3.427 - పురుషుల సంఖ్య 1.730 - స్త్రీల సంఖ్య 1.697 - గృహాల సంఖ్య 898

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3.321. ఇందులో పురుషుల సంఖ్య 1.703, మహిళల సంఖ్య 1.618, గ్రామంలో నివాస గృహాలు 751 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 555 హెక్టారులు.