Back

ⓘ రాచర్ల (ప్రకాశం జిల్లా)
రాచర్ల (ప్రకాశం జిల్లా)
                                     

ⓘ రాచర్ల (ప్రకాశం జిల్లా)

దక్షణాన గిద్దలూరు మండలం, తూర్పున బెస్తవారిపేట మండలం, దక్షణాన కొమరోలు మండలం, తూర్పున కంభం మండలం.

                                     

1. గ్రామంలో విద్యా సౌకర్యాలు

రాచర్ల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ముందుగా వెలసింది.తరువాత స్పందన స్కూల్ వెలసింది ఆ తరువాత విద్వాన్ స్కూల్ ఒక్కొటిగా వెలసినవి. మోడల్ స్కూల్ వెలసి ఇంటర్ విద్యను ప్రవేశపెట్టినది. రాచర్లలో ఆడపిల్లలకి ప్రత్యేకంగా కస్తూరిబా స్కూల్ వెలసినది. రాచర్లలో రెండు డైట్ కాలేజీలుమ్ రెండు బి ఎడ్ కాలేజీలు ఉన్నాయి.

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

రాచర్లలోని ఈ పాఠశాల, 1892,ఆగస్టు-14 న ప్రారంభించారు. మొదట చెట్లకింద, ఆ తర్వాతఅద్దె భవనాలలో - - - 3 దశాబ్దాలుగా సొంతభవనాలలో నడుస్తున్నది. ఒక్కసారి పాఠశాలలో అడుగుపెడితే స్వాతంత్ర్య సంగ్రామంనాటి ముచ్చట్లే కాదు, ప్రజాస్వామ్యంలో పలు ఘట్టాలను మన ముందు పరుస్తుంది.

                                     

2. గ్రామ పంచాయతీ

 • రాచర్లకు చెందిన శ్రీ దప్పిలి రంగారెడ్డి, 1955 నుండి1959 వరకు మరియూ 1983 నుండి 1988 వరకు సర్పంచిగా ఉన్నారు. ఈయన తరువాత ఈయన కుమార్తె శ్రీమతి కొండా రంగరాజ్యం, 2006 నుండి 2011 వరకు సర్పంచిగా ఉన్నారు.
                                     

3. గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

 • శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- రాచర్ల గ్రామంలో అంజనా పర్వతంపై వెలసిన శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం అభిషేకం, ఆకుపూజలు నిర్వహించెదరు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.
 • రాచర్ల మండలం జల్లివానిపుల్లలచెరువుకు పడమటి దిక్కున అరు కిలోమీటర్ల దూరంలో వున్న నల్లమల అటవి ప్రాంతంలో నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం ఉంది.
 • శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం రాచర్ల గ్రామ చెరువు కట్టపై ఉంది.
                                     

4. గ్రామంలోని ప్రధాన పంటలు

రాచర్ల గ్రామంలో మూడు రకాల నేలలు ఉన్నాయి ఎర్ర నేలలు ఎక్కువగా మిరప, కంది,మొక్క జొన్న, పత్తి, నూగు, శెనగ కాయలు ఇంకా చాల రకాలు అవసరం బట్టి వేసేవారు నల్ల నేలల్లో పత్తి, మినప, శనగలు, గోధుమ ఇసుక నేలల్లో కంది పంట అధిక ప్రాధాన్యత ఇట్చేవారు.

                                     

5. గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5.645. ఇందులో పురుషుల సంఖ్య 2.787, మహిళల సంఖ్య 2.858, గ్రామంలో నివాస గృహాలు 1.393 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2.318 హెక్టారులు.

                                     

6. మండలంలోని గ్రామాలు

 • ఒద్దులవాగుపల్లి
 • రాచర్లఫారం
 • పలుగుంటిపల్లి
 • శీలం వెంకటాంపల్లి
 • సంగపేట
 • అనుములపల్లె
 • ఎడవల్లి రాచర్ల
 • జి.కొత్తపల్లి రాచర్ల
 • కాలువపల్లె
 • గౌతవరం
 • రామాపురం రాచర్ల
 • మాధవాపురం నిర్జన గ్రామం
 • అక్కపల్లి రాచర్ల
 • సత్యవోలు
 • రంగారెడ్డిపల్లె
 • అచ్చంపేటరాచర్ల
 • జల్లివానిపుల్లలచెరువు
 • బూపనగుంట్ల
 • ఓబులరెడ్డిపల్లెరాచర్ల
 • వెణుతుర్లపాడు
 • అరవీటికోట
 • దద్దనగురువాయిపల్లి నిర్జన గ్రామం
 • మేడంవారిపల్లి
 • చిన్నగానిపల్లి
 • రాచర్ల
 • పలకవీడు
 • ఆకవీడు
 • చోలవీడు
 • గంగంపల్లెరాచర్ల)
 • సోమిదేవిపల్లి
 • అనుమలవీడు
 • కొత్తూరు రాచర్ల
 • గుడిమెట్ల