Back

ⓘ బెరీలియం నైట్రైడ్




బెరీలియం నైట్రైడ్
                                     

ⓘ బెరీలియం నైట్రైడ్

బెరీలియం నైట్రైడ్ ఒక అకర్బన రసాయన సంయోగపదార్థం.ఇది బెరీలియం మూలకం యొక్క నైట్రైడ్.అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మూలకాలనుండి ఉత్పత్తి చెయ్యుదురు. బెరీలియం నైట్రైడ్ యొక్క రసాయన సంకేతపదం Be 3 N 2. బెరీలియం అజైడ్ లేదా హెక్సానైట్రైడ్ వలెకాకుండ,వ్యాక్యుం లో బెరీలియం, నైట్రోజన్గా వియోగం చెందును.ఇది సులభంగా జలవిశ్లేషణ చెంది బెరీలియం హైడ్రాక్సైడ్, అమ్మోనియాలుగా ఏర్పడును. బెరీలియం నైట్రైడ్ రెండు బహురూపకతలను కలిగిఉన్నది. ఒకటి α-Be 3 N 2 కాగామరొకటి β-Be 3 N 2.బెరీలియం నైట్రైడ్ సంయోగపదార్ధం 1800–1900 °C వద్ద అమ్మోనియా ప్రవాహంలో సిలికాన్ నైట్రైడ్ తో రసాయనచర్య వలన బెరీలియం సిలికాన్ నైట్రైడ్ ను ఏర్పరచును.

                                     

1. భౌతిక లక్షణాలు

బెరీలియం నైట్రైడ్ పసుపు లేదా తెల్లని రూపంలో ఉండును.బెరీలియం నైట్రైడ్ అణుభారం 55.06గ్రాములు/మోల్.25 °C ఉష్ణోగ్రత వద్ద బెరీలియం నైట్రైడ్ సాంద్రత 2.71గ్రాములు/సెం.మీ 3. బెరీలియం నైట్రైడ్ సంయోగపదార్ధం ద్రవీభవన స్థానం 2.200 °C 3.990 °F;2.470K. అలాగే బెరీలియం నైట్రైడ్ సంయోగపదార్ధం బాష్పీభవన స్థానం 2.240 °C 4.060 °F; 2.510K2.200 °C 3.990 °F;2.470K,ఈ ఉష్ణోగ్రత చేరునప్పటికి బెరీలియం నైట్రైడ్ వియోగం చెందును.

                                     

2. రసాయన చర్యలు

ఖనిజఆమ్లాలతో బెరీలియం నైట్రైడ్ రసాయనచర్య వలన అమ్మోనియా, ఆమ్లసంబంధిత లవణాలు ఏర్పడును.

Be 3 N 2 + 6HCl → 3 BeCl 2 + 2 NH 3

గాఢ బలమైనక్షారాలతో బెరీలియం నైట్రైడ్ రసాయనచర్య జరపడం వలన బెరిలేట్ beryllateఏర్పడి,అమ్మోనియా విడుదల అగును.

Be 3 N 2 + 6NaOH → 3Na 2 BeO 2 + 2NH 3

ఆమ్లాలతో, క్షారాలతో బెరీలియం నైట్రైడ్ జరుపు రసాయనచర్య చురుకుగా వేగవంతంగా ఉండును.అయితే నీటితో చాలా నెమ్మదిగా చర్య జరుగును.

Be 3 N 2 + 6H 2 O → 3 BeOH 2 + 2 NH 3

ఆక్సీకరణ కారకాలతో బెరీలియం నైట్రైడ్ జరుపు రసాయనచర్య స్థాయి చాలా తీవ్రంగా ఉండును. బెరీలియం నైట్రైడ్ ను గాలిలో 600 °C వరకు వేడిచేసిన ఆక్సీకరణ చెందును.

                                     

3. ఉపయోగాలు

బెరీలియం నైట్రైడ్‌ను రిఫ్రాక్టరి సేరామిక్స్ తయారీలోఉపయోగిస్తారు. న్యూక్లియర్ రియాక్టరు లలో అణుధార్మికతయుత కార్బన్14ను ఉత్పత్తి చెయ్యుటకు ఉపయోగిస్తారు.