Back

ⓘ విలియం హెర్షెల్




విలియం హెర్షెల్
                                     

ⓘ విలియం హెర్షెల్

సర్‌ ఫ్రెడెరిక్‌ విలియం హెర్చెల్ ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఆధునిక పరికరాలు లేని కాలంలోనే అంతరిక్షంలోని అద్భుతాలను ఆవిష్కరించిన ఖగోళ శాస్త్రవేత్త సర్‌ ఫ్రెడెరిక్‌ విలియం హెర్చెల్‌. వరుణ గ్రహాన్ని కనుక్కొన్నారు)

మొదట మిలటరీలోని బ్యాండు మేళంలో పనిచేసిన వ్యక్తి, తన పరిశోధనలతో ప్రపంచంలోని మేటి ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా ఎదిగారు. అతడే సర్‌ ఫ్రెడెరిక్‌ విలియం హెర్చెల్‌. తొమ్మిది గ్రహాలలో ఒకటైన యురేనస్‌తో పాటు దానికున్న రెండు ఉపగ్రహాలను, శని, గురు గ్రహాలకు చెందిన రెండేసి ఉపగ్రహాలను కనుక్కున్నారు. స్వయంగా రూపొందించుకున్న టెలిస్కోపులతోనే ఆయన నక్షత్రమండలాల గెలాక్సీలు ఆకారాలతో పాటు, విశ్వం స్వరూపాన్ని కూడా అంచనా వేయడం విశేషం. దాదాపు 2500 నక్షత్ర సముచ్ఛయా నెబ్యులాలను, వాటికి సంబంధించిన సిద్ధాంతాలను వెలువరించారు. సూర్యుని చలన మార్గాన్ని నిర్ధరించి, పరారుణ ఉష్ణతరంగాల ఉనికిని చెప్పినది కూడా ఆయనే. ఆయన సుమారు 400కు పైగా టెలిస్కోపులను తయారుచేశారు.

జర్మనీలోని హోనోవర్‌లో 1738 నవంబర్ 15 న జన్మించిన విలియం చిన్నప్పట్నించే వయోలిన్‌ వాయించడం నేర్చుకున్నాడు. తండ్రితో కొంతకాలం మిలటరీ బ్యాండ్‌లో పనిచేసి, తరువాత అన్నతో ఇంగ్లండ్‌ వెళ్లిపోయాడు. కొన్నేళ్లపాటు సంగీతం మీదనే ఆధారపడి బతికిన ఇతడు తరువాత ఖగోళశాస్త్రంపై ఆసక్తిని పెంచుకుని టెలిస్కోపులతో అంతరిక్ష పరిశీలన చేసేవాడు. అలా 1781లో యురేనస్‌ను కనుగొన్నాడు. ఆ ఏడాదే కోప్లీ అవార్డుతో పాటు, ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీగా ఎంపికయ్యారు. సర్‌ బిరుదును కూడా పొందారు. అప్పటి చక్రవర్తి జార్జి3 ఆయన్ను రాజ ఖగోళ పరిశీలకుడి రాయల్‌ ఆస్ట్రానమర్‌గా నియమించాడు. కొద్దికాలానికే యురేనస్‌, శని, గురుగ్రహాల ఉపగ్రహాలను కూడా కనుగొన్నారు. చంద్రునిపై గల పర్వతాలను చూడడమే కాదు, వాటి ఎత్తును కూడా కనుగొన్నారు. ప్రతిష్ఠాత్మకమైన నైట్‌హుడ్‌ సహా అనేక పురస్కారాలు పొందిన ఆయన, 1822 ఆగష్టు 25న తన 84వ ఏట మరణించారు.

                                     

1. ఇతర లింకులు

  • The William Herschel Double Star Catalogs Restored
  • Portraits of William Herschel at the National Portrait Gallery United Kingdom
  • The Oboe Concertos of Sir William Herschel, Wilbert Davis Jerome ed. ISBN 0-87169-225-2
  • Full text of The Story of the Herschels 1886 from Project Gutenberg
  • William Herschels Deep Sky Catalog
  • William Herschel Society
  • Herschel Museum of Astronomy located in his Bath home
  • Works by or about విలియం హెర్షెల్ in libraries WorldCat catalog
  • Chamber Symphony in F minor no. 4- Allegro moderato I
  • Sinfonia n. 12, primo movimento, Allegro
  • Michael Lemonick: William Herschel, the First Observational Cosmologist, 12 Nov 2008, Fermilab Colloquium, Text
  • Symphony No. 8, I: Allegro Assai
  • Sinfonía para Cuerdas no. 8 en Do menor
  • Hubble Images to Herschel Music Chamber Symphony in F, 2nd movement
  • Musical pieces by William Herschel YouTube
  • A notebook of Herschels, dated from 1759 Archived 2019-01-09 at the Wayback Machine is available in the digital collections of the Linda Hall Library.
  • Richmond Sinfonia for Strings, Bassoon & Harpsichord n. 2 in D major