Back

ⓘ బేరియం సల్ఫైడ్




బేరియం సల్ఫైడ్
                                     

ⓘ బేరియం సల్ఫైడ్

బేరియం సల్ఫైడ్ అనునది ఒక రసాయన సంయోగ పదార్థం.బేరియం, సల్ఫర్ అను రెండు మూలకాల సమ్మేళనం వలన బేరియం సల్ఫైడ్ ఏర్పడినది.ఇది ఒక అకర్బన సమ్మేళన పదార్థం. ఈ సమ్మేళన పదార్థం యొక్క రసాయనిక ఫార్ములా BaS.బేరియం కార్బోనైట్ బేరియం సల్ఫేట్ వంటి పలు బేరియం సంయోగ పదార్థాల ఉత్పత్తికి బేరియం సల్ఫైడ్ పుర్వగామి గా పనిచేయును. ఇతర క్షార మృత్తిక లోహాల చాకోజేనైడ్‌లవలె బేరియం సల్ఫైడ్ను, ఎలక్ట్రాన్ డిస్ప్లేలలో తక్కువ పొడవుగల కాంతి తరంగధ్యైర్ఘ్య ఏమిటర్ గా ఉపయోగిస్తారు.

                                     

1. భౌతిక లక్షణాలు

బేరియం సల్ఫైడ్ రంగులేని ఘన స్థితిలో ఉండు ఒక సంయోగపదార్థం.బేరియం సల్ఫైడ్‌యొక్క అణుభారం 169.39 గ్రాములు/మోల్. ఈ సమ్మేళన పదార్థం యొక్క సాంద్రత 4.25 గ్రాములు/సెం.మీ 3. బేరియం సల్ఫైడ్ యొక్క ద్రవీభవన స్థానం 1.200 °C 2.190 °F; 1.470K.ఈ రసాయన పదార్థం బాష్పికరణ కన్న ముందే వియోగం చెందును.నీటిలో కరుగుతుంది.నీటి ఉష్ణోగ్రత పెరిగే కొలది, నీటిలో ద్రావణీయత పెరుగుతుంది.ఆల్కహాల్‌లో కరుగదు.

                                     

2. ఆవిష్కరణ-ఉత్పత్తి

విన్సేన్టినస్ కాసియోరోలస్ Vincentinus Casciorolus1571-1624 అనునతడు, బారైట్ barite అను ఖనిజంగా లభించు బేరియం సల్ఫేట్ Baso 4 ను క్షయికరించడం ద్వారా బేరియం సల్ఫైడ్ ను మొదటి సారి ఉత్పత్తి చేసాడు. వర్తమాన కాలంలో కాసియోరోలస్ ప్రక్రియలో మార్పు చేసి గతంలో ఉపయోగిస్తున్నపిండి flour కి ప్రత్నామ్యాయంగా కోక్ coke ను ఉపయోగిస్తున్నారు.ఈ విధానాన్ని కార్బోథేర్మిక్ చర్య అంటారు

BaSO 4 + 2C → BaS + 2CO 2

బేరియం సల్ఫేట్ కు ఉన్న ఫాస్పారెసేన్స్ ఈ సమ్మేళనంలో ఉండు స్వాభావిక రాగి మాలిన్యం వలన అని తెలుస్తున్నది.