Back

ⓘ అండమాన్ దీవులు
అండమాన్ దీవులు
                                     

ⓘ అండమాన్ దీవులు

బంగాళాఖాతంలో అండమాన్ ద్వీపసమూహాలు రూపుదిద్దుకున్నాయి. ఇవి భారతదేశం తూర్పు సముద్రతీరం, మాయన్‌మార్ పడమటి సముద్రతీరం మద్య ఉపస్థితమై ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు భారతదేశ కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటి. ఉత్తరంగా ఉన్న కోక్కో ద్వీపాల వంటి ద్వీపాలు కొన్ని మాత్రమే మయన్మార్ ఆధీనంలో ఉన్నాయి.

                                     

1.1. చరిత్ర పర్యాటకుల నివేదికలు

అండమాన్ ద్వీపాలు పురాతనమైనవి. 19వ శతాబ్ధపు పురాతన పరిశోధనలు మలాయ్, సంస్కృత భాషల నుండి హనుమాన్ అన్న పదం రూపాంతరం చెంది అండమాన్‌గా అనే పేరు వచ్చిందని. హనుమంతుని పోలిన మానవులు నివసిస్తున్న భూమి కనుక ఈ పేరు వచ్చిందని విశ్వసించబడుతుంది. 851లో అరబ్ భౌగోళిక పరిశోధకుల నుండి ఈ పేరు ఆరంభం అయింది. 10వ శతాబ్ధానికి చెందిన ప్టోల్మీ వంటి పరిశోధకుడు కూడా అండమానీయులను గుర్తించినప్పటికీ విభిన్నమైన పేరుతో పేర్కొన్నాడు.

10వ శతాబ్దంలో పరిర్షియన్ నావికికుడు ఎ.ఐ రాంహార్ముజి వ్రాసిన" అజాబ్ అల్ హిందు" అనే పుస్తకంలో ఈ ద్వీపంలో భీతికలిగించే నరభక్షకజాతులు ఉన్నట్లు వర్ణించబడింది. ఈ దీవిని అండమాన్ అల్- కబిర్ గ్రేట్ అండమాన్ కూడా వర్ణించారు. అండమాన్ దీవులను చోళసాంరాజ్య సాహిత్యంలో తిమైత్తీవి" శీలరహిత దీవి అని వర్ణించవడింది. 13వ శతాబ్దంలో మార్కోపోలో ఈ దీవిని చూడడమేగాక ఇక్కడి నివాసులను కలుసుసుకుని ఉండవచ్చని భావించబడుతుంది. మార్కోపోలో ఇక్కడి ప్రజలను అంగమనీయులని పేర్కొంటూ వారి తలలు కుక్క తలలను పోలి ఉన్నాయని వర్ణించాడు. బహుశా వారు నరమాంస భక్షకులని భావించబడుతుంది. 1440లో ఇటాలియన్ యాత్రికుడు ఈ దిఒవిని దేవుడి దీవి అని పేర్కొన్నాడు.

                                     

1.2. చరిత్ర చోళసామ్రాజ్యం

క్రీ.శ 800-1200 మధ్యకాలంలో తమిళ చక్రవర్తులైన చోళులు తమ సామ్రాజ్యాన్ని ఆగ్నేయాశియాలోని మలేషియా వరకు విస్తరించారు. వీరిలో రాజేంద్రచోళుడు అండమాన్ దీవులని స్వాధీనపరచుకుని క్రీ.శ. 1014-1042 వరకు పాలించాడు. ఆయన అండమాన్ దీవిని నావికాదళ స్థావరంగా ఉపయోగించి సుమత్రా, ఇండోనేషియా దీవులలో ఉన్న మలాయ్‌కి చెందిన శ్రీ విజయ సంరాజ్యం మీద దండయాత్రలు సాగించాడు.

                                     

1.3. చరిత్ర మరాఠీ సామ్రాజ్యం

1729లో మరాఠీ సాంరాజ్యానికి చెందిన అడ్మైరల్ కంహోజీ ఆంగ్రీ ఈ దీవులను స్థావరంగా చేసుకుని బ్రిటిష్ సామ్రాజ్యంతో ఆమరణాంతం పోరాటం సాగించాడు.

                                     

1.4. చరిత్ర బ్రిటిష్ కాలనైజేషన్, పీనల్ కాలనీ

1779 లో బెంగాల్ ప్రభుత్వం గ్రేట్ అండమాన్‌కు చెందిన చాతం దీవిలో నావికా స్థావరం, పీనల్ కాలనీని స్థాపించారు. ఈ స్థావరాన్ని స్థాపించిన బాంబే నావికాదళ లెఫ్టినెంట్ ఆర్చిబాల్డ్ బ్లెయర్ తరువాత ఆఉఅన ఙాపకార్ధం ప్రస్తుతం పోర్ట్ బ్లెయర్ అని పిలుస్తున్నారు. రెండుసంవత్సారాల తరువాత ఈ కాలనీ అండమాన్ దీవిలోని ఈశాన్యభాగంలోకి తరలించబడింది. ఆ అడ్మైరల్ విలియం కార్నివాల్స్ తరువాత ఈ నౌకాశ్రయానికి పోర్ట్ కార్నివాల్స్ అని నామకరణం చేయబడింది. అయినప్పటిటికీ వ్యాధుల దాడి అధిక మరణాల సమస్యలతో 1776లో ఈ దీవిని నిర్వహణను వదులుకున్నాతు.1824లో మొదటి బర్మాయుద్ధానికి నాయకత్వం వహించిన కార్నివలిస్‌న్ అండమాన్ దీవికి ప్రతినిధ్యం వహిస్తూ పాలనాబాధ్యతలు వహించాడు. 1830-1840 లలో నావలు ధ్వశం అయిన కారణంగా దీవిలో ప్రవేశించిన వారు స్థానికులచేతిలో చంపబడడం బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరికకు గురిచేసింది. 1855 మరొక నివాసగృహాలను ప్రతిపాదించింది. వాటిలో సెల్యులర్ ఖైదు కూడా ఒకటి.1857 భారతీయ తిరుగుబాటు కారణంగా నిర్మాణపు పనులలో జాప్యం అధికమైంది. అయినప్పటికీ తిరుగుబాటు కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం అత్యధికంగా భారతీయులను ఖైదు చేసింది. అందువలన సరికొత్త నివాసాలు, జైలు అవసరం అధికమైంది. స్థానిక ప్రజల శ్రమతో 1857లో పోర్ట్ బ్లెయిర్ వద్ద నిర్మాణం మొదలైంది. ఉప్పునీటి భుములలో సాగిన నిర్మాణం చాలాసమస్యలను ఎదుర్కొన్నది. 1867లో నైన్ వెహ్ నావ ఉత్తర అండమాన్ బండలను ఎదుర్కొని ధ్వంసం అయింది. ఆప్రమాదంనుండి బ్రతికి బయటపడిన వారు 86 చిన్న చిన్న పడవలలో దీవిలో ప్రవేశించారు. వారిని దిగంబరులైన అండమాన్ వాసులు ఇనుపబాణాలతో అడ్డుకున్నారు. వారిలో ఒకరు మాత్రం పడవలో పారిపోయి తప్పించుకున్న తరువాత మిగిలిన వారిని బ్రిటిష్ రాయల్ నేవీ రక్షించింది.అదే సమయంలో రోగాలు అధిక మరణాలు అధికం అయ్యాయి. చిత్తడి భూములను నివాసయోగ్యం చేయడం అదనపు అరణ్యాలను తొలగించడం వంటి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మాయో 6వ ప్రభువు వైశ్రాయి రిచర్డ్స్ సౌత్ వెల్ బూర్కే" 1872 ఫిబ్రవరి 8 న అండమానుకు విచ్చేసిన సమయంలో ఆఫ్ఘన్‌ స్థాన్‌కు చెందిన ముస్లింఖైదీ షేర్ అలీ చేతిలో హతుడయ్యాడు. అదే సంవత్సరం పోర్ట్ బ్లెయిర్‌లో నివసిస్తున్న చీఫ్ కమీషనర్ రిచర్డ్స్ సౌత్ వెల్ అండమాన్, నికోబార్ ప్రజల మధ్య సఖ్యత సాధించాడు.                                     

1.5. చరిత్ర సెల్యులర్ జైల్

1858లో జేంస్ పాటిసన్ వాల్కర్ చేపట్టిన అభివృద్ధిపనులలో భాగంగా స్వాతంత్ర్యోద్యమం, తిరుగుబాటు కారణంగా అధికమైన రాజకీయ ఖైదీలకు సెల్యులర్ జైలు నిర్మాణపు పనులు వేగవనతం చేయబడ్డాయి. 1910లో 698 విభాగాలతో జైలు నిర్మాణం పూర్తిచేయబడింది. ఒక్కో విభాగం భూమట్టానికి పైగా గాలి వెలుతురు చొరబాటుకు అనుకూలంగా ఒకేఒక కిటికీ మాత్రం ఏర్పాటుతో చేయబడ్డాయి. ఇందులో బంధుంచబడిన ఖైదీలలో గుర్తించతగిన వ్యక్తి వినాయక్ దామోదర్ సావర్కర్. ఇక్కడ బంధించబడిన భారతీయ ఖైదీలు ఈ ద్వీపం, ఈ జైలును కాలా పానీ నల్లని నీరు అని పిలిచేవారు.1996లో నిర్మించబడిన ఈ ద్వీపం మీద నిర్మించబడిన చలచిత్ర సీమ సెట్టింగుకు కాలాపానీ అని నామకరణం చేయబడింది. ఈ శిబిరంలో మరణించిన ఖైదీల సంఖ్య వేలల్లో ఉందని అంచనా. జైలులో అనుసరించబడిన కఠిన శిక్షలకు భరించలేక పలువురు రాజకీయ ఖైదీలి అశువులు కోల్పోయారు. సమస్యాత్మకమైన ఖైదీల కొరకు వైపర్ ద్వీపంలో ది వైపర్ చైన్ గ్యాంగ్ జైలు "లో ఉరిశిక్షలు కూడా అమలుచేయబడ్డాయి. 20వ శతాబ్దం నాటికి ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య ఖైదీలను ఉంచడానికి ఇది అనుకూలమైన స్థానంగా మారింది.

                                     

1.6. చరిత్ర జపానీయుల ఆక్రమణ

అండమాన్ నికోబార్ దీవులను రెండవ ప్రపంచయుద్ధం జరిగినప్పుడు జపానీయులు ఆక్రమించుకున్నారు. స్వాతంత్ర్యం తరువాత అండమాన్ దీవులలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ నాయకత్వంలో ఆర్జి హుకుమత్ ఈ అజాద్ హిందీ పేరుతో నిర్వహించబడిన స్వాతంత్ర్య సమరం కొనసాగింది. యుద్ధకాలంలో నీతాజీ ఈ దివిని సందర్శించాడు. 1943 డిసెంబర్ 30 న జపానీయుల ఆక్రమణ సమయంలో నేతాజీ జపానీయులతో కలిసి పోరాటం సాగించడం వివాదాద్పదమైంది. జనరల్ ఎ.డి.లోకనాథన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఇక్కడ భారతీయ పతాకం ఎగురవేయబడింది. యుద్ధానంతరం అండమాన్, నికోబార్ దీవులు తిరిగి బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించబడింది. తరువాత స్వతంత్రభారతదేశంలో ఒక భాగంగా మారింది. ప్రపంచయుద్ధం ముగిసే సమయానికి బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్, నికోబార్ పీనల్ సెటిల్మెంటును రద్దు చేసింది. ప్రభుత్వం స్థానికులను ఉద్యోగాలయందు నియమించి మత్స్యపరిశ్రమ, కలప, వ్యవసాయం అభివృద్ధికి సంకల్పించింది. బదులుగా స్థానిక ప్రజలకు ప్రధానభారతభూమిలో ప్రవేశించే అనుమతిని మంజూరు చేసింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బ్రిటిష్ పీనల్‌ను రద్దు చేసింది. అది ప్రస్తుతం స్వాతంత్ర్యసమర ప్రదర్శనశాలగా మాత్రమే ఉపయోగపడుతుంది.                                     

1.7. చరిత్ర సమీపకాల చరిత్ర

1998లో అమెరికన్ ఫోటోగ్రాఫర్ జాన్.ఎస్. చలహన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా అండమాన్‌లో సర్ఫింగ్ ప్రాజెక్ట్ ప్రారంభించాడు. యు.కె సంబంధిత చార్టర్ కంపెనీ ఈశాన్య ఆసియా లైవ్‌అబోర్డ్స్ ఎస్.ఇ.ఎ.ఎల్ సహకారంతో అంతర్జాతీయ సర్ఫర్ల బృందంతో సర్గింగ్ క్రీడ మొదలైంది. ఈ బృందం లిటిల్ అండమాన్ దీవిని స్థావరంగా చేసుకుని 10 రోజులపాటు వివిధ విన్యాసాలతో సర్ఫింగ్ క్రీడ అభ్యాసం చేసారు. అండమాన్ నైరుతిలో ఉన్న లాంగ్ రైట్ రీఫ్, జరవా పాయింట్ వద్ద మొదలైన ఈ క్రీడల సంబంధిత సమాచారం సర్ఫర్ మ్యాగజైన్‌లో క్వెస్ట్ ఫర్ ది ఫైర్ ప్రచురితమైయ్యాయి. ఈ సందర్భంలో మొదటిసారిగా అండమాన్ మ్యాప్ కూడా ప్రచురితమైంది. తిక్కర్ దేన్ వాటర్ చలనచిత్రంలో సినిమాటోగ్రాఫర్ జాక్ జాంసన్ నేతృత్వంలో సుందరమైన అండమాన్ అలల దృశ్యాలు చోటుచేసుకున్నాయి. జాక్ జాంసన్ తరువాతి కాలంలో ప్రఖ్యాత సంగీత కళాకారుడయ్యాడు.కెల్హన్ అండమాన్, నికోబార్ దీవులలో సర్ఫింగ్ ప్రాజక్ట్లు చెయ్యడానికి పలుమార్లు అండమాన్ దర్శించాడు.

                                     

1.8. చరిత్ర సునామీ

2004 డిసెంబర్ 26న టీసునామీ కారణంగా అండమాన్ దీవులకు తీవ్రనష్టం వాటిల్లింది. సునామీకి ముందు సంభవించిన అతితీరమైన భూకంపం అండమాన్ దీవులను అలతలాకుతలం చేసింది.ముందుగా బలంగా జారీచేయబడిన హెచ్చరికల కారణంగా అనేకమంది ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ విపత్తులో దాదాపు 2.000 మంది మతణించారని అంచనా. 4.000 కంటే అధికంగా అనాధలు కావడం లేక తల్లినో తండ్రినో కోల్పోవడం సంభవించింది. దాదాపు 40.000 మంది నివాసగృహాలను పోగొట్టుకుని శరఆలయాలలో తలదాచుకున్నారు. 2009 ఆగస్ట్ 11 న అండమాన్ దీవులలో మాగ్నిట్యూడ్ 7 భూకంపం సంభవించింది. అది తిరిగి మరొక సునామీకి సూచనగా భావించబడింది. 2010 మార్చి 30న అండమాన్ సమీపంలో తిరిగి మాగ్నిట్యూడ్ 6.9 భూకంపం సంభవించింది.

                                     

2. భౌగోళికం

అండమాన్ ద్వీపసమూహం బర్మా ఆర్కాన్ యోమా పర్వతావళిలోని పొడిగింపు అని భావిస్తున్నారు. ఇవి యోమా పర్వతావళికి ఉత్తరంగా, ఇండోనేషియాలోని ద్వీపసమూహానికి దక్షిణంగా ఉన్నాయి. అండమాన్ ద్వీపాల సంఖ్య 325. వైశాల్యం 6.408 చదరపు కిలోమీటర్లు. ఉత్తర అండమాన్ ద్వీపాల వైశాల్యం 285 చదరపు కిలోమీటర్లు. దక్షిణ బర్మాకు సమీపంలో ఉన్న ఈ ద్వీపాలకు సమీపంలో కొక్కో ద్వీపాలతో చేర్చి కొన్ని బర్మా ద్వీపాలు ఉన్నాయి.

ది టెన్ డిగ్రీ చానెల్ అండమాన్ ద్వీపాలను నికోబార్ ద్వీపాల నుండి వేరు చేస్తోంది. వీటిలో అండమాన్‌లో ఉన్న శాడిల్ శిఖరం 720 మీ అత్యంత ఎత్తైనదిగా భావించబడుతుంది. అండమాన్ ద్వీపాలలో 11 బురద పర్వతాలు ఉన్నాయి. ద్వీపాలలో ఉష్ణమండల ద్వీపాలలో ఉండే వాతావరణం నెలకొని ఉంటుంది. వర్షపాతం సాధారణంగానే ఉంటుంది. వాతావరణం సముద్రపు గాలులతో నులివెచ్చగా ఉంటుంది. వర్షపాతం క్రమంగా ఉండక ఈశాన్య ఋతుపవనాల సమయంలో పొడిగానూ, నైరుతి ఋతుపవనాల కాలంలో తేమ అధికంగానూ ఉంటుంది.

                                     

3. వృక్షజాలం

అండమాన్ మద్య ప్రాంతం అధికంగా చిత్తడి భూములతో, ఆకురాలు అడవులతోను, ఉత్తర అండమాన్ ఎవర్‌గ్రీన్ అరణ్యాలతో అత్యధికమైన వృక్షాలతోనూ నిండి ఉంటుంది. అండమాన్ ద్వీపపు సహజ వృక్షజాలం ఉష్ణమండల అరణ్యాలు. తీరాలలో మడ అడవులు ఉంటాయి. పడమటి తీరంలో వర్షాధార అరణ్యాలు ఉంటాయి. అత్యధికంగా సతతహరితారణ్యాలతో నిండి ఉంటుంది. అయినప్పటికీ ఉత్తర అండమాన్ మద్య అండమాన్ బరతాంగ్, దక్షిణ అండమాన్‌లో ఆకురాలు అడవులు ఉంటాయి.

అరణ్యాలలో దక్షిణ అండమాన్‌లో అత్యధికంగా ఎపిఫ్టిక్ వృక్షాలు అత్యధికంగా ఫెరన్, ఆర్చర్డ్స్ ఉంటాయి. అండమాన్ అరణ్యాలు చాలా వరకు సంరక్షితంగా ఉన్నాయి. ప్రధాన భూభాగం అయిన భారతదేశం నుండి వలసవచ్చి స్థిరపడుతున్న ప్రజల అవసరాలు అధికమౌతున్నప్పటికీ ద్వీపంలో లిటిల్ అండమాన్, నార్‌కాండం దీవి, దక్షిణ అండమాన్ సంరక్షిత ప్రాంతాలుగా సురక్షితంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలలో వన్యమృగాలు కూడా సంరక్షించబడుతున్నాయి. వన్యమృగాలకు ఎలుకలు, కుక్కలు, పిల్లులు, ఇంటర్వ్యూ ఏనుగుల కారణంగా వన్యమృగాల రక్షణకు అవరోధం కలిగింది.

                                     

3.1. వృక్షజాలం కలప

అండమాన్ ద్వీపంలో దాదాపు 200 జాతుల కలప ఉత్పత్తి చేసే వృక్షజాతులు ఉన్నాయి. వీటిలో 30 జాతులు మాత్రం వాణిజ్యపరంగా ఉపకరిస్తున్నాయి. వీటిలో అతి ప్రధానమైనవి గుర్జాన్ డిప్టరోకార్పస్, పడక్ ప్టరోకార్పస్ డల్బర్గియోడీస్ మాత్రమే. ఈ అలంకార సాగ్రితయారీకి ఉపకరించే వృక్షాలను విత్తనాల ద్వారా అభివృద్ధిచేయవచ్చు.

 • సిల్వర్ గ్రే ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వెండి వంటి వర్ణం ఉత్కర్ష్"
 • చూలి సాగరియల్ ఎలిప్టికా
 • పడక్ పెట్రో కార్పస్ డాల్బర్జియోడీస్.
 • మార్బుల్ వుడ్ డియోస్పైరస్ మార్‌మోరటా.
 • కొక్కో ఆల్బిజ్జా లెబ్బక్

టేక్ కంటే దృఢమైన పడక్ వుడ్‌ను ఫర్నీచర్ చెయ్యడానికి విరివిగా ఇపయోగిస్తుంటారు.బర్‌వుడ్, బట్రెస్ రూట్ లు అండమాన్ పడక్‌ కలపగా వాడుతుంటారు. 13-7 అడుగుల వైశాల్యం ఉన్న డైనిగ్ టేబుల్ అండమాన్‌లోని అతిపెద్ద పడక్‌ కొయ్యగా గుర్తింపు పొందింది. 8 చదరపు అడుగుల పడక్ కొయ్య మరొకసారి డైనింగ్ టేబుక్‌గా గుర్తింపు పొందింది. పవిత్రమైన రుద్రాక్ష, సాంబ్రాణి వృక్షాలు కూడా గుర్తించబడ్డాయి.

                                     

4.1. జంతుజాలం ​​ క్షీరదాలు

ద్వీపం యొక్క స్థానిక క్షీరదాలు ఉన్నాయి

 • అండమాన్ ఎలుక రేటస్ స్టాయ్‌కస్
 • అండమాన్ స్పినీ ష్ర్యూ క్రొసిడ్యురా హిస్పిడా
 • అండమాన్ గుర్రపుడెక్క గబ్బిలం రినొలొఫస్ కోగ్నటస్
 • జెంకిన్స్ ష్ర్యూ క్రొసిడ్యురా జెన్‌కింసి
 • అండమాన్ ష్ర్యూ క్రొసిడ్యురా అండమాంసిస్

వన్యమృగ సంరక్షణ చట్టం 1972 స్చ్ నేను రక్షణలో సస్ స్క్రోఫా vittatus, దీనిని అండమాన్ అడవి పంది అని పిలుస్తారు. ఇది స్థానిక ఉపజాతి భావించబడుతోంది. ఉన్నాయి.

మచ్చల జింక యాక్సిస్ యాక్సిస్, భారత ముంత్జక్ మున్టియకుస్ ముంట్ జాక్, సాంబార్ జింక రుసా యునీక్లోర్ జింకలను అండమాన్ జిల్లాలో ప్రవేశపెట్టినప్పటికీ ప్రస్తుతం మచ్చల సాంబార్ జింక మనుగడలో లేదు.

ఇంటర్వ్యూ ద్వీపం పేరుతో మధ్య అండమాన్ లో భూభాగంలో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణాలయం లో ఫెరల్ ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగులను ఒక కలప కంపనీ పనులు నిర్వహించడానికి అండమానుకు తీసుకురాబడ్డాయి. కంపనీ వెనుకకు వెళ్ళే సమయంలో ఈ ఏనుగులను అరణ్యంలో వదిలారు. ప్రస్తుతం ఈ ఏనుగులు పరిశోధనకు ఆధారం అయ్యాయి.                                     

4.2. జంతుజాలం ​​ పక్షులు

స్థానీయ లేదా సమీపంలో పక్షుల జాబితా:-

 • కొలంబియా పాలంబాడీస్,
 • కొలాబరేషన్ బల్లి,
 • మైక్రోపిగియా ర్యూఫిపెన్నిస్,
 • స్పిలోర్నిస్ ఎల్గిని,
 • అసిరోస్ నర్కొండమి,
 • డ్రైయోకొపస్ హాడ్గీ
 • సెంట్రోపస్ అండమాంసిస్,
 • కొకొకలియా ఎస్కులెంటా,
 • డిక్రరస్ అండమానీస్
 • నినోక్స్ అఫ్ఫినిస్,
 • స్టర్నస్ ఎరిత్రోఫిజియస్,
 • రలిన కన్నిగి,
 • ఎయిరోడ్రమస్ ఫ్యూసిఫాగస్,
 • డెండ్రొ బేలేయి,

ద్వీపాలలో చాలిస్ ఏకీ గూడు కట్టుకునే మైదానాలు ఉన్నాయి. ఎడిబుల్- నెస్ట్ స్విఫ్ట్‌లెట్ చైనీయులు సూపు చేసుకుంటారు.

                                     

4.3. జంతుజాలం ​​ సరీసృపాలు, ఉభయచరాలు

ద్వీపాలలో పలు విషపూరితమైన సర్పాలు, టోడ్లు, కప్పల వంటి సరీసృపాలు ఉన్నాయి. సౌత్ అండమాన్ క్రియాట్ బంగరస్ అండమాంసిస్, అండనాన్ వాటర్ మానిటర్ వరనాస్ సాల్వేటర్ అండంసిస్ లు వాటిలో ప్రధానమైనవవి. హావ్‌లాక్ ఐలాండ్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉప్పునీటి మొసలి శరణాలయం ఉంది. 25 సంవత్సరాల కాలంలో ఇక్కడ 24 మొసలి దాడులు నమోదైయాయి. ఇందులో అమెరికన్ పర్యాటకుడు ల్యూరెన్ ఫైలా మరణం కూడా ఒకటి. అండమాన్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయకపోవడం, మొసలి శరణాలయం గురించి పర్యాటకులను హెచ్చరించక పోవడం వంటి అజాగ్రత్తలకు విమర్శలకు గురౌతుంది.

మొసళ్ళు శరణాలయం లోనే కాక ద్వీపం అంతటా కనిపిస్తున్నాయి. ఇక్కడ కట్టుబాటు ఉంది కనుక మొసళ్ళ సంఖ్య అధికం కాకుండా స్థిరంగా ఉంటుంది. ప్రజల నివాసాలు ప్రధాన ద్వీపాలలో ఉంటాయి. హావ్‌లాక్ శిలలమీద కూడా కొన్ని నివాసాలు ఉంటాయి. మాంగ్రోవ్ అరణ్యాలంతటా మొసళ్ళు ఉంటాయి. మొసళ్ళు నదులు, మడుగుల మద్య సంచరించడానికి సముద్రమర్గాన్ని ఉపయోగించుకుంటయి. అయినా సాధారణంగా సముద్రాలలో మొసళ్ళు కనిపించవు. శిలాసదృశ్యమైన సముద్రతీరాలు, మాంగ్రోవ్ అరణ్యాల సమీపాలలో ఈతకు వెళ్ళకుండా ఉండడం సురక్షితం.

                                     

5. మతం

అండమాన్, నికోబార్ జిల్లాలలో ప్రజలు అనిమిజం భగవంతుడు సర్వాంతర్యామి అనే మతాన్ని అనుసరిస్తున్నారు. అండమాన్, నికోబార్ జిల్లాలలో గిరిజన ప్రజలు అత్యధికంగా అనుసరిస్తున్న ప్రధాన మతం ఇదే. ద్వీపంలోని గిరిజన ప్రజలు పలుగా దైవం ప్రపంచంలోని సకల సంఘటనలకు బాధ్యుడని వారు విశ్వసిస్తున్నారు. పురాణ కథనాలను అనుసరించి పలగు అండమాన్, నికోబార్ జిల్లాలలో ఎత్తైనదిగా గుర్తింపు పొందిన శాడిల్ శిఖరం మీద నివసించాడని భావిస్తున్నారు. గిరిజన ప్రజలు పలగు దైవానికి అప్రియమైన కార్యాలను చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. అనిమిజం అనుసరించే ప్రజలు ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయని విశ్వసిస్తున్నారు. గిరిజన ప్రజలు తమ కలల అనుభవాలను ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. వారు నిర్ణయాలను తీసుకోవడానికి కలలను విశ్వసిస్తుంటారు కనుక కలలు కనడాన్ని వారు అనుమతిస్తుంటారు. అండమాన్, నికోబార్ జిల్లాలలోని ప్రజలు అనుసరిస్తున్న ఇతర మతాలలో మొదటి స్థానంలో ఇస్లాం, తరువాతి స్థానంలో హిందూమతం, తరువాతి స్థానాల్లో బుద్ధిజం, సిక్కిజం, జైనిజం, క్రైస్తవం ఉన్నాయి.

                                     

6. గణాంకాలు

అండమాన్ జనసంఖ్య 343.125 in 2011.1960 నుండి జనసంఖ్య 50.000 అభివృద్ధి చెందింది. జిల్లాలో ప్రజలలో అత్యధికులు వలస ప్రజలే. బ్రిటిష్ కాలనీ కాలం నుండి ఇక్కడకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగాల్, ఆంధ్ర, తమిళనాడుకు చెందిన ప్రజలు అధికంగా ఇక్కడ స్థిరపడి ఉన్నారు.

                                     

6.1. గణాంకాలు స్థానిక అండమానీయులు

అండమాన్‌లో నివసిస్తున్న ప్రజలు 1.000 మంది ఉన్నారు. వీరిని అండమానీయులు, స్థానికులు, ఆదివాసులు అని పిలుస్తుంటారు. 1850 అండమానీయులు వెలుపలి ప్రజలతో మొదటిసారిగా ఒప్పందానికి వచ్చిన సమయంలో స్థానికుల సంఖ్య 7.000 ఉండవచ్చని అంచనా. వారిలో ఈ కింది వర్గాలు చెందిన వారు ఉన్నారు.

 • జార్వా.
 • గ్రేట్ అండమానీయులు
 • సెంటినెల్సి.
 • జంగిల్ లేక రూట్‌లాండ్ జార్వా.
 • ఒంజ్ ప్రజలు.

అండమాన్‌లో స్థిరపడే వారి సంఖ్య క్రమంగా అభివృద్ధిచెందుతూ ఉంది. స్థానిక అండమాన్ ప్రజలు బ్రిటిష్ సైన్యాల దాడి, భూముల ఆక్రమణ, అంటువ్యాధుల కారణంగా వారి భూములను క్రమంగా కోల్పోయారు. వెలుపలి నుండి ఆరంభంలో ఖైదీలు, కూలీలు ఉండేవారు. తరువాతి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు. ప్రస్తుతం స్థానిక అండమానీయులు 400-450 వరకు మిగిలి ఉన్నారు. జంగిలీలు త్వరలో కనుమరుగుకానున్నారు. అసలైన 10 జాతులకు చెందిన అండమానీయులు మొత్తం 5.000 మంది ఉండేవారు. వీరిలో అత్యధికులు ప్రస్తుతం కనుమరుగైయ్యారు. జీవించి ఉన్న 52 మంది అధికంగా హిందీ మాట్లాడుతుంటారు. ఓంజ్ ప్రజలు 100 మంది కంటే తక్కువగా ఉన్నారు. జార్వా, సెంటెనిలీయ ప్రజలు ఇప్పటికీ స్వతంత్రంగా జీవిస్తున్నారు. వీరు ఇతరులతో సంబంధాలను తిరస్కరిస్తుంటారు. వీరి సంఖ్య ఇదమిద్దంగా లేనప్పటికీ 100 లోపుగా ఉంటారని భావిస్తున్నారు.

                                     

7. ప్రభుత్వం

కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ జికోబార్ జిల్లా కేంద్రం పోర్ట్‌బ్లెయర్. అండమాన్ ప్రధాన ప్రజలు ఇక్కడే నివసిస్తున్నారు. అండమాన్ ద్వీపంలో ఒకేఒక జిల్లా ఉంది. 1974లో నికోబార్ ద్వీపానికి కూడా సరికొత్త జిల్లా ఏర్పాటు చెయ్యబడింది.

                                     

8. సంస్కృతి

ఈ ద్వీపాలు ఆర్తర్ కొనాన్ డోలీ వ్రాసిన షెర్లాక్ హోంస్ మర్మం, ది సైన్ ఆఫ్ ఫోర్, అలాగే ఎం.ఎం.కే వ్రాసిన డెత్ ఇన్ ది అండనాన్ లలో అండమాన్ ప్రధాన వేదికగా ఉంది. లేడీ గ్రాగరీ నాటకం స్ప్రెడ్డింగ్ ది న్యూస్ నాటకంలో మెజిస్ట్రేట్‌గా నటించిన నటుడు ఒకప్పుడు అండమాన్‌లో పనిచేసాడు. వికాస్ స్వరూపు వ్రాసిన సిక్స్ సస్పెక్ట్స్ ప్రధాన పాత్ర అండమాంవాసిగా వర్ణించబడింది. 1996లో ప్రియదర్శన్ దర్శకత్వంలో విడుదలైన మలయాళ చిత్రం కాలాపానీ, తమిళ చిత్రం శిరైచాలై చిత్రాల్లో స్వాతంత్ర్య పోరాట సమయంలో పోర్ట్ బ్లెయర్‌ సెల్యులర్ బహిరంగ జైలులో ఖైదీలు అనుభవించిన హింసను చిత్రీకరించారు. 2011లో పద్మావెంకటరామన్ వ్రాసిన ఐలాండ్స్ ఎండ్ నవలలో స్థానిక షామన్ శిక్షణ గురించి వివరించబడింది.

                                     

9. ప్రయాణవసతులు

అండమాన్ దీవిలో ఉన్న ఒకేఒక విమానాశ్రయం పోర్ట్ బ్లెయర్‌లో ఉన్న వీరసావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మాత్రమే. ఇక్కడి నుండి కొలకత్తా, చెన్నై, ఢిల్లీ, బెంగుళూరు అరియు భువనేశ్వర్ లకు విమానసర్వీసులు లభిస్తాయి. ఈ విమానశ్రయం భారతీయ నావికాదళం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇక్కడి నుండి పగలు మాత్రమే ప్రయాణం చేయడానికి వీలౌతుంది. 1.000 చరపు మీటర్ల వైశాల్యంలో ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ ఒకటి ఉత్తర అండమాన్‌లోని డిగిల్పూర్ వద్ద ఉంది. అండమాన్ ద్వీపంలో ఉన్న తక్కువ పొడవైన మార్గాలు, తక్కువగా లభించే విమానాలు ఉన్న కారణంగా విమానప్రయాణం చాలా ఖతీదైనదిగా భావించవచ్చు. అయినప్పటికీ వెలుపలి వారికంటే స్థానికులకు ఇది చౌకైన మారమని చెప్పవచ్చు. వసంత, శీతాకాలాలలో విమానచార్జీలు అధికంగా ఉంటాయి. ఇండియన్ చివిల్ అవియేషన్ పరిశ్రమ విస్తరణ తరువాత విమానచార్జీలు తక్కువగా ఉంటాయి.

                                     
 • క ద రప ల త ప ర తమ న అ డమ న న క బ ర ద వ ల 572 ద వ ప ల సమ హ వ ట ల 37 ద వ ల ల ప రజల న వస స త న న ర బ గ ళ ఖ త అ డమ న సమ ద ర కల స వద ద ఈ ద వ ప ల
 • తక క గ ఉన నక ల ల అ డమ న ద వ ప ల ఆగ న య ష య త అన స ధ నమ ఉన న యన భ వ స త న న అ ద క తగ న ఆధ ర ల మ త ర ల వ న క బ ర ద వ ల ఎప ప డ ఖ డ త అన స ధ న చబడ
 • తహస ల స డ గ ల ప ర మ య బ దర ర గత ఉన న య అ డమ న న క బ ర ద వ ల న క బ ర జ ల ల స త అ డమ న జ ల ల Law, Gwillim 2011 - 09 - 25 Districts of India
 • ద వ పకల ప న క పడమట వ ప న ఉ ద అ డమ న సమ ద ర న క పశ చ మ న ఉన న బ గ ళ ఖ త న డ ద న న వ ర చ స త మధ యల అ డమ న న క బ ర ద వ ల ఉన న య ద న దక ష ణ క సన
 • స త అ డమ న జ ల ల బ గ ళ ఖ త ల న క ద రప ల త ప ర తమ న అ డమ న న క బ ర ద వ లల న 3 జ ల ల ల ల ఒకట ద న మ ఖ య పట టణ ప ర ట బ ల య ర క ద రప ల తప ర త
 • భ రతద శ ల 8 క ద ర ప ల త ప ర త ల ఉన న య అ డమ న న క బ ర ద వ ల - ప రధ న భ భ గ న క ద ర గ ఉన న ద వ ల చ డ గఢ - ప జ బ హర య న ల మధ య ఎవర క చ ద లన
 • హ ల ల న క ద వ ల హ ద మహ సమ ద ర న క చ ద న అ డమ న న క బ ర ద వ ల అట ల ట క మహ సమ ద ర న క చ ద న కర బ యన సమ ద ర ల న ఏ ట ల లస Antilles ద వ ల ఇతర
 • మహ త మ గ ధ సమ ద ర జ త య వన అ డమ న న క బ ర ద వ ల ల న వ డ ర ప ర త ల ఉ ద ఇద దక ష ణ అ డమ న జ ల ల ల క వస త ద గత ల ద న ప ర వ డ ర సమ ద ర
 • వ యవ య ద శల ల భ రతద శ ఉత తర న బ గ ల ద శ త ర ప న మయన మ ర అ డమ న న క బ ర ద వ ల ఉన న య శ ర ల క ల న స గమన క ద క వ యవ య క న వద ద ఉన న స మత ర
 • ఆ గ ల న గ ల డ - న గ మ స ఆ గ ల క రళ - మలయ ళ లక షద వ ప - మలయ ళ అ డమ న న క బ ర ద వ ల - బ గ ల త ల గ ఉర ద బ హ ర - మ థ ల బ హ ర ల ద భ జ ప ర
 • 300 క ల మ టర ల ద ర ల ఉన న య ఈ ద వ లల పద ద వ ల మ త రమ జన వ స ఉన న ద వ ల మ గ ల న 17 న ర జ వ ద వ ల ఇవ క క ఇ క ల క కల క త స క న ఎన న చ న న

Users also searched:

అండమాన్ నికోబార్,

...

అల్ప‌పీడ‌నం వ‌ల్ల భారీగా వ‌ర్షాలు.

లాక్ డౌన్ అమలులో ఉన్న గత 27 రోజుల్లో లక్షద్వీప్ తో పాటు అండమాన్ & నికోబార్ దీవులకు. మొదటి సారి భారతదేశం యొక్క అండమాన్ దీవులకు ఎగురుతోంది యూట్యూబ్. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పర్యటించారు. అండమాన్‌లోని అత్యంత ఎత్తైన శాండిల్‌. Haddo Post Office, address హద్దో, పోర్ట్ బ్లేర్, అండమాన్ మరియు నికోబార్ దీవులు 744102, భారతదేశం,.


...