Back

ⓘ తీయన్




తీయన్
                                     

ⓘ తీయన్

తీయన్ అనునది పంజాబ్, హర్యానా రాష్త్రములలో జరుపబడు తీజ్ యొక్క పండుగ. ఈ పండుగ ఋతుపరమైనది. ఇది కుమార్తెలు, సోదరీమణులపై దృష్టి సారించే పండుగ.

                                     

1. వేడుకలు

ఈ పండుగ వర్షాకాలంలో చాంద్రమానంలో నెల సావన్ యొక్క మూడవ రోజు నుండి సావన్ మాసంలో పౌర్ణమి వరకు మహిళలచే జరుపబడుతుంది. వివాహమైన మహిళలు ఈ పండుగ సందర్భంగా వారి కన్నవారింటిలో పాల్గొంటారు. గతంలో సాంప్రదాయకంగా మహిళలు సావన్ మాసమంతా తల్లిదండ్రుల వద్ద గడిపేవారు.

                                     

2. బహుమతులు

మహిళలు, బాలికలు వారి తల్లిదండ్రుల యింటికి వెళ్ళినపుడు వారి సోదరులు వారికి బహుమతుల ప్యాకెట్ ను అందజేస్తారు. వాటిని "సంధర" అంటారు. దీనిలో పంజాబీ సూట్/చీర, లడ్డూ, గాజులు, మెహందీ, ఊయల ఉంటాయి.

                                     

3. గిద్దా, ఊయల

ఈ పండగ సందర్భంగా బాలికలు, మహిళలు గ్రామంలో ఒక చోట చేరుతారు. వారు పెద్ద చెట్లకు ఊయలకు కడతారు. గిద్దా నృత్యాలను చేస్తారు.

సాంప్రదాయకంగా గిద్దా నృత్యంలో ఈ క్రింది పాటను పాడుతారు:

పంజాబీ:

ਓੁੱਚੇ ਟਾਹਣੇ ਪੀਂਘ ਪਾ ਦੇ ਜਿਥੇ ਆਪ ਹੁਲਾਰਾ ਆਵੇ

Uchay tahne peeng pa de jithey aap hulara aavey

అనువాదం

నా ఊయల పెద్ద చెట్టుకొమ్మ నుండి వ్రేలాడదీయబడింది ఆ ఊయల దానికదే ఊగుతుంది.

ఈ తీయన్ పండుగలో ప్రధానమైన దృష్టి గిద్దా నృత్యంపై పెడతారు. గతంలో కొన్ని రోజులనుంది నాలుగు వారాలవరకు శుభాకాంక్షలు తెలిపేవారు. బాలికలు ఒకచోట చేరి ప్రతీరోజూ గిద్దా నృత్యాలను చేసేవారు. ఈ పండుగ "భల్లోహ్" నృత్యాన్ని మహిళలు చేయడం ద్వారా పూర్తయ్యేది. ఈ నృత్యంలో మహిళలు రెండు వరుసలలో నిలబడి నాట్యం చేసేవారు. ఈ సాంప్రదాయం ప్రకారం మహిళలు ఒక దగ్గర చేరడం గ్రామాలలో ప్రస్తుతం అంతరించిపోయింది.

                                     

4. ఆహారం

సాంప్రదాయకంగా తీయన్ పండుగలలో ఈ క్రింది ఆహార పదార్థాలు చేస్తారు:

  • ఖీర్ rice boiled in milk
  • మాండే: గోధుమ పిండితో తయారుచేస్తారు.
  • మల్పువా
  • పూర్తాయ్ వేయించిన బ్రెడ్
  • హల్వా
  • గుల్గులై:బెల్లం రసంతో గోధుమ పిండి కలిపు ఉండలుగా చేసి వేయిస్తారు.