Back

ⓘ బెరీలియం హైడ్రాక్సైడ్




బెరీలియం హైడ్రాక్సైడ్
                                     

ⓘ బెరీలియం హైడ్రాక్సైడ్

బెరీలియం హైడ్రాక్సైడ్ ఒక అకర్బన రసాయన సంయోగపదార్ధం. బెరీలియం, హైడ్రాక్సైడ్ సంయోగం వలన ఈ రసాయన సంయోగపదార్ధం ఏర్పడినది.ఇది బెరీలియం, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాల సమ్మేళనఫలితంగా ఏర్పడిన సంయోగపదార్ధం. బెరీలియం హైడ్రాక్సైడ్ ఒక ద్విశ్వభావయుత హైడ్రాక్సైడ్ అనగా ఇది ఆమ్లాలలో, క్షారాలలో కరుగును.

బెరీలియం ఖనిజాలైన బెరిల్ beryl, బెట్రాండైట్ bertrandite లనుండి బెరీలియం లోహాన్ని తయారు చేయునపుడు బెరీలియం హైడ్రాక్సైడ్ ఉపఉత్పత్తిగా లభిస్తున్నది. బెరిలీయం లవణద్రవణాలకు క్షారాలను చేర్చిన α-రూపం జెల్ ఏర్పడును. ఇలా ఏర్పడిన పదార్థాన్ని అలాగే ఉంచిన లేదా మరిగించిన రోమ్బిక్ β-రూపం అవక్షేపంగా ఏర్పడును బెరీలియం హైడ్రాక్సైడ్ యొక్క అణుసౌష్టవం చతుస్కోణ బెరిలీయం కేంద్రాలను కలిగి జింక్ హైడ్రాక్సైడ్ అణుసౌష్టవ పోలిక కలిగి ఉంది. బెరీలియం హైడ్రాక్సైడ్ రసాయన సంకేతపదంBe OH 2

                                     

1. భౌతిక ధర్మాలు

బెరీలియం హైడ్రాక్సైడ్ తెల్లని స్పటికపదార్ధం.బెరీలియం హైడ్రాక్సైడ్ అణుభారం 43.03 గ్రాములు/మోల్.సాధారణ గది ఉష్ణోగ్రత,25°C వద్ద బెరీలియం హైడ్రాక్సైడ్ సాంద్రత 1.92 గ్రాములు/సెం.మీ 3.బెరీలియం హైడ్రాక్సైడ్ బాష్పీభవన స్థానం 1.000 °C (1.830 °F; 1.270 K, కాని ఈ ఉష్ణోగ్రత వద్ద ఇది వియోగం చెందును. నీటిలో స్వల్పంగా కరుగును.

                                     

2. రసాయన చర్యలు

క్షారాలలో బెరీలియం హైడ్రాక్సైడ్ కరగడం వలన టెట్రాహైడ్రాక్సీడోబెరిలేట్ 2 - అనయాన్ ఏర్పడును.సోడియం హైడ్రాక్సైడ్ తో చర్యఫలితం:

2NaOHaq + BeOH 2 s → Na 2 BeOH 4 aq

ఆమ్లాలలో బెరీలియం హైడ్రాక్సైడ్ ను కరిగించిన బెరిలీయం లవణాలు ఏర్పడును.ఉదాహరణకు సల్ఫ్యూరిక్ ఆమ్లంతో బెరీలియం సల్ఫేట్ ఏర్పడును.

BeOH 2 + H 2 SO 4 → BeSO 4 + 2H 2 O

400°C వద్ద బెరీలియం హైడ్రాక్సైడ్ నిర్జలీకరణ dehydrate చెందడం వలన కరుగు soluble గుణమున్న తెల్లని పొడి వంటి బెరిలీయం ఆక్సైడ్ ఏర్పడును.

BeOH 2 → BeO + H 2 O

ఇలాఏర్పడిన ఈ రసాయనపదార్థాన్ని మరింత ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడిచేసిన కరుగని insoluble గుణమున్న బెరిలీయం ఆక్సైడ్ ఏర్పడును.