Back

ⓘ డైక్లోరిన్ ట్రైఆక్సైడ్




                                     

ⓘ డైక్లోరిన్ ట్రైఆక్సైడ్

డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ అనునది ఒక క్లోరిన్ సమ్మేళనం, రెండు క్లోరిన్ పరమాణువులు,మూడు ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన ఏర్పడు అకర్బన సంయోగపదార్థం.ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేత పదం Cl 2 O 3 డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ ముదురు/చిక్కని బ్రౌన్ రంగులో ఉండు ఘనపదార్థం.దీనిని మొదటి సారి 1967 సంవత్సరంలో కనుగొన్నారు.డై క్లోరిన్ ట్రైఆక్సైడ్ సంయోగ పదార్థం 0 °C కన్న తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా విస్పొటనం చెందు స్వభావాన్ని,లక్షణాన్ని కలిగి ఉన్నది. డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ యొక్క అణుభారం 118.903 గ్రాములు/మోల్.

డైక్లోరిన్‌హెక్సాక్సైడ్Cl 2 O 6,క్లోరిన్Cl 2 మరియుఆక్సిజన్O 2లను తక్కువ ఉష్ణోగ్రత వద్ద కాంతివిశ్లేషణం ప్రకాశ విశ్లేషణphotolysisచెయ్యడం వలన డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ సంయోగపదార్థం ఏర్పడును. ఈ రసాయన సంయోగ పదార్థం యొక్క అణుసౌష్టవం OCl-ClO 2 వలె ఉండునని విశ్వసించడమైనది.డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ యొక్క ఐసొమర్ Cl-O-ClO 2 అయ్యిండే అవకాశం కలదు.ఈ ఐసొమర్,సిద్దాంతరీత్యా క్లోరస్ ఆమ్లం యొక్క నిర్జలస్థితి.