Back

ⓘ సుర్గుజా జిల్లా
సుర్గుజా జిల్లా
                                     

ⓘ సుర్గుజా జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో సుర్గుజా జిల్లా ఒకటి. అంబికాపూర్ జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా సరిహద్దులలో ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, దక్షిణ సరిహద్దులో వింద్యపరత్వం శ్రేణిలోని బగెల్ఖండ్ ప్రాంతం ఉంది.

                                     

1. చరిత్ర

శ్రీరాముడు 14 సంవత్సరాల కాలంలో అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. రామారణ మహాకావ్యంతో సంబంధం ఉన్న పలు ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రామచంద్రుని విజయం తరువత్త జిల్లాలోని పలు ప్రాంతాలకు రాంగర్, సీతా-భెంగ్రా, లక్ష్మణ్‌గర్ వంటి పేర్లు వచ్చాయని భావిస్తున్నారు. మౌర్య సామ్రాజ్యం కాలంలో ఈ ప్రాంతాన్ని నందరాజుల చేత పాలించబడింది. క్రీ.పూ 1820 లో ఈ ప్రాంతం చిన్నచిన్న రాజాస్థానాలుగా విభజించబడింది. తరువాత రక్షల్ రాజవంశానికి చెందిన రాజపుత్రరాజు ప్రస్తుత జార్ఖండ్ ప్రాంతం మీద దండయాత్ర సాగించి ఈ ప్రాతం మీద ఆధిక్యత సాధించాడు. 1820లో అమరసింగ్ మహారాజుగా సింహాసనాధిష్టుడు అయ్యాడు. బ్రిటిష్ ప్రభుత్వకాలంలో సుర్గుజా ప్రాంతం రాజాస్థానంగా ఉంది. ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం.

                                     

2. భౌగోళికం

జిల్లా 23°3725" నుండి 24°617" డిగ్రీల ఉత్తర అక్షాంశం, 81°3440" నుండి 84°440" డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 16359చ.కి.మీ. సుర్గుజా జిల్లాలోని ఎగువభూములు చిన్న టేబుల్ లాండ్స్ లతో కూడిన ప్యాట్ ఫార్మేషన్"కి చెందినవి. జిల్లాలోని ది మైంపాట్, ది జరంగ్ పాట్, ది జొంకా పాట్, ది జమిరా పాట్, ది లాహ్సన్‌పాట్ ప్రధానమైనవి. ఈ ప్రాంతపు సరాసరి ఎత్తు 600 మీ. జిల్లాలో మైలాన్ శిఖరం ఎత్తు 1226 మీ, జాం శిఖరం ఎత్తు 1166మీ, పార్తా ఘర్సా శిఖరం ఎత్తు 1159 మీ, కందాదర శిఖరం ఎత్తు 1149 మీ, చుటై శిఖరం ఎత్తు 1131 మీ, కారో శిఖరం ఎత్తు 1105 మీ. శిఖరాలతో పలు శిఖరాలు ఉన్నాయి. జిల్లా వాయవ్యప్రాంతం కొండలతో నిండి ఉంది. రిహాండ్ నది, దాని ఉపనదులు ప్రవహిస్తున్న మద్య సుర్గుజాలో దిగువభూములు ఉన్నాయి. జిల్లాలో భూభాగం 3 భాగాలుగా విభజించబడింది. తూర్పున శ్రీనగర్ వద్ద పాట్నా, కర్గవాన్‌కు చెందిన దిగువభూములు, రెండవ వరుసలో సోనాహత్ వద్ద ఎగువభూములు, మూడవ స్థాయిలో సోనాహత్ తరువాత ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. సుర్గుజా జిల్లాలో 3 నదీమైదానాలు ఉన్నాయి: హస్డియో నది, రిహండ్ నది, కంహర్ నది. వేసవి ఉష్ణోగ్రత 46 డి సెల్షియస్, శీతాకాలంలో కనిష్ఠ ఉషోగ్రత 5 డి సెల్షియస్ ఉంటుంది.

                                     

3. 2001 లో గణాంకాలు

జిల్లాలో అత్యధికంగా గిరిజన ప్రజలు ఉన్నారు. అతిపురాతన స్థానికులలో పాండో, కొర్వ జాతి ప్రజలు ఇప్పటికీ అరణ్యాలలో నివసిస్తున్నారు. పాండో ప్రజలు తమను తాము పాండవుల సంతతికి చెందినవారమని భావిస్తున్నారు. కొర్వా ప్రజలు తమను తాము కౌరవ సంప్రదాయానికి చెందిన వారమని భావిస్తున్నారు.

భాషలు

జిల్లాలో అధికంగా భరియా భాష వాడుకలో ఉంది. వర్నాకులర్ భాషను దాదాపు 2.00.000 మంది భరియా జాతి ప్రజలు, షెడ్యూల్డ్ ప్రజలు మాట్లాడుతున్నారు. ఈ భాషను దేవనాగర లిపిలో వ్రాస్తున్నారు.

                                     

4. సంస్కృతి

వన్యమృగాల జీవన శైలిని చిత్రించే మైక్ పాండే చిత్రీకరించిన ది లాస్ట్ మైగ్రేషన్ చిత్రం సుర్గుజాలో చిత్రీకరించబడింది. సోనాభాయి అనే మహిళ గిరిజన, జానపద శైలిలో తయారుచేస్తున్న బంకమట్టి శిల్పాలు జిల్లాలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

                                     

5. మూలాలు

Dr.Sanjay Alung-Chhattisgarh ki Riyaste/Princely stastes aur Jamindariyaa

Dr.Sanjay Alung-Chhattisgarh ki Janjaatiyaa/Tribes aur Jatiyaa/Castes