Back

ⓘ రాజమండ్రి రైల్వే స్టేషను




రాజమండ్రి రైల్వే స్టేషను
                                     

ⓘ రాజమండ్రి రైల్వే స్టేషను

రాజమండ్రి రైల్వే స్టేషను, భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పనిచేస్తుంది. ఇది దేశంలో 26వ రద్దీగా ఉండే స్టేషను.

                                     

1. చరిత్ర

గోదావరి ఆనకట్ట నిర్మాణం రైల్వే సుమారు 1845 సం.లో రాజమండ్రి వద్ద దవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం కోసం సామానులు రవాణా కోసం ఉపయోగించారు. ప్రాజెక్ట్ 1852 సం.లో పూర్తయింది, రైల్వే మూతపడింది. 1893, 1896 సం.ల మధ్య, విజయవాడ, కటక్ మధ్య ఈస్ట్ కోస్ట్ రాష్ట్రం రైల్వే వారిచే 1.288 కిమీ 800 మైళ్ళు, ట్రాఫిక్ కోసం తెరవబడింది. 1897 సం.లో ఓల్డ్ గోదావరి వంతెన నిర్మాణం జరిగింది. 1899 సం.లో రైళ్లు సరాసరి నడిచేందుకు విజయవాడ-మద్రాసు లింక్ నిర్మాణం పూర్తి ఆయ్యింది. ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం వాల్తేరు నుండి విజయవాడ వరకు 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.

                                     

2. రద్దీ స్టేషను

రాజమండ్రి రైల్వే స్టేషను ఇండియన్ రైల్వే లోని ముఖ్యమైన వంద బుకింగ్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి. 2013 నాటి లెక్కల ప్రకారం, 22 ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లు రాజమండ్రి వద్ద ఆగుతాయి. దాదాపు రూ. 36 మిలియన్లు రాజమండ్రి రైల్వే స్టేషను వద్ద సదుపాయాలను మెరుగుపరచడం కోసం ఖర్చు చేశారు.

                                     

3. స్టేషన్ వర్గం

దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్లో పద్దెనిమిదవ ఎ కేటగిరీ స్టేషన్లలో రాజమండ్రి రైల్వే స్టేషను ఒకటి., రాజమండ్రి కూడా రైల్వే డివిజన్లో పది మోడల్ స్టేషన్లలో ఒకటి.

                                     

4. "టచ్ & ఫీల్" ఆధునిక స్టేషన్లు

విజయవాడ రైల్వే డివిజను లోని పది ఆధునిక స్టేషన్లు అయిన నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, కాకినాడ టౌన్, అనకాపల్లి, భీమవరం టౌన్

లలో ఇది ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ ఆధునిక స్టేషన్లు గా గుర్తింపు పొందింది.