Back

ⓘ రామాయపట్నం




రామాయపట్నం
                                     

ⓘ రామాయపట్నం

రామయపట్నం, ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలానికి చెందిన గ్రామం. ఈ ఊరు మొదట్లో రామపట్నం, తర్వాతి కాలంలో మయపట్నంగా పిలువబడి, ప్రస్తుతం రామయపట్నంగా పిలువబడుతోంది.

                                     

1. గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు

సమీప గ్రామాలు

రావూరు 3 కి.మీ; చాకిచెర్ల 5.7 కి.మీ; మోచెర్ల 6 కి.మీ; చేవూరు 6.6 కి.మీ; వీరేపల్లి 7.3 కి.మీ.

సమీప పట్టణాలు

ఉలవపాడు 12.8 కి.మీ; గుడ్లూరు 15 కి.మీ; కందుకూరు 21.9 కి.మీ; సింగరాయకొండ 22.3 కి.మీ.

                                     

1.1. గ్రామంలో ప్రధాన వృత్తులు సమీప పట్టణాలు

ఉలవపాడు 12.8 కి.మీ; గుడ్లూరు 15 కి.మీ; కందుకూరు 21.9 కి.మీ; సింగరాయకొండ 22.3 కి.మీ.

                                     

1.2. గ్రామంలో ప్రధాన వృత్తులు నౌకాశ్రయం

సుమారు 1800వ సంవత్సరం నుంచి రామాయపట్నం రేవు ప్రాంతంగా పలు వ్యాపారాలకు నిలయమైంది. ఈ రేవు నుంచే ఆంగ్లేయుల కాలంలో బర్మా నుంచి టేకు మొద్దులు దిగుమతి అవుతుండేవి.

  • ప్రాజెక్టు ప్రారంభ పెట్టుబడి 8000 కోట్ల రూపాయలు. భారీ ఓడరేవుతో పాటు, భారీ నౌకా నిర్మాణ కేంద్రం, చేపల రేవు, తత్సంబంధిత ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తలపెట్టారు.
  • కానీ దుగరాజపట్నంలో నౌకాశ్రయం ఏర్పాటు చేయడానికి, పలు సాంకేతిక సమస్యలు, అడ్డంకులు ఎదురవుచున్న నేపథ్యంలో, మళ్ళీ తిరిగి రామాయపట్నంలోనే ఏర్పాటుచేయడానికై, ఇక్కడ ఏర్పాటు చేయడానికిగల అవకాశాలను పరిశీలించడానికై, కేంద్ర ప్రభుత్వం, 2015, ఆగష్టు-19.20 తేదీలలో, ఒక బృందాన్ని పంపించుచున్నది.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో భారీ ఓడరేవుని నిర్మించ తలపెట్టినపుడు, రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి పంపిన మూడు ప్రతిపాదిత స్థలాలలో ఒకటి రామాయపట్నం కాగా, తక్కినవి విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి, నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజపట్నం.
  • ఈ ప్రాజెక్టుకై నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నంని ఎంపిక చేసారు. ఈ ఎంపికపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. రామయపట్నం పోర్టు సాధన సమితి నేతృత్వంలో దుగ్గరాజపట్నం ఎంపికకు వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమౌతున్నారు.
  • అయితే, కొందరు నాయకులు దుగ్గరాజపట్నంతో పాటు, రామయపట్నం వద్ద కూడా ఓడరేవు నిర్మించాలని డిమాండు చేస్తున్నారు.
  • తొలుత, రామాయపట్నంలోనే భారీ ఓడరేవు ఏర్పాటవుతుందని అందరూ ఊహించారు. ఇందుకోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ను కూడా ఏర్పరచారు. ఈ ప్రాజెక్టులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 11% ఈక్విటీ వాటా ఉండబోతోంది. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ NMDC ప్రధాన వాటాదారుగా, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, IFFCO లు ఇతర ముఖ్య వాటాదారులుగా ఈ పోర్టు ఏర్పడాల్సింది.


                                     

1.3. గ్రామంలో ప్రధాన వృత్తులు పరిశ్రమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు, మెదక్ జిల్లాలోని ప్రాంతాలతో పాటు రామయపట్నాన్ని కూడా "జాతీయ మానుఫాక్చరింగ్ పెట్టుబడుల సీమ" National Manfacturing and Investment Zone - NMIZ గా ప్రతిపాదించింది. ఈ NMIZ మొత్తం 5000 ఎకరాలలో విస్తరించి ఉంది.

                                     

2. గణాంకాలు

జనాభా 2011 - మొత్తం 2.236 - పురుషుల సంఖ్య 1.150 - స్త్రీల సంఖ్య 1.086 - గృహాల సంఖ్య 591

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2.517. ఇందులో పురుషుల సంఖ్య 1.294, మహిళల సంఖ్య 1.223, గ్రామంలో నివాస గృహాలు 561 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 722 హెక్టారులు.