Back

ⓘ జయంత్ విష్ణు నార్లికర్
జయంత్ విష్ణు నార్లికర్
                                     

ⓘ జయంత్ విష్ణు నార్లికర్

జయంత్ విష్ణు నార్లికర్. భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఈ విశ్వంలో భూమిపై తప్ప మరెక్కడా జీవులు లేవా? అనే ప్రశ్న అందరినీ వేధిస్తున్నదే. ఈ అంశంపై సాధికారికమైన పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తల్లో భారత దేశానికి చెందిన జయంత్‌ విష్ణు నార్లికర్‌ ఒకడు.

                                     

1. వ్యక్తిగత జీవితం

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 1938 జూలై 19న పుట్టిన జయంత్‌ నార్లికర్‌ చిన్నతనం నుంచే చురుకైన విద్యార్థిగా గుర్తింపు పొందాడు. తండ్రి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌. తల్లి సంస్కృత పండితురాలు. నార్లికర్ భార్య పేరు మంగళ నార్లికర్. ఆమె గణిత పరిశోధకురాలు, ప్రొఫెసరు. వారికి ముగ్గురు కుమార్తెలు - గీత, గిరిజ, లీలావతి.

                                     

2. విద్య, పరిశోధనలు

బెనారస్‌ విశ్వవిద్యాలయంలోనే బీఎస్సీ డిగ్రీ అందుకున్న జయంత్‌, కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి గణితంలో ఎంఏ చేశాడు. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్‌హొయల్‌ పర్యవేక్షణలో పీహెచ్‌డీ సాధించాడు.

                                     

2.1. విద్య, పరిశోధనలు పరిశోధనలు

సైద్ధాంతిక భౌతిక, ఖగోళ శాస్త్ర, విశ్వసృష్టి కాస్మాలజీ శాస్త్రాలకు ఆయన సేవలందించాడు. మొదట్లో కేంబ్రిడ్జిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ థియరిటికల్‌ అస్ట్రానమీలో అధ్యాపకునిగా పనిచేసి, స్వదేశానికి తిరిగి వచ్చి టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ TIFR లో ప్రొఫెసర్‌గా 1972-88 పనిచేశాడు. ఆపై పుణెలోని ఇంటర్‌ యూనివర్శిటీ సెంటర్‌ ఫర్‌ అస్ట్రానమీ అండ్‌ అస్ట్రోఫిజిక్స్‌కు వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం రిటైరయినా అక్కడే ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ హోదాలో పరిశోధనలు కొనసాగిస్తున్నాడు. ఈయన ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన పరిశోధనలో గ్రహాంతరాలకు చెందిన సూక్ష్మజీవులను కనుగొన్నారు.

బిగ్ బ్యాంగ్‌కు ప్రత్యామ్నాయ సిద్ధాంతాలను ప్రతిపాదించినందుకు నార్లికర్ పేరొందాడు. 1994–1997 కాలానికి ఇతడు ఇంటర్నేషనల్ ఏస్ట్రొనామికల్ యూనియన్ వారి కాస్మాలజీ కమిషన్‌కు అధ్యక్షుడిగా పనిచేసాడు. 41 కి.మీ. ఎత్తున స్ట్రాటోస్ఫియరు నుండి సేకరించిన నమూనాల నుండి సూక్ష్మ జీవులను పెంచిన అధ్యయనంలో నార్లికర్ పాల్గొన్నాడు.

గ్రహాంతరాల్లో జీవం ఉందనే ఆయన వాదనకు 2001 జనవరిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో హైదరాబాద్‌లో జరిపిన ప్రయోగం బలం చేకూర్చింది. ఓ భారీ బెలూన్‌కు అనుసంధానించిన పేలోడ్‌ను భూమి ఉపరితలం నుంచి 41 కిలోమీటర్ల ఎత్తులోని వాతావరణంలోకి ప్రయోగించి అక్కడ సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించాడు. భూమి నుంచి సూక్ష్మజీవులు ఇంత ఎత్తుకు వెళ్లలేవు కాబట్టి, ఇవి భూమికి సంబంధించినవి కావు. ఇతర గ్రహాలకు సంబంధించిన జీవులే అక్కడి వాతావరణంలో ఉన్నాయని నార్లికర్‌ అంచనా వేశాడు. ప్రాణికోటి అవతరణలో గొప్ప మలుపు తెచ్చిన ఈ ప్రయోగం అంగారకుడిపై జరుపుతున్న ప్రయోగాలకు నాంది పలికింది.

నార్లికర్‌ జరిపిన ప్రయోగంలో కనుగొన్న సూక్ష్మజీవులో ఒక జాతికి తన గురువైన ఫ్రెడ్‌హోయల్‌ పేరిట జనీబేక్టర్‌ హొయ్‌లీ అని, మరో జాతికి ఇస్రో పేరిట బేసిల్లెస్‌ ఇస్రోనెన్‌సిస్‌ అని, మూడో జాతికి బేసిల్లస్‌ ఆర్యభట్ట అని పేరు పెట్టాడు.

సైన్స్‌ను సామాన్యుడికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్న ఆయన ఇంగ్లిషు, మరాఠీ, హిందీ భాషల్లో సైన్స్‌కు సంబంధించిన అనేక కథలు, నవలలు, వ్యాసాలు రాశాడు.                                     

3. రచనలు

నాన్ ఫిక్షన్ రచనలు

 • సైంటిఫిక్ ఎడ్జ్: ది ఇండియన్ సైంటిస్ట్ ఫ్రమ్ వేదిక్ టు మోడర్న్ టైమ్స్
 • ఎ డిఫరెంట్ అప్రోచ్ టు కాస్మాలజీ
 • కరెంట్ ఇష్యూస్ ఇన్ కాస్మాలజీ, 2006
 • ఎన్ ఇంట్రొడక్షన్ టు కాస్మాలజీ
 • ఫ్రెడ్ హోయిల్స్ యూనివర్స్
 • ఫ్యాక్ట్స్ అండ్ స్పెక్యులేషన్స్ ఇన్ కాస్మాలజీ జి. బర్బ్రిడ్జ్ తో కలిసి, G. Burbridge, Cambridge University Press 2008, ISBN 978-0-521-13424-8
                                     

4. పురస్కారాలు

 • పద్మ విభూషణ్ - 2004
 • రాష్ట్రభూషణ్ అవార్డు - 1981 Rs. One Lak from FIE Foundation Ichalkaranji
 • మహారాష్ట్ర భూషణ్ పురస్కార్ - 2011
 • కళింగ అవార్డు - 1996
 • పద్మభూషణ్ - 1965