Back

ⓘ రేమండ్స్‌ స్తూపం
రేమండ్స్‌ స్తూపం
                                     

ⓘ రేమండ్స్‌ స్తూపం

రేమండ్స్‌ స్తూపం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మలక్‌పేట పరిధిలోని ఎత్తయిన కొండపై ఉన్న స్తూపం. నిజాం పాలనలో ఫిరంగి సేనలను పటిష్ఠంగా తీర్చిదిద్దిన జనరల్‌ మాన్సియర్‌ రేమండ్ స్మృతి చిహ్నంగా క్రీ.శ 1755-1798 మధ్యకాలంలో ఈ స్తూపం నిర్మించబడింది.

                                     

1. చరిత్ర

రెండో నిజాం రాజు నిజాం అలీఖాన్ సైన్యంలో ముఖ్యమైన ఫ్రెంచ్ అధికారి మన్సీ రేమండ్. ప్రజలు ఇతణ్ని ముసారాముడని పిలిచేవారు. ఇతడి పేరు మీద ముసారాంబాగ్ నిర్మాణం జరిగింది. 1798లో మన్సీ రేమండ్ మరణించాడు. ఇతడి సమాధిని యురోపియన్ శైలిలో 28 పిల్లర్లతో ముసారాంబాగ్ వద్ద నిర్మించారు. ఈ నిర్మాణంలో ఊదారంగు గ్రానైట్ రాయిని వాడారు.

                                     

2. నిర్మాణం

18వ శతాబ్దపు చిహ్నానికి ప్రతీకగా ఈ స్తూపం నిలిచివుంటుంది. ఆస్మాన్‌గఢ్‌లోని ఎత్తయిన కొండపై 180 అడుగుల పొడవు, 85 అడుగుల వెడెల్పు గల గద్దెపై 23 అడుగుల ఎత్తు ఈ స్మారక స్తూపాన్ని నిర్మించారు. స్తూపం పక్కనే గ్రీకు శిల్ప కళారీతిలో 28 స్తంభాలతో నిర్మించిన సమాధి ఉంది. రెమాండ్‌ కుటుంబ సభ్యుల ప్రియమైన పెంపుడు జంతువులు గుర్రం, శునకం సమాధులు స్తూపానికి సమీపంలోనే నిర్మించారు.