Back

ⓘ సునేత్ర గుప్తా
సునేత్ర గుప్తా
                                     

ⓘ సునేత్ర గుప్తా

ఈమె 1965 లో కోల్‌కతా పశ్చిమ బెంబాల్ లో జన్మించారు. తండ్రి ధ్రుభగుప్తా లెక్చరర్ కావడంతో ఈమె బాల్యం ఇధోఫియా, జాంబియా లతో పాటు ఆఫ్రికా, యూరప్ ఖండాలలో సాగింది. సునెత్ర ఉన్నత విద్యాభ్యాసం అనంతరం ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుంచి బయాలజీలో పి.జి. అనంతరం పి.హెచ్.డి చేశారు. ఈమె ప్రత్యేకించి జీవశాస్త్ర ప్రాతిపదిక మీద సాంక్రమిత వ్యాధుల మీద గాఢ పరిశోధనలు చేశారు. తదనంతరం తండ్రితో పాటు మాతృదేశానికి వచ్చి కోల్‌కతాలో స్థిరపడ్డారు. ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో ఎపిడిమియాలజీ సాంక్రమిక వ్యాధులు - అంటు వ్యాధులు విభాగంలో రీడర్ గా కొంతకాలం పనిచేసి కూడా స్వదేశం మీద అభిమానంతో కోల్‌కతాలో నివసిస్తున్నారు.

                                     

1. శాస్త్ర రంగంలో విజయాలు

గుప్తా ప్రస్తుతం ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని "థీయరీటికల్ ఎపిడెర్మియాలజీ" విభాగానికి ప్రొఫెసర్ గా యున్నారు. ఆమె "ప్రిన్స్‌టాన్ విశ్వవిద్యాలయ ప్రెస్"కు యూరోపియన్ అడ్వయజరీ బోర్డులో యున్నారు ఈమె చేసిన పరిశోధనలకు గానూ "జూలోజికల్ సొసైటీ ఆఫ్ లండన్" వారి సైంటిఫిక్ మెడల్, రాయల్ సొసైటీ రోసలిండ్ ఫ్రాంక్లిన్ అవార్డు లను పొందారు. ఆమె వ్రాసిన నవలకు కేంద్ర సహిత్య అకాడామీ అవార్డు, సౌత్ ఆర్ట్స్ లిటరేచర్ ప్రైజ్, క్రాస్ వర్డ్ అవార్డు అంరియు ఆరెంజి ప్రైజ్ లను పొందారు.

గుప్తా యొక్క చిత్రాన్ని జూలై 2013 లో జరిగిన ప్రతిష్ఠాత్మక రాయల్ సొసైటీ సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రముఖ మహిళా శాస్త్రవేత్త అయిన మేడం క్యూరీ సరసన చేర్చడం జరిగింది.

                                     

2. రచయితగా విజయాలు

గుప్తా రచనలను బెంగాలీ భాషలో వ్రాసారు. ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కవితలను అనువాదం చేశారు. ఆమె అనేక నవలను రచించారు. ఆమె అక్టోబరు 2012 న ఐదవ నవల So Good in Black దక్షిణ ఆసియా సాహిత్యలో డి.ఎస్.సి ప్రైజ్ కు ఎంపికయ్యింది.

డాక్టర్ సునెత్రగారు వైద్య శాస్త్ర రంగంలో పరిశోధనలు చేస్తున్నప్పటికీ సాహిత్యం మీద అభిరుచి ఉండటంతో రచనా వ్యవసాయంలోనూ విశేష కృషి చేశారు. 1992 లో "మెమొరీస్ ఆఫ్ రైన్" నవలను కవితాత్మకంగా రాశారు. 1993 లో రాసిన "ద క్లాస్ బ్లోయర్స్ బ్రీత్" నవలలో భారత్ లో సగటు మానవ జీవన వైరుధ్యాలను లోతుగా విశ్లేషిస్తూ కళ్లకు కట్టినట్లుగా అభివర్ణించారు. కథా కథనంలో కొవ్వొత్తులు తయారు చెసేవారు. బేకరీలలో రొట్టెలు తయారుచేసేవారు మొదలైన శ్రామికుల జీవన విధాన చిత్రాలు చక్కగా, అంతర్లీనంగా ఇమిడ్చారు. ఈ నవలలో భారతీయత తొణికిసలాడుతూ పాఠకుల్ని అతి చక్కగా ఆకర్షించింది, మైమరపించగలిగింది. ఈమె నవలా సాహిత్యం జాతీయ, అంతర్జాతీయ సాహితీ రంగాలలో విశేష ఖ్యాతి పొందడంతో 1995 లో "అవార్డ్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీషు" అందుకున్నారు.

సునేత్ర గారి విద్యాభ్యాసం అంతా విదేశాలలో జరిగినప్పటికీ భారతీయ మూలాలను ఆమె విస్మరించలేదు. ఆమె భారత జీవన శైలి పై మక్కువ పెంచుకున్నారు తండ్రితోపాటు భారతదేశం వచ్చినపుడు ఇక్కడి అనుభూతులు, ఆలోచనలను భద్రంగా మూటకట్టుకునేవారు. ఈమె రవీంద్రనాథ్ ఠాకూర్ కు ఏకలవ్యశిష్యురాలిగా తనను తాను మలచుకున్నారు. "గీతాంజలి" నవలను ఆంగ్లంలో అనువదించారు.

                                     

3. మహిళా శాస్త్రవేత్తగా

సునేత్రగారి వృత్తి పర జీవితంలో కూడా అనేక వెలుగుకోణాలు ఉన్నాయి. బయాలజీ ప్రొఫెసర్ గా ఒక పక్క బోధన చేస్తూనే, నిరంతర విద్యార్థిగా మరో వైపు పరిశోధనలు చేస్తూ విజయాలను సాధించారు. ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో సాంక్రమిత వ్యాధులు మీద, చికిత్సా విధానాలమీద సాధికార పరిశోధనలు చేశారు. ఈమె పరిశోధనా విజయాలకు 2009 లో ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్త పేరు మీద నెలకొల్పిన రోసాలిండ్ ప్ల్రాంక్లిన్ అవార్డు అందింది. ప్రతి యేటా బ్రిటన్ రాయల్ సొసైటీవారు శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేష కృషిచేసిన వారికి అందించిన అత్యున్నత పురస్కారం యిది. ఈ పురస్కారంలో 30 వేల పౌండ్లు నగదు, ఒక పతకమును అందించారు.

                                     

4. అవార్డులు

  • 1999: క్రాస్‌వర్డ్ ప్రైజ్ షార్ట్ లిష్టులో స్థానం సంపాదించారు.
  • 2000: సదరన్ ఆర్ట్స్ లిటరేచర్ అవార్డు, ఆరంజ్ ప్రైజ్ లాంగ్ లిస్ట్
  • 1997: కేంద్ర సాహిత్య అకాడమీ వారి గౌరవ పురస్కారం.
                                     

5. నవలలు

  • A Sin of Colour 1999
  • సొ గుడ్ ఇన్ బ్లాక్ So Good in Black 2009
  • మూన్ లైట్ ఇన్ టు మార్జిఫాన్ Moonlight into Marzipan 1995
  • మెమొరీస్ ఆఫ్ రైన్ Memories of Rain. Penguin Books India, New Delhi 1992, ISBN 0-140-16907-2.
  • ద గ్లాస్ బ్లోయర్స్ బ్రీత్ The Glassblowers Breath 1993