Back

ⓘ సట్టు
                                     

ⓘ సట్టు

సట్టు అనునది భారతదేశంలో, పాకిస్తాన్ లో చేయబడుతున్న పప్పు ధాన్యాలు యొక్క పిండితో కూడుకొని ఉన్న మిశ్రమం. పొడిగా ఉన్న ఈ మిశ్రమాన్ని వివిధ రకాలుగా తయారుచేస్తారు. దీనిని ప్రధాన లేదా ద్వితీయ పదార్థంగా వివిధ వంటకాలలొ వినియోగిస్తారు.

                                     

1. చరిత్ర

దీనిని తయారుచేసిన విధానం ప్రాచీనమైనది. ఇది భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. దీనిని బీహార్ రాష్ట్రంలో "దేసీ హార్లిక్స్" గా పిలుస్తారు.

                                     

2. వాడకం

దీనిని అనేక స్థాయిలలో ప్రాంతీయ వంటకాలందు ఉపయోగిస్తారు. బీహార్, ఉత్తర ప్రదేశ్, ఉత్తర ఖండ్, పంజాబ్, న్యూఢిల్లీ లలో దీనిని విస్తృతంగా అనేక వంటకాల్లో ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా అల్పాహారంగా గంజి లేదా మృదువైన పిండిగా వడ్డిస్తారు. తియ్యటి వంటకాలలో పండు ముక్కలు, చక్కెర, పాలు తో దీనిని మిళితం చేస్తారు. కొన్ని రుచికరమైన వంటకాలలో దీనిని పచ్చి మిరప, నిమ్మ రసం, ఉప్పు చల్లి ఉపయోగిస్తారు. దీనిని పరాటాలలో నింపడానికి ఉపయోగిస్తారు. దీనిని వేపిన శనగపిండితో తయారుచేస్తారు.

పంజాబ్ ప్రాంతంలో సట్టు ను వేపిన బార్లీ ధాన్యాల నుండి తయారుచేస్తారు. దీనిలో ఉప్పు, పసుపు కలిపి బంతుల వలె తయారుచేస్తారు. చిరుధాన్యాలు, మొక్కజొన్న గింజలు కూడా వాడతారు.

                                     

3. కావలసినవి

సత్తు అనేది వేయించిన ధాన్యాలు ముఖ్యంగా బార్లీ లేదా శనగపిండి తో తయారుచేస్తారు. సాంప్రదాయకంగా దీనిని పప్పుధాన్యాలను ఇనుప పాత్రలో తీసుకొని ఇసుకలో వేయిస్తారు. వేయించిన తరువాత ఆ మిశ్రమాన్ని పొడిగా చేసి ఉంచుతారు.