Back

ⓘ రెమ్మ
రెమ్మ
                                     

ⓘ రెమ్మ

రెమ్మ కొన్ని రకాల చెట్లలో మాత్రమే ఉండే వృక్ష భాగము. ఒక చెట్టులోని రెమ్మలు ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి. దీనికి మధ్యలో కాడ అటూ ఇటూ ఆకులూ ఉంటాయి. వేప, చింత, కరివేపాకు మొదలగు అనేక చెట్లకు ఇలాంటి రెమ్మలు ఉంటాయి. రెమ్మను రెబ్బ లేక రెంబ అంటారు.

రెమ్మలలో మిశ్రమ పత్రములందున్న చిన్నచిన్న ఆకులను చిట్టి ఆకులందుము. వేపాకులో చిట్టి ఆకులు జతలు జతలుగా ఉండి చివరన ఒకటి కలదు, ఆకుల సంఖ్య బేసి. తురాయి ఆకులో అన్నియు జతలు జతలు గానేయున్నవి, ఆకుల సంఖ్య సరి. కావున తురాయి ఆకును సమభిన్నపత్రమనియు, వేపాకును విషమభిన్నపత్రమనియు చెప్పుదుము. వేపాకు, చింతాకు, తురాయి ఆకులలో చిట్టి ఆకులు మధ్యనున్న కాడకు రెండు ప్రక్కల పక్షి రెక్కల మీదనున్న ఈకలవలె ఉండుటచే ఆ ఆకును పక్షివైఖరిగ ఉన్నదందుము.