Back

ⓘ జమ్మలమడక మాధవరామశర్మ




                                     

ⓘ జమ్మలమడక మాధవరామశర్మ

జమ్మలమడక మాధవరామశర్మ తెలుగునాట ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు. తెలుగు, సంస్కృత భాషల్లో అపార పాండిత్యం కలవారు. ఆయన భద్రాచలం సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం ఆయనకు తెలుగిళ్ళలో నిలిపింది. ఆ వ్యాఖ్యానాన్ని విన్నవారు కళ్ళ ముందే సీతారామ కళ్యాణం జరుగుతుందన్నట్టుగా తాదాత్మం చెందేవారు.

                                     

1. జీవిత విశేషాలు

ఆయన తెనాలి కి చెందినవారు. 15 అలంకార శాస్త్ర గ్రంధాలు, 15 మంత్ర, వేదాంత గ్రంథాలను తెలుగులో రాసారు. సంస్కృతంలో మమ్మటుడు రాసిన "కావ్యప్రకాశం" తో సహా అనేక గ్రంథాలను తెలుగులో రాసారు. వీరు రాసిన "నాట్యవేదం" కు సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది.

ఆయన విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలొ చదివారు. అక్కడే "సాహిత్య విద్యాప్రవీణ" చేసారు. తాతా సుబ్బరాయశాస్త్రి శిష్యరికంలో నేర్చుకున్న విద్యకు వన్నె చేకూర్చారు. ఇతడు తెనాలిలోని సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా 12 ఏళ్ళపాటు జీతం తిసుకోకుండా పనిచేశాడు. తరువాత గుంటూరులోని ఆంధ్రక్రైస్తవ కళాశాల, నెల్లూరు వేద పాఠశాల, నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశాడు.

                                     

2. రచనలు

  • మాధవగీత
  • శ్రీదేవీ కథ
  • నవరస గంగాధరము
  • రసభారతి నాటక మీమాంస
  • శ్రీ
  • గీతాసూత్రనవతి
  • శృంగార ప్రకాశము
  • నృత్తరత్నావలిరెండు భాగములు
  • అలంకార సూత్రము
  • వ్యక్తివివేకసారము
  • శారదాతనయ విరచిత భావప్రకాశనము
  • సహృదయాలోకలోచనమ్‌
  • నాట్యవేదము రెండు భాగాలు
  • తత్త్వసంగ్రహము
  • కావ్య ప్రకాశము
  • ఆంధ్ర ప్రతాపరుద్రీయమురెండు భాగాలు, ISBN 978-11-754-0544-9
  • నటసూత్రమ్‌
  • వక్రోక్తి జీవితము
  • వక్రోక్తి సారము
  • ఉపనిషత్కథ
  • ధ్వని సారము
  • లక్షణాలంకారము
  • రసగంగాధరమణి
  • ఏకావలి
  • ఔచిత్య విచార చర్చ