Back

ⓘ రాజౌరీ జిల్లా




రాజౌరీ జిల్లా
                                     

ⓘ రాజౌరీ జిల్లా

జమ్మూ కాశ్మీరు రాష్ట్రం లోని 20 జిల్లాలలో రాజౌరీ జిల్లా ఒకటి. జిల్లా పశ్చిమ సరిహద్దులో భారత్ పాక్ సరిహద్దు, ఉత్తర సరిహద్దులో పూంచ్ దక్షిణ సరిహద్దులో నౌషెరా, చాంబు ఉన్నాయి. రాజౌరీ జిల్లాలో 6 తెహ్సిల్స్ ఉన్నాయి: ఈ భూభాగం అత్యంత సారవంతం, పర్వమయం అయింది. ఈ ప్రాంతంలో మొక్కజొన్న, వరి పంటలు ప్రధానపంటలుగా ఉన్నాయి. పిర్‌పింజల్ పర్వతాలలో జన్మించిన తవి నదీ జలాలు ఈ జిల్లా వాసుల నీటి అవసరాలకు ఆధారభూతంగా ఉంది. ఉర్దు, ఆంగ్లం బోధనామాధ్యమాలుగా ఉన్నాయి. గుజ్రి, పహరి, డోగ్రి వంటి భాషలు వాడుకలో ఉన్నాయి. బకర్వలా గిరిజనులు, గుజ్జర్ ప్రజలలో గుజ్రి భాష వాడుకలో ఉంది. బక్రీవాలాలు గొర్రెలు, మేకల మందలు, గుర్రాలను మేపడం వృత్తిగా అవలంబించిన వారు అంటేకాక వారికి స్వల్పంగా వ్యవసాయభూమి కూడా ఉంటుంది. పశువుల మందలు మాత్రమే సంపదగా కలిగినవారిని నోమడ్స్ అంటారు. మతపరంగా వేరై ఉన్నప్పటికీ వారంతా ఐకమత్యంగా మెలుగుతుంటారు. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా ప్రజలలో 60% ముస్లిములు, 37% హిందువులు, 2% సిక్కులు, ఇతరులు ఉన్నారు.

                                     

1. చరిత్ర

రాజౌరీ పూర్వంలో రాజపుర అని పిలువబడేది. మహాభారత కాలంలో దీనికి ప్రాధాన్యత ఉండేది. ఇదుకు చైనాయాత్రికుడు హూయంత్సాంగ్ వద్ద కొంత ఆధారాలు ఉన్నాయి. రాజౌరీ, పూంచ్, అభిసర కాంభోజరాజ్య ఆధీనంలో ఉంటూ ఉండేది. పురాణ కాలంలో ఈ ప్రాంతం రాజపురం కాంభోజ రాజ్యంలో భాగమై ఉండేది. కామ-రాజపురం - గత్వ-కాంభోజ-నిర్జితస్వ.

                                     

2. నిర్వహణ

  • పుల్వామా జిల్లాలో 7 తెహ్సిల్స్ ఉన్నాయి: రాజౌరీ, డర్హల్, సునర్బని, కోటెరంక, నౌషెరా, తన్నమండి, కలకోట్.
  • జిల్లాలో 9 బ్లాకులు ఉన్నాయి: రాజౌరీ, డర్హల్, సునర్బని, డూంగి, నౌషెహ్రా, కలకోట్, మంజకోటె, తన్నమండ్, బుధ. ఒక్కో బ్లాకులో పలు పంచాయితీలు ఉన్నాయి.