Back

ⓘ నాగరి లిపి




నాగరి లిపి
                                     

ⓘ నాగరి లిపి

నాగరి లిపి, దేవనాగరి, నందినాగరి లిపులకి మూలమైన లిపి. ఇది తొలిమధ్యయుగాలనాటి, గుప్త లిపి నుండి ఉద్భవించింది. దీనిని సంస్కృతం, ప్రాకృతభాషలను రాసేందుకు ఉపయోగించేవారు. ప్రాచీన బ్రాహ్మీ లిపి కుటుంబానికి చెందిన ఈ నాగరి లిపిని వాడినట్టుగా లభించిన ప్రాచీన ఆధారాలు., క్రీ.శ 1-4శతబ్దాల మధ్యకాలానికి చెందినవి. క్రీ.శ 7వ శతాబ్దం నుండి విరివిగా వాడబడిన ఈ నాగరి లిపి., క్రీ.శ 10 శతాబ్దం చివరకి, దేవనాగరి, నందినాగరిలిపులుగా మార్పు చెందింది.

                                     

1. మూలాలు

తొలి మధ్యయుగాలనాటి గుప్త లిపి యొక్క మధ్య-ప్రాచ్య మాండలికంగా నాగరిలిపి వేరుపడింది పాశ్చాత్య మాండలికంగా శారదా లిపి, దూరప్రాచ్య మాండలికంగా సిద్ధం లిపి కూడా వేరుపడ్డాయి. తర్వాతి కాలంలో దేవనాగరి, నందినాగరి లిపులకి మూలమైన నాగరిలిపి, శారదా లిపి నుండి ఉద్భవించిన గురుముఖి లిపిని కూడా ప్రభావితం చేసింది.

                                     

2. భారతదేశం వెలుపల

క్రీ.శ 7వ శతాబ్దానికి చెందిన టిబెట్ రాజు స్రోంగ్-త్సాంగ్-గాంబొ విదేశీ గ్రంథాలన్నిటినీ, టిబెట్ భాషలో అనువదించేందుకు వీలుగా అక్షరాలను, వ్రాసే పద్ధతులను నేర్చుకొమ్మని, తన రాయబారి తొన్మి సంబోటాని భారతదేశానికి పంపగా, అతడు టిబెట్ భాషకి అనువైన 24 నాగరి అక్షరాలను., స్థానిక భాషకి అనుగుణంగా 6 కొత్త అక్షరాలను తీసుకొని వెళ్ళాడు.