Back

ⓘ తోలి మస్జిద్
తోలి మస్జిద్
                                     

ⓘ తోలి మస్జిద్

తోలి మస్జిద్ హైదరాబాదు నందలి కార్వాన్ వద్ద కలదు. ఇది డమ్రి మస్జిడ్ గా కూడా పిలువబడుతుంది. ఇది గోల్కొండ కోటకు 2 కి.మీ దూరంలో చార్మినార్ వైపు ఉంటుంది. దీనిని మిర్ మూస ఖాన్ మహల్దార్ ఇస్లామిక్ కేలండరు ప్రకారం 1082 లో అబ్దులా కుతుబ్ షా పాలనలో నిర్మించారు. ఈ మస్జిద్ INTACH పురస్కారం పొంది భారత పురాతత్వ శాఖలో వారసత్వ కట్టడము గా నిర్ణయింపబడినది. దీని ప్రత్యేక నిర్మాణ శైలి స్కేలు పరంగా తోలి మస్జిద్ హైదరాబాదు నందలి మక్కా మస్జిద్ తరువాతి స్థానంలో ఉంటుంది.

                                     

1. చరిత్ర

ఈ నిర్మాణం సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ప్లాలనలో 1671 లో మిర్ మూసా ఖాన్ మహల్దార్ చే చేయబడినది. ఇది కుతుబ్ షాహీ విశేష నిర్మాణాలలో ప్రముఖమైన ఉదాహరణగా నిలుస్తుంది.ఆయన హైదరాబాదు నందలి నిర్మాణ శైలిని ఉపయోగించాడు, సుల్తాన్ అబ్దులా కుతుబ్ షా యొక్క రాజ నిర్మాణ శిల్పి అయిన ఆయన మక్కా శైలిలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు.

రాజ శాసనాలలో ఒక అధ్యాయం "గుల్జార్-ఇ-అసఫియా" అనే అధ్యాయం కలదు. దీని ప్రకారం రాజాస్థాన శిల్పి మక్కా మస్జిద్ ను నిర్మించినపుడు ఆయనకు దాని ఖర్చులో ప్రతి రూపాయికి ఒక డామ్రి నాణెం కేటాయించేవారు. ఈ సేకరించిన మొత్తాన్ని ముసా ఖాన్ తోలి మస్జిద్ నిర్మాణానికి వ్యయం చేశాడు. అందువలన ఈ మస్జిద్ ను "డామ్రి మస్జిద్" అని పిలుస్తారు.

                                     

2. నిర్మాణం

ఈ మస్జిద్ ఎత్తుగా ఉన్న సమతల వేదిక పై ఎత్తైన పునాదులతో రెండు గదులు నిర్మించారు. బయటి వైపు ఐదు ఆర్చిల నిర్మాణం వాటిలో మధ్య ఆర్చి కొద్దిగా మిగిలినవాటి కంటే వెడల్పైనది. రెండు మీనార్లు 20 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నాయి.

ఈ మసీదు పైభాగంలోని పిట్టగోడల పై నున్న ఆర్చీలపై చెక్కబడిన చిత్రకళ మిక్కిలి ప్రశంసనీయమైనది. ఈ చిత్రాలు వివిధ శైలిలో గీయబడిన సన్నివేశాలతో వైవిధ్యభరితముగా తీర్చిదిద్దబడ్డాయి. ఈ పిట్టగోడలపై మొత్తం ఐదు ఆర్చీలు ఉన్నాయి. ప్రతి ఆర్చీకి, దానిని ఆవరించిఉన్న దీర్ఘచతురస్రాల మధ్య నున్న ప్రదేశంలో spandrel అతి సుందరమైన పద్మముల పతాకాలు చెక్కి ఉన్నాయి. మధ్యభాగంలోని ఆర్చి మిగిలిన నాలుగింటికన్నా పెద్దగా, ఎక్కువ శిల్పకళతో అలంకరింపబడి ఉన్నది.

ప్రార్థనా మందిరము పై నున్న శిలా శాసనములో ఈ మస్జిద్ ను మూసా ఖాన్ నిర్మించినట్లు పేర్కొనబడినది. మూసా ఖాన్ ఆఖరి కుతుబ్ షాహీ సుల్తాను అబ్దుల్ హసన్ కుతుబ్ షా గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించుటలో ప్రముఖ పాత్ర పోషించాడు. గోల్కొండ కోట లో ఉన్న మూసా బురుజు కూడా ఇతను నిర్మించినదే.

ఈ మస్జిద్ పైభాగము అతి సుందరముగా అలంకరించబడినది. ఇక్కడున్న పిట్టగోడ పై చిత్రీకరించిన చెరసాల దృశ్యాలు వివిధ భిన్న నమూనాలలో ఉన్నాయి. ఈ గోడ పైభాగంలో ఆరు శిఖరాలతో నిర్మించిన శిలాకృతి ఉన్నది.The elaborately decorated minarets have three receding tiers of octagonal galleries, the central one raised on a series of deeply recessed, carved moldings and petals. The minaret shaft is covered with rounded patterns. This composition is adorned by a circular dome and a brass finial.

                                     

3. క్షీణత

ది హిందూ పత్రిక కథనం ప్రకారము తోలి మస్జిద్ చుట్టుపక్కల భూభాగాన్ని స్థానికులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆక్రమించుకున్నారు, దీనివలన, వాతావరణ కాలుష్యము, సరైన నిర్వహణ లేని కారణంగా ఈ మస్జిద్ మినారుల వంపులు తిరిగిన శిల్పకళ క్రమంగా క్షీణిస్తున్నది.