Back

ⓘ ఏటుకూరి బలరామమూర్తి
                                               

తెలుగు పాత్రికేయుల జాబితా

మోటూరి హనుమంతరావు శంకర్ న్యాపతి నారాయణమూర్తి చిలకమర్తి లక్ష్మీనరసింహం టంగుటూరి ప్రకాశం పంతులు కుందూరు ఈశ్వరదత్తు తాపీ ధర్మారావు నాయుడు సురవరం ప్రతాపరెడ్డి నీలంరాజు వెంకటశేషయ్య అయ్యంకి వెంకట రమణయ్య వాడకట్టు హనుమతరావు గాడిచర్ల హరిసర్వోత్తమరావు నార్ల వెంకటేశ్వరరావు న్యాపతి సుబ్బారావు కోటంరాజు రామారావు చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి గోరా శాస్త్రి గిడుగు రామమూర్తి శివలెంక శంభూప్రసాద్ ఖాసా సుబ్బారావు దుర్గబాయ్ దేశ్ ముఖ్ ముట్నూరి కృష్ణారావు ఏటుకూరి బలరామమూర్తి కోటంరాజు పున్నయ్య కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు అడవి బాపిరాజు కందుకూరి వీరేశలింగం పండితారాధ్యుల నాగేశ్వరరావు గంజివరపు శ్రీనివాస్ నెల్లూరు ...

                                               

ఖారవేలుడు

చేది వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాథీగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు. కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒడిషా ప్రాంతాలను పాలించిన రాజులు. కొన్ని చోట్ల ఆంధ్ర, కళింగ శబ్దాలు ఒకదానికొకటి కూడా వాడబడ్డాయి. మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది. అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేకొన్నాడు. అశోకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత క్రీ.శ. 183లో ఖారవేలుడు కళింగ రాజయ్యాడు. మౌర్య సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన మొదటి స్వతంత్ర కళి ...

                                               

విశాలాంధ్ర దినపత్రిక

విశాలాంధ్ర సహకారం రంగంలో నిర్వహించబడుతున్న తెలుగు దినపత్రిక. ఇది జూన్ 22 తేదీన, 1952 సంవత్సరం విజయవాడలో ప్రారంభమైనది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదం వ్యాప్తి చేయటానికి ప్రజాశక్తి దినపత్రికను విశాలాంధ్రగా మార్చాలని 1952 లో రాష్ట్ర కమ్యూనిష్టు పార్టీ తీర్మానం చేసింది. తొలి సంపాదకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు. తెలుగు ప్రజలందరు ఏకమై ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పేరు సూచించిది ఈ పత్రికే. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమాలకు వ్యతిరేకంగా కీలకపాత్ర పోషించింది. 2014లో ఏడు కేంద్రాలనుండి ప్రచురించబడుతున్నది. 2012 సంవత్సరంలో వజ్రోత్సవాలు జరిగాయి.

                                               

గణపతి దేవుడు

గణపతి దేవుడు కాకతీయ చక్రవర్తులలో అగ్రగణ్యుడు. 6 దశాబ్దాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తెలుగు నాటిని ఏకం చేసి తెలుగు వారందరినీ ఒక గొడుగు క్రిందకి తెచ్చిన వారిలో కాకతీయ గణపతిదేవుడు ఒకడు. దేవగిరి ఏలుతున్న యాదవ రాజు జైత్రపాలుడు 1195 లో కాకతీయ రుద్రదేవుని వధించి గణపతిదేవుని బంధిస్తాడు. రుద్రదేవుని తమ్ముడు మహాదేవుడు ఓరుగల్లు సింహాసనమెక్కి మూడు వర్షములు 1196-1198 CE పాలిస్తాడు. 1198లో గణపతిని విడిపించుటకు దేవగిరిపై దండెత్తి విజయము సాధిస్తాడు కాని తన ప్రాణాలు కోల్పోతాడు. మహాదేవుని మరణానంతరము రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడు 1198లో రాజ్యానికి వస్తాడు. సేనా ...

                                               

స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు

స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు పరకాల పట్టాభిరామారావు సంపాదకత్వంలో విడుదలైన తెలుగు పుస్తకం. దీన్ని 2000 సంవత్సరంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది. భారత జాతీయోద్యమంలో కాంగ్రెస్ వాదులే కృషిచేశారన్న అభిప్రాయం దురదృష్టవశాత్తూ చరిత్ర పుస్తకాలు కలిగిస్తున్నాయి. కమ్యూనిస్టుల ప్రస్తావన వచ్చినా విడిగా రావడమే గానీ స్వాతంత్ర్య సమరంలోని ప్రముఖులుగా చరిత్రలో రాదు. భగత్‌సింగ్ వంటి ప్రముఖ స్వాతంత్ర్య విప్లవ యోధులు కమ్యూనిస్టులే. ఐతే 1940ల్లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా అభివర్ణించి రష్యాను మిత్రదేశమైన బ్రిటన్‌ను సమర్థించడం, ఆపైన కాంగ్రెస్ చేసిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిర ...

                                               

పులుపుల వెంకటశివయ్య

వీరు నరసరావుపేటకు సమీపంలోని రొంపిచర్ల గ్రామంలో 1910 నవంబర్ 14న భగవాను, కోటమ్మ దంపతులకు జన్మించారు. పౌరోహిత్యం వృత్తిలో భాగంగా వీరి తండ్రి భగవాను వినుకొండలో స్థిరపడ్డారు. పలుపుల మిడిల్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో గుఱ్ఱం జాషువా తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1933లో బి.ఎస్‌.సి. చదవటానికి జాతీయ విశ్వవిద్యాలయమైన బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి వినుకొండ నుండి చేరిన శివయ్య అక్కడ ఆరెస్సెస్‌ అగ్రనేత గోల్వాల్కర్‌తో పరిచయంతో ఆ శిబిరంలో చేరినా ఆ సంస్థ మతదురహంకారపూరిత వైఖరికి నిరసనగా వెంటనే బయటకు వచ్చారు. అప్పుడే అక్కడవున్న ఆంధ్రవిద్యార్థులు పోలేపెద్ది నరసింహమూర్తి, చండ్ర రాజేశ్వ ...

                                               

ఏటుకూరు

ఏటుకూరు, గుంటూరు జిల్లా, గుంటూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన గుంటూరు నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1846 ఇళ్లతో, 7240 జనాభాతో 1186 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3602, ఆడవారి సంఖ్య 3638. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1388 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 138. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590247.పిన్ కోడ్: 522017. ఎస్.టి.డి.కోడ్ = 0863.

                                               

తెలుగు సాహిత్యం - ప్రాఙ్నన్నయ యుగము

తెలుగు సాహిత్యంలో క్రీ.శ. 1000 వరకు ప్రాఙ్నన్నయ యుగము అంటారు. తెలుగులో మొదటి కావ్యం మదాంధ్ర మహాభారతం అనీ, అది ఆరంభించిన నన్నయ ఆదికవి అనీ సార్వత్రికమైన అభిప్రాయం. ఒక్కమారుగా అంత పరిణతి చెందిన కావ్యం ఆవిర్భవించడం అసాధ్యమనీ, అంతకు ముందే ఎంతో కొంత సారస్వతం ఉండాలనీ సాహితీ చరిత్రకారులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నా ఏ విధమైన లిఖిత సాహిత్యం గాని, లిఖిత సాహిత్యం ఆధారాలు గాని లభించనందున తెలుగు సాహిత్యావిర్భావానికి నన్నయనే యుగపురుషునిగా అంగీకరిస్తారు. కనుక నన్నయకు పూర్వకాలాన్ని ప్రాఙ్నన్నయ యుగం అని వ్యవహరిస్తున్నారు. ఏమైనా తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్ర ...

                                               

ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాలరేఖ

క్రీ.పూ. 8, 000 - క్రీ.పూ. 6, 000 - సూక్ష్మ రాతి యుగము - చిన్న పనిముట్లు - గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోను ఈ కాలం అవశేషాలు లభించాయి. క్రీ.పూ. 6, 000 - క్రీ.పూ. 2, 000 - కొత్త రాతి యుగము - గిద్దలూరులోను, బళ్ళారి జిల్లా సంగనకల్లులోను ఈ కాలం అవశేషాలు లభించాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూరు వద్ద పేడకుప్పలను తగలబెట్టిన మసిదిబ్బలను కనుగొన్నారు. క్రీ.పూ. 1, 000 - క్రీ.పూ. 500 - ఇనుప యుగము - "రాక్షసిగుళ్ళు" అనే సమాధులు ఈ కాలంలో నిర్మించారు. దాదాపు ఆంధ్రదేశం విశాఖ మినహా అందటా ఈ కాలం ఆనవాళ్ళు లభించాయి. తెలంగాణ ప్రాంతంలో ఇనుప పనిముట్ల తయారీ ఆధారాలు అధికంగా దొరికాయి ...

                                     

ⓘ ఏటుకూరి బలరామమూర్తి

ఏటుకూరి బలరామమూర్తి మార్క్సిస్టు మేధావి, చరిత్ర రచయిత, జర్నలిస్టు. ఏటుకూరి బలరామమూర్తి నిష్కళంక దేశభక్తుడు, రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుడు, మార్క్సిస్టు అధ్యయనవేత్త, విశాలాంధ్ర దినపత్రిక, కమ్యూనిజం మాసపత్రికల సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

                                     

1. బాల్యము విద్యాభ్యాసము

ఏటుకూరి బలరామమూర్తి 1918, సెప్టెంబర్ 3 న ఏటుకూరు గుంటూరు జిల్లా లో జన్మించారు. ఇతని తండ్రి ఏటుకూరి సీతారామయ్య బ్రహ్మ సమాజ అభిమాని కావడంతో ఆయన సంస్కరణాభిలాష, శాస్త్రీయ, చారిత్రిక దృష్టి బలరామమూర్తిని ప్రభావితం చేసాయి. 1937 లో గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజిలో చదువుతున్నప్పుడే బలరామమూర్తికి మార్క్సిస్టు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. ఏ.సి. కళాశాలలో బి.ఎ పూర్తి చేసిన తరువాత జర్నలిజం వృత్తిలో వుంటూనే ప్రైవేటుగా ఎం.ఎ సోషియాలజీ పూర్తిచేశారు.ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనుమరాండ్రు వున్నారు.

                                     

2. ఉద్యోగం

1937లో గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజిలో చదువుతున్నప్పుడే బలరామమూర్తి కమ్యూనిస్టు భావాలకు ప్రభావితమయ్యారు. తొలుత ఆర్‌.ఎం.ఎస్. Railway Mail Service లో ఉద్యోగం చేస్తూ కమ్యూనిస్టు పార్టీ రహస్య పత్రిక స్వతంత్ర భారత్‌ విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు అన్ని రైల్వేస్టేషన్‌లలో కమ్యూనిస్టు అభిమానులకు సురక్షితంగా అందచేస్తుండేవారు. ఈ విషయాన్ని పసికట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వం శిక్షగా మద్రాసు ఆర్‌.ఎం.ఎస్‌. ఆఫీసుకు ట్రాన్స్‌ఫర్‌ చేసి ఏ పని యివ్వకుండా జీతం ఇస్తూ ఖాళీగా కూచోబెట్టారు. దీనితో విసుగెత్తి 1940లో ఉద్యోగానికి స్వస్తిచెప్పి బలరామమూర్తి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు.

                                     

3. రాజకీయ జీవితం

రాయలసీమలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పలువురికి మార్క్సిస్టు సిద్ధాంత శిక్షణ యిచ్చారు. రెండేళ్ళు పాటు 1940-42 గడిపిన అజ్ఞాతవాస జీవితంలో భాగంగా విశాఖ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజరుగా వ్యవహరించారు. 1948 నుండి 1952 వరకు తమిళనాడు లోని కడలూరు జైలులో డిటెన్యూగా ఉన్నారు. ఈ జైలు జీవితం ఆయనలోని తాత్విక జిజ్ఞాసను రేకెత్తించి, పుస్తక పఠనాసక్తిని పెంపొందించింది. విశాలాంధ్ర దినపత్రికలో మూడేళ్ళు ప్రధాన సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 1972 నుండి విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ సంపాదకులుగా, కమ్యూనిజం మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులుగా చివరివరకు పనిచేశారు. తరువాత సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, జాతీయ సమితి సభ్యులుగా కొనసాగారు.

                                     

4. రచనలు

కళాశాల కాలం నుండే చరిత్ర, తత్వశాస్త్రంల పట్ల ప్రత్యేక అభిమానం పెంచుకున్న ఏటుకూరి బలరామమూర్తి క్రమేపీ ఆ రంగాలలో విశేష కృషి చేశారు. చరిత్ర, తత్వశాస్త్రంలను జోడు గుర్రాలుగా అభిమానించిన ఏటుకూరి బలరామ మూర్తి 12 పుస్తకాలు, అనేక వందల వ్యాసాలు రచించారు. వీరి పుస్తకాలలో ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, భారతీయ తత్వశాస్త్రం, మన చరిత్ర, ఉపనిషత్ చింతన, భారతీయ సంస్కృతిలు ప్రముఖమైనవి. విశేష ప్రజాదరణను పొందాయి.

 • దళితుల ఆత్మాభిమానానికి ప్రతీక అంబేద్కర్ 1991
 • బౌద్ధం - మార్క్సిస్టు దృక్పథం 1987 ఎస్.జి.సర్దేశాయి, దిలీప్ బోస్ తదితరులతో వ్యాస సంకలనం
 • మన చరిత్ర 1972
 • ఆంధ్ర ప్రదేశ్ దర్శిని 1979 వై.వి. కృష్ణారావు సహా సంపాదకత్వంలో
 • మార్క్సిజం + భగవద్గీత 1986: ఎస్.జి.సర్దేశాయి, దిలీప్ బోస్ తదితరులతో వ్యాస సంకలనం
 • భారతీయ తత్వశాస్త్రం 1955
 • ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర 1953
 • ఉపనిషత్ చింతన 1989
 • గతం, వర్తమానం, భవిష్యత్తు 1995
 • గాంధేయవాదం – తాత్వికత 1986
 • విశిష్ట విశ్లేషణ 1996
 • భారతీయ సంస్కృతి 1992

కడలూరు జైలులో డిటెన్యూగా వున్న రోజులలో చరిత్ర, తత్వశాస్త్ర గ్రంథాలను నిర్విరామంగా అధ్యయనం చేశారు. జైలులో తోటి సహచారుల కోసం చరిత్ర, తత్వశాస్త్రాలపై శిక్షణా తరగతులు నడిపారు. ఎ.ఎల్‌. మార్టిన్‌ రచించిన పీపుల్స్ హిస్టరీ ఆఫ్ గ్రేట్‌ బ్రిటన్‌ చదవడం తటస్థించి అటువంటి ప్రజాచరిత్రను తెలుగుజాతి చరిత్రకు అందించాలనే సంకల్పంతో 1953 జూన్‌లో తన మొట్టమొదటి గ్రంథంగా" ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర”ను రచించారు. మార్క్సిస్టు దృక్పథంతో శాస్త్రీయ ప్రాతిపదికపై రచింపబడ్డ ఈ గ్రంథం ఇప్పటికే 11 సార్లుకు పైగా పునర్ముద్రణలతో ఆంధ్రుల చరిత్ర అంటే ఆసక్తి వున్న అందరి అభిమానాన్ని చూరగొంది. ఆంధ్రుల సంక్షిప్త చరిత్రలో బౌద్ధ స్థూపాలను హిందువులు ఎలా ఆక్రమించుకొన్నదీ క్రీ.శ. 7వ శతాబ్దంలో అమరావతిని దర్శించిన సుప్రసిద్ద చైనా యాత్రికుడు" హుయాన్ త్సాంగ్” యువాన్ చాంగ్- Xuanzang మాటల్లో బలరామ మూర్తి వివరించిన అంశాలు చరిత్ర వక్రీకరణకు పాల్పడేవారికి కనువిప్పు కలిగించి చరిత్ర పట్ల సరైన వాస్తవ అవగాహన కలిగిస్తుంది." అమరావతి స్తూపం బౌద్ధ బిక్షువులు ఆధీనంలో ఉంది. బ్రాహ్మణులు ఈ స్తూపంపై పెత్తనం కావాలని తగాదా పెట్టారు. చివరకు బౌద్ధ బిక్షువులు తలుపులు తీసి బైటకు వచ్చి రాజు గారి మధ్యవర్తిత్వం నడుపుదామని ఆయన వద్దకు వెళ్ళారు. ఈ లోగా బ్రాహ్మణులు స్తూపాన్ని ఆక్రమించుకొన్నారు. రాజు బ్రాహ్మణుల తరపున తీర్పు చెప్పాడు. బౌద్ధ బిక్షువులు స్థాన భ్రష్టులై లేచిపోయారు. కొద్ది రోజుల తరువాత అమరావతీ స్తూపం అమరేశ్వరాలయంగా మారిపోయింది.” విశేష ఖ్యాతిని పొందిన ఈ చారిత్రిక గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం లభించింది రష్యాలో స్థిరపడిన సుప్రసిద్ధ ఇంజనీరు కొలాచల సీతారామయ్యచే 1954 లో రష్యన్ భాష లోకి అనువదించబడింది.

దీని అనంతరం 1955 లో" భారతీయ తత్వశాస్త్రం” వెలువరించారు. ప్రాచీన కాలం నుండి ఆధునిక దోరిణిల వరకు 20 అధ్యాయాలతో భారతీయ తత్వశాస్త్ర వికాసాన్ని శాస్రీయ దృష్టితో సమగ్రంగా విశ్లేషిస్తూ సులభ శైలిలో ఆసక్తికరంగా వివరించబడిన ఈ గ్రంథం వీరి పుస్తకాలలో అత్యంత పేరిన్నిక గన్నది. ఈ పుస్తకం నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు దేశంలోని అనేకమంది ఆలోచనాపరులను ప్రభావితం చేసింది. రచయితగా ఏటుకూరి బలరామమూర్తి పేరును చిరస్థాయిగా నిలబెట్టిన మేటి రచన ఇది.

1972 వ సంవత్సరంలో విహంగ దృష్టితో మన చరిత్ర పేరుతొ భారత దేశ సంక్షిప్త చరిత్రను రచించారు. ఆయన చూసిన చారిత్రక ప్రదేశాలపై విశాలాంధ్రలో ధారావాహికంగా ప్రచురింపబడిన అనేకనేక వ్యాసాల కూర్పు ఇది." విరుద్ద శక్తుల పరస్పర సమ్మేళనం అనే వాస్తవం ఒకటి మానవ చరిత్రలో అనాదిగా కనిపిస్తూంది” అని తెలియచేస్తూ చారిత్రిక సంయమన దృష్టితో ఆర్య, అనార్య దృష్టిని విడనాడి పరిశీలించి రెండు నాగరికతల ఆర్య, హరప్పా ఘర్షణ, ఇక్యతల ద్వారా వినూత్నమైన భారతీయ నాగరికత ఆవిర్భవించిందని ఈ గ్రంథంలో తెలియచేసారు.

1989 వ సంవత్సరంలో చారిత్రిక, తులనాత్మక దృష్టితో ఉపనిషత్తుల తాత్విక దృక్పధాన్ని విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ" ఉపనిషత్ చింతన” రచించారు. శంకరాచార్యుడు వ్యాఖ్యానించిన దశోపనిషత్తులను ప్రమాణంగా తీసుకొని శాస్త్రీయంగా పరిశోధించి సమగ్రంగా వెలువరించిన లోతైన తాత్విక రచన ఇది. ఈ రచనకు తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం లభించింది.

1992 లో భారతీయ సంస్కృతీ పరిణామక్రమంలో సంభవించిన వివిధ ఘట్టాలను, సంఘర్షణలను, సమన్వయాలను, వ్యత్యాసాలను వివరిస్తూ ”భారతీయ సంస్కృతి" పుస్తకాన్ని రచించారు. శాస్త్రీయ దృష్టితో భారతీయ సంస్కృతీ పరిణామాన్ని వేదకాలం నుండి ఆధునిక పునర్జీవనోద్యమాల వరకు పరామార్శిస్తూ వెలువడిన ఈ పుస్తకానికి కూడా 1995లో తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం లభించింది.

ప్రముఖ చరిత్రకారుడు ఆచార్య కీ.శే. బి.ఎస్‌.ఎల్‌. హనుమంతరావు పరిశోధనలను విశ్లేషిస్తూ విశిష్ట విశ్లేషణ అనే గ్రంథాన్ని 1996లో వెలువరించారు. ఇది వారి ఆఖరి ముద్రిత రచన.

విశాలాంధ్ర, కమ్యూనిజం పత్రికలలో సాహిత్య, చారిత్రక, తాత్విక సమస్యలకు సంబంధించి పెక్కు వ్యాసాలను రాశారు. బౌద్ధంలో గతితర్కంపై వీరు ఇంగ్లీషులో రాసిన వ్యాసం పీపుల్స్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించిన బుద్ధిజంలో భాగం అయింది. లెనిన్‌పై వ్రాసిన గ్రంథం సోవియట్‌ ల్యాండ్‌ ప్రచురణగా వచ్చింది. అనేక మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.                                     

5. మరణం

78 సంవత్సరాల ముదిమి వయస్సులో కూడా తనకు అత్యంత అభిమానమైన బౌద్ధం గురించి "బౌద్ధం-పుట్టుక-పరిణామం" పేరిట ఒక చారిత్రిక గ్రంథాన్ని రాయ సంకల్పించి రెండు అధ్యాయాలను రాస్తూ విజయవాడలో 1996 ఏప్రిల్‌ 3 న అకస్మాత్తుగా మరణించారు.

                                     

6. పురస్కారాలు

వీరి ప్రథమ రచన ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఉపనిషత్‌ చింతన, భారతీయ సంస్కృతి గ్రంథ రచనలకుగాను తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారాలు లభించాయి. జాషువా ఫౌండేషన్‌ వారి అవార్డు లభించింది. 1988లో అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం లభించింది.

                                     

7. రచనా విశిష్టతలు

 • ఏటుకూరి రచనలలో చక్కని సంయమన దృష్టి కనిపిస్తుంది. ఇతర మార్క్సిస్టు రచయితలలో సర్వ సాధారణంగా కనిపించే మార్క్సిస్టు పడికట్టు పదజాల ఆర్భాటం ఆయన రచనల్లో ఎక్కడా కనిపించదు. గతి తార్కిక భౌతికవాద ప్రభావంతో ఒక ఘట్టాన్ని, ఒక సంస్కృతిని, ఒక దర్శనాన్ని ఆర్థిక-సామాజిక నేపథ్యంలో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాని మార్క్సిస్టు పడికట్టు పదజాల ధ్వనులుతో చదువరులపై ఆధిక్యం చూపించాలని యత్నించరు. అందువల్లే మార్క్సిస్టేతర పాఠకులను కూడా వీరి రచనలు ఆకట్టుకొని గాఢంగా ప్రభావితం చేసాయి.
 • చరిత్ర, తత్వశాస్త్రం, సంస్కృతి విషయాలను మార్క్సిస్టు దృక్కోణం నుండి అధ్యయనం చేయడం ఏటుకూరి బలరామ మూర్తి విశిష్టత. చరిత్ర, తత్వశాస్త్రం, సంస్కృతి వివిధ పరిణామ దశలలో ప్రజల పాత్ర, ఆనాటి ఆర్థిక, సాంఘిక నేపథ్యం వీరి రచనా విధానంలో ప్రతిబింబించడం వీరి గ్రంథాలకు ఈ విశిష్టతను చేకూర్చాయి. అందుకే అవి బహు జనాదరణ పొందాయి.
 • చరిత్ర, తత్వశాస్త్రంలపై ఏటుకూరి రచనలు ప్రామాణిక గ్రంథాలైనప్పటికి అతని రచనా శైలి అత్యంత సులభంగాను, సంగ్రహంగాను వుండి చదువరులకు ఆద్యంతం ఆసక్తికరంగా వుంటాయి.


                                     

8. మూలాలు

 • మిసిమి మాస పత్రిక మే, 1996 లోని ఏటుకూరి బలరామ మూర్తి పై సంస్మరణ వ్యాసం- శ్రీ T.రవిచంద్
 • విశాలాంధ్ర డైలీ 02.04.2010
                                     
 • చ త మణ న య పత స బ బ ర వ శ వల క శ భ ప రస ద ట గ ట ర ప రక శ ప త ల ఏట క ర బలర మమ ర త ద ర గబ య ద శ మ ఖ శ కర వ డకట ట హన మతర వ గ జ వరప శ ర న వ స
 • ఎస ఎల హన మ తర వ - ఆ ధ ర ల చర త ర - వ శ ల ధ ర పబ ల ష గ హ స ఏట క ర బలర మమ ర త - ఆ ధ ర ల స క ష ప త చర త ర - వ శ ల ధ ర పబ ల ష గ హ స Sir V Ramesam
 • ఆచ ర య బ ఎస ఎల హన మ తర వ - ఆ ధ ర ల చర త ర - వ శ ల ధ ర పబ ల ష గ హ స ఏట క ర బలర మమ ర త - ఆ ధ ర ల స క ష ప త చర త ర - వ శ ల ధ ర పబ ల ష గ హ స
 • ఎస ఎల హన మ తర వ - ఆ ధ ర ల చర త ర - వ శ ల ధ ర పబ ల ష గ హ స ఏట క ర బలర మమ ర త - ఆ ధ ర ల స క ష ప త చర త ర - వ శ ల ధ ర పబ ల ష గ హ స Sir V Ramesam
 • పన చ స ర ఆయన ఎ ప శ సన సభ య ల గ న పన చ స ర 1965 - 1968 మధ యక ల ల ఏట క ర బలర మమ ర త స ప దకత వ బ ధ యతన న ర వహ చ ర 1968 - 1972 మధ య వ మ లపల ల శ ర క ష ణ
 • క డ ఎగ మత అయ య వ మ ట పల ల అభయ శ సన ఆ ధ ర ల స క ష ప త చర త ర, ఏట క ర బలర మమ ర త రచన, 10వ మ ద రణ 1990 ప జ 113 www.gloriousindia.com history kakatiya
 • స వ త త ర య సమరయ ధ ల - ఖమ మ జ ల ల మ ర క స స ట ప రమ ఖ ల క శ ఏట క ర బలర మమ ర త స వ త త ర య సమరయ ధ ల - మ ర క స స ట అధ యయన వ త త, ప రఖ య త చర త రక ర ల
 • వ కటర మయ య 1986 - ర భట ల క ష ణమ ర త 1987 - వ వ జయక మ ర 1988 - ఏట క ర బలర మమ ర త 1989 - మహ ధర ర మమ హనర వ 1990 - ద శరథ ర గ చ ర య 1991 - త ర మల ర మచ ద ర

Users also searched:

...

రాయలసీమ కరువు పై రాసిన తొలి.

చరిత్ర పరిశోధకులు, సాహితీవేత్త ఏటుకూరి బలరామమూర్తి గారి నిర్విరామ కృషి ఫలితంగా​. శాతవాహనులు. కుంతల శాతకర్ణి కరిర్త అనే కామక్రీడ ద్వారా భార్య మరణానికి కారకుడయ్యాడని ఏటుకూరి బలరామమూర్తి పేర్కొన్నారు. క్రీ.​పూ.58లో శకులను ఓడించి ఉజ్జయినిని జయించి. తొలి శాతవాహన కాలానికి చెందిన Dailyhunt. ఏటుకూరి బలరామ్మూర్తి గారి నుంచి ఎబికె ప్రసాద్ దాకా ముక్కామల నాగభూషణం దగ్గర్నుంచి ఔను. ఈ సంపాద వర్గంలో ఏటుకూరి బలరామమూర్తి, కంభంపాటి సత్యనారాయణ సభ్యులూ. Yetukuru Balaramamurthy Charithra, Thathwashastra, Vyaasa. ఏటుకూరి బలరామమూర్తి మార్క్సిస్టు మేధావి, చరిత్ర రచయిత, జర్నలిస్టు. ఏటుకూరి బలరామమూర్తి 1918 1996 నిష్కళంక దేశభక్తుడు, రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుడు,.


...