ⓘ Free online encyclopedia. Did you know? page 276


                                               

సుకుమార్

సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. దర్శకుడు కాక ముందు గణితం అధ్యాపకుడు. 2004లో ఇతని మొదటి చిత్రం అల్లు అర్జున్ తోఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ను స్టార్ గా నిలబెట్టింది. రెండవ చిత్రం హీరో రామ్ పోతినేని తోజగడం టేకింగ్ పరంగా వైవిధ్యం ...

                                               

సుకృతి అంబటి

సుకృతి, జూలై 5న ఢిల్లీ లో జన్మించింది. సుకృతి తండ్రి స్వగ్రామం నెల్లూరు జిల్లా, కావలి. ఆయన ఉద్యోరీత్యా సివిల్ ఇంజనీర్ ఏళ్ల క్రితం ఢిల్లీలో స్థిరపడ్డారు.

                                               

సుకృతి కండ్పాల్

సుకృతి కండ్పాల్, భారతీయ టీవీ నటి, మోడల్. ఆమె నటించిన అగ్లే జనమ్ మోహే బిటియా హి కిజో, దిల్ మిల్ గయే, ప్యార్ కీ యే ఏక్ కహానీ, కైసా యే ఇష్క్ హై. అజబ్ సే రిస్క్ హై, దిల్లీ వాలీ ఠాకూర్ గర్ల్స్ వంటి సీరియళ్ళ ద్వారా ప్రఖ్యాత నటిగా నిలిచింది సుకృతి. 2014 ...

                                               

సుఖ్‌దేవ్

సుఖ్ దేవ్ థాపర్ భారత స్వాతంత్ర్య సమర, ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్, రాజ్‌గురు ల సహచరునిగా ప్రసిధ్ధి. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం పై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి "జె.పి. సాండర్స్" ను హతమార్ ...

                                               

సుగుణ పురుషోత్తమన్

సుగుణ పురుషోత్తమన్ ఒక భారతీయ కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, స్వరకర్త, గురువు. ఈమెకు 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.

                                               

సుగుణా వరదాచారి

ఈమె తమిళనాడు రాష్ట్రంలోని దారాపురం గ్రామంలో 1945, డిసెంబర్ 20వ తేదీన జన్మించింది. ఈమె పి.కె.రాజగోపాల అయ్యర్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, కె.ఎస్.కృష్ణమూర్తిల వద్ద సంగీతం నేర్చుకుంది. ఈమె గాత్ర సంగీతంతో పాటుగా వీణావాద్యంలో కూడా ప్రావిణ్యాన్ని సంపాది ...

                                               

సుచిత్రా కృష్ణమూర్తి

ఈమె ముంబాయిలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి కృష్ణమూర్తి ఇన్‌కం టాక్స్ కమీషనర్. తల్లి సులోచన మంచి గాయకురాలు. ఈమె అన్నయ్య డాక్టరు. ఒక అక్కకు గేమ్స్ కంపెనీ ఉంది. మరో అక్క శాస్త్రీయ సంగీత కళాకారిణి. సుచిత్ర కూడా గ్వాలియర్ ఘరానా శైలిలో శ ...

                                               

సుజాత (నటి)

సుజాత. ఒక మలయాళ నటి. ఈమె శ్రీలంకలో పుట్టి పెరిగింది. జన్మస్థలం కేరళ లోని మరదు. తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ భాషల చలనచిత్రాలలో నటించిన ఒక ప్రసిద్ధ దక్షిణ భారత నటి. కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డ తరువాత ఆమె 58 ఏళ్ళ వయసులో చెన్నైలోని తన నివాసంల ...

                                               

భీష్మ సుజాత

సుజాత పాతతరం సినిమానటి. ఈమె తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించింది. భీష్మ సినిమాలో మత్స్యగంధి వేషం వేసి హైలో హైలెస్సా హంస కదా నా పడవ అనే పాట ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని వారి మనసులలో భీష్మ సుజాత గా నిలిచిపోయింది.

                                               

సుజాతా రామదొరై

సుజాతా రామదొరై బెంగుళూరులో పెరిగింది. ఆమె కుటుంబంలో విద్యావేత్తలు లేనప్పటికీ ఆమె తల్లితండ్రులు ఆమెను చదివించడానికి ముఖ్యత్వం ఇచ్చారు. ఆమె విద్యావేత్తగా ఎదగడానికి ప్రేరణ ఇచ్చిన వారిలో వారి అమ్మమ్మ కూడా ఒక్కరు. ఆమెకు విఙానతృష్ణ అధికంగా ఉన్నప్పటికీ ...

                                               

సుజిత

సుజిత ఒక దక్షిణ భారత సినీ, టీవీ నటి. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో, టీవీ సీరియళ్ళలో నటించింది. ఈమె అన్న సూర్యకిరణ్ సినీ దర్శకుడు. ఇతను తెలుగులో సుమంత్ హీరోగా సత్యం సినిమాకు దర్శకత్వం వహించాడు. నటి కల్యాణి ని వివాహం చేసుకున్నాడు.

                                               

సుదీప్

సుదీప్ దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత, సినీ రచయిత, టీవీ వ్యాఖ్యాత. కన్నడంలో ప్రముఖ కథానాయకుడైన సుదీప్ ఈగ సినిమాలో ప్రతినాయక పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. సుదీప్ నటించిన ప్రముఖ కన్నడ సినిమాలు స్పర్శ 2000, హుచ్చా 200 ...

                                               

సుద్దాల అశోక్ తేజ

సుద్దాల అశోక్ తేజ తెలుగు సినిమా కథ, పాటల రచయిత. సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాశాడు. ఠాగూర్ చిత్రంలో ఆయన రచించిన నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు.

                                               

సుధ (నటి)

సుధ ఒక ప్రముఖ సినీ నటి. 500 కి పైగా తెలుగు సినిమాలలో నటించింది. ఆమె, గ్యాంగ్‌లీడర్‌, చాలా బాగుంది, అతడు, దూకుడు, బాద్‍షా లాంటి సినిమాలో మంచి పాత్రలు పోషించింది. తెలుగులో మహేష్ బాబు, జూనియర్‌ ఎంటీఆర్, అల్లు అర్జున్, తమిళంలో సూర్య, అజిత, విశాల్‌ వం ...

                                               

సుధ కొంగర

సుధ కొంగర ఒక భారతీయ చిత్ర దర్శకురాలు, స్క్రీన్ రైటర్, తమిళ సినిమాల్లో ప్రధానంగా పనిచేస్తుంది. 49 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఆంగ్ల చలన చిత్ర పురస్కారాన్ని గెలుచుకున్న భారతీయ ఆంగ్ల చిత్రం మితర్, మై ఫ్రెండ్ చిత్రాలకు ఆమె స్క్రీన్ రైటర్‌గా అడు ...

                                               

సుధా చంద్రన్

సుధా చంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో మయూరి సిని ...

                                               

సుధా పెన్నథూర్

సుధా పెన్నాథూర్ చెన్నైలో జన్మించారు, భారతీయ ఆభరణాలు, కండువా, ఆర్ట్ ఆబ్జెక్ట్స్ డిజైనర్, మహిళా ఎంట్రెప్రినేటర్. పెన్నాథూర్ భారతీయ ప్రేరేపిత అమెరికన్ మార్కెట్‌కు తగ్గట్టుగా ఆభరణాల రూపకల్పన చేస్తారు. ఆమె ఉత్పాదకత, వ్యాపార నిర్వహణ పుస్తకాల రచయిత.

                                               

సుధా మూర్తి

పద్మశ్రీ సుధా మూర్తి, ఒక భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈవిడ పలు అనాధాశ్రమాలను ప్రారంభించింది. అలాగే గ్రామీణాభివృ ...

                                               

సుధా రఘునాథన్

సుధా రఘునాథన్ భారతదేశానికి చెందిన కర్ణాటక గాయకురాలు, స్వరకర్త. ఆమెకు కలైమమణి పురస్కారాన్ని 1994 లో తమిళనాడు ప్రభుత్వం, పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రదానం చేసింది.

                                               

సుధేష్ణ సిన్హా

సుధేష్ణ సిన్హా తల్లితండ్రులు ఆడపిల్లలను మగపిల్లలతో సనానంగా భావించారు. ఆమె తల్లితండ్రులు ఆమెకు తగిన స్వతంత్రం ఇస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం నేర్పారు. చిన్న వయసులోనే ఆమె తన అవకాశాలను సద్వినియోగపరచడం ఎలాగో నేర్చుకున్నది.

                                               

సునీతా నారాయణ్

సునీతా నారాయణ్ భారతీయ పర్యావరణవేత్త, సామాజికసేవా కార్యకర్త, ఉద్యమకారిణి. ఆమె ప్రస్తుతం సొసైటీ ఫర్ ఎన్వినాన్‌మెంటల్ కమ్యూనికేషన్స్కు డైరక్టర్ గా ఉన్నారు. ఆమె డౌన్ టు ఎర్త్ అనే ఆంగ్ల పక్షపత్రికకు కు డైరక్టర్ గా కూడా యున్నారు. 2016 లో టైమ్ మ్యాగజైన్ ...

                                               

సునీతా విలియమ్స్

సునీతా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, NASA వ్యోమగామి. అంతర్జాతీయ అంతరిక్ష స్టేషను నియమించి సాహసయాత్ర 14కు సభ్యురాలిగా చేశారు తర్వాత ఆమె సాహసయాత్ర 15లో చేరారు. 1983 లో విలియమ్స్ మేరీల్యాండ్‌లోని అన్నాపోలిస్‌లోని యు.ఎస్. నావల్ అకాడ ...

                                               

సుపర్ణా సిన్హా

సుపర్ణా సిన్హా తండ్రి ఆంథ్రోపాలజిస్ట్- కళాకారుడు. ఆమె తల్లి కళాకారిణి అలాగే ఫిజిస్ట్. ఆమె సోదరి సుకన్యా బెంగుళూరు ఐ.ఐ.టిలో ఫిజిస్ట్. ఆమె తల్లి ఉద్యోగబాధతల నడుమ కుటుంబ బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించింది. ఆమె పిల్లల సృజనాత్మక శక్తిని, నేర్చుకునే ...

                                               

సుప్రీత్

సుప్రీత్ ఒక తెలుగు సినీ నటుడు. ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషిస్తుంటాడు. ఛత్రపతి, మర్యాద రామన్న సినిమాలో ప్రతినాయకుడిగా మంచి పేరు సంపాదించాడు. విక్రమార్కుడు హిందీ రీమేక్ సినిమా రౌడీ రాథోడ్ లో టిట్లా అనే పాత్రతో బాలీవుడ్ లో ప్రముఖ పాత్రలో నట ...

                                               

సుబ్బరామయ్య మీనాక్షిసుందరం

సుబ్బరామయ్య మీనాక్షిసుందరం భారతీయ గణిత శాస్త్రవేత్త. ఆయన ఉష్ణ కెర్నల్స్, పరావలయ పాక్షిక అవకలన సమీకరణాలలో విశేష కృషిచేసినవాడు. ఆయన "మీనాక్షిసుందరం-ప్లీజెల్ జీటా సమీకరణము"ను ప్రవేశపెట్టాడు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాథమటికల్ ఫిజిక్స్ శాఖలో ఉపాధ్య ...

                                               

సుబ్బారావు పాణిగ్రాహి

సుబ్బారావు పాణిగ్రాహి విప్లవ ప్రజాకవి. ఇతడు 1934, సెప్టెంబర్ 8న శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం బారువాలో ఒక పూజారి కుటుంబంలో జన్మించాడు. బొడ్డపాడు గ్రామానికి పూజారిగా వచ్చాడు. అక్కడ తామాడ గణపతి, పంచాది కృష్ణమూర్తిలతో పరిచయమై వారితో కలసి యువకులను ...

                                               

సుబ్బు ఆరుముగం

సుబ్బు ఆరుముగం ఒక భారతీయ సంగీతకారుడు, రచయిత, విల్లుపట్టు కళాకారుడు. 2021లో భారతప్రభుత్వం ఇతడికి నాలుగవ ఉన్నత పౌరపురస్కారం పద్మశ్రీ కళలు, సాహిత్యం విభాగంలో యిచ్చి సత్కరించింది. ఇతడు విల్లుపట్టు కళారూపానికి సంబంధించి 15 పుస్తకాలను ప్రచురించాడు. వీట ...

                                               

సుబ్రహ్మణ్య భారతి

చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగానూ, "మహాకవి భారతి"గానూ సుప్రసిద్ధుడు, తమిళ సాహిత్య ప్రముఖుల్లో అత్యున్నత వ్యక్తిగా పేరొందారు. ఆయన అసంఖ్యాక ...

                                               

సుబ్రహ్మణ్య శివ

సుబ్రమణ్య శివ 1884, అక్టోబర్ 4న మద్రాసు ప్రెసిడెన్సీ, మధురై జిల్లా, దిండిగుల్ సమీపంలోవున్న బాట్లగుందులోని అయ్యర్ కుటుంబంలో రాజం అయ్యర్ కు జన్మించాడు. 1908లో భారత స్వాతంత్ర్యోద్యమం లో చేరాడు.

                                               

సుభద్రా శ్రీనివాసన్

సుభద్రా శ్రీనివాసన్ 1925, ఆగస్టు 18న పరాంకుశం నరసింహస్వామి, ఆండాళమ్మ దంపతులకు కర్నాటక లోని బళ్లారి జిల్లాలో జన్మించింది. నరసింహస్వామి స్వగ్రామం ఒరిస్సా లోని బరంపురం. బళ్లారిలో పోలీస్ ఇనస్నెక్టర్ గా పనిచేశారు. విశాఖపట్టణం లోని ఎ.వి.ఎన్. కళాశాలలో, ...

                                               

సుభా తోలె

సుభా తోలె 1997 లో ముంబయి లోని సెయింట్ క్సావియర్ కాలేజీలో లైఫ్ సైన్సెస్, బయో కెమిస్ట్రీలలో బి.యస్సీ డిగ్రీని పొందారు. ఆమె కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎం.యస్సీ, పి.హెచ్.డి లను పొందారు. ఆమె "బయో మార్కర్స్" అనే అంశంపై డాక్టరేట్ చేశ ...

                                               

సుభాష్ కాక్

సుభాష్ కాక్ భారతీయ-అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త. హిందుత్వ ఆధారిత చారిత్రక రివిజనిస్టు. అతను ఓక్లహోమా స్టేట్ యూనివర్శిటీ-స్టిల్‌వాటర్‌లో కంప్యూటర్ సైన్సు విభాగం రీజెంట్స్ ప్రొఫెసరు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గౌరవ విజిటింగ్ ప్రొఫెసరు. భ ...

                                               

సుమ కనకాల

సుమ ప్రజాదరణ పొందిన తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతల్లో ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్ ...

                                               

సుమతి భిడే

ఈమె పూనా విశ్వవిద్యాలయంలో ఎం.యస్సీ చదివిన తర్వాత విదేశాలలో యూనివర్శిటీ ఆఫ్ బ్రుక్సెల్లెస్ లో డి.ఎస్.సి చేశారు. ఈమె ప్రత్యేకంగా కేన్సర్ వ్యాధి చికిత్సా రంగంలో పరిశోధనలు నిర్వహించారు. పొగాకు వాడకానికి, వాతావరణ కాలుష్యానికి సంబంధించి తలెత్తే వివిధ క ...

                                               

సుమతీ రావు

సుమతీ రావు వడోదరాలో పెరిగింది. ఆమె తల్లితండ్రులకు చదువుపట్ల మక్కువ ఎక్కువ. తండ్రి ఆమెకు లక్ష్యం వైపు పయనించాలని నేర్పించాడు. ఆమె మససులో అది ప్రేరణగా మారి శాస్త్రవేత్త కావాలన్నది ఆమె లక్ష్యం అయింది. ఆమె తల్లి మాత్రం వాస్తవాం గ్రహించి జీవితం సాహించ ...

                                               

సుమతీ సూర్య

సుమతీ సూర్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. 9 సంవత్సరాల వయసువరకు ఆమె చదువుకు సహకారం అందించిన వారు ఆమె తల్లితండ్రులే. మద్యాహ్నం వేళలో ఆమె తల్లి ఆమెతో కూర్చుని వ్రాయడం, చదవడం, పాఠాలలో సహకరించడం వంటివి చేసేది. ఆమె తండ్రి తరచుగా ఉద్యోగరీత్యా ప్రయాణం ...

                                               

సుమలత

సుమలత అంబరీష్ తెలుగు సినిమా నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించింది. 1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి, బొంబాయి, ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగ ...

                                               

సుమలతా రెడ్డి

సుమలత జూలై 18న హైదరాబాదులో జన్మించింది. తండ్రి అనంతరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యోగిగా, తల్లి ప్రేమలత పోస్టల్ విభాగంలో ఫ్రీ లాన్సర్ ఉద్యోగిగా పనిచేశారు. ఉస్మానియా మోడల్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను చదివిన సుమలత, ఉస్మానియాలో ఎం.కాం పూర్తిచేసింది.

                                               

సురభి పాపాబాయి

1887వ సంవత్సరంలో సురభి గ్రామంలో మొదటిసారిగా సురభివారు ప్రదర్శించిన ‘కీచకవధ’ అను నాటకంలో సైరంధ్రిగా స్త్రీ పాత్రను స్త్రీయే నటించిన ఖ్యాతి గడించిన ప్రప్రథమ తెలుగు రంగస్థల నటీమణి. ఆనాడు స్త్రీ పాత్రయేగాక పురుషపాత్రలు కూడా ధరించిన మొదటి నటి పాపాబాయి ...

                                               

సురభి వాణి దేవి

సురభి వాణి దేవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, చిత్రకారిణి, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమార్తె. అనేక విద్యా సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షులు అయిన వాణి దేవి, సామాజిక కార్యకర్తగా స్వామి రామానంద తీర్థ స్మారక కమిటీ ప్రధాన కార్యదర్శి ...

                                               

సురయ్యా

సురయ్యా జమాల్ షేక్ ప్రముఖ హిందీ నటి,గాయని. ఈమె జూన్ 15, 1929 న జన్మించారు. జనవరి 31, 2004 న మరణించారు. బొంబాయిలో జె.బి.పెటిట్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం. పర్షియన్, ఖురాన్ చదివారు. మేనమామ జుహూర్ ఈమెను "తాజ్ మహల్"లో బాల నటిగా ప్రవేశపెట్టాడు. 1942 ...

                                               

సురేందర్ రెడ్డి

వీరిది కరీంనగర్ జిల్లాలోని మాచినపల్లి అనే గ్రామం. నాన్నగారు వీరారెడ్డి ఇతడి చిన్నతనంలో ఊరికి సర్పంచ్గా వుండేవారు. వీరిది సంపన్న కుటుంబమే. వీరు మొత్తం ఆరుగురం సంతానం. ఇతడు నాలుగో వాడు. ఇతడికి ఒక అక్క, ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు చెల్లెళ్ళు, దేనికీ లో ...

                                               

సురేంద్ర కృష్ణ

సురేంద్ర కృష్ణ ఒక తెలుగు సినీ పాటల రచయిత. గిల్లి కజ్జాలు అనే సినిమాతో గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈవివి సత్యనారాయణ, రవిరాజా పినిశెట్టి, కరుణాకరన్ లాంటి దర్శకులతో కలిసి పనిచేశాడు. తమ్ముడు, ఆర్య, ఎవడి గోల వాడిదే లాంటి చిత్రాల్లో ఆయన రాసిన ...

                                               

సురేఖ

సురేఖ అని చూడగానే/వినగానే మహిళ అనిపించే పేరుతో 1958 నుండి వ్యంగ్య చిత్రాలు గీస్తున్న ఇతని అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు. "సురేఖ" అన్నపేరు పెట్టుకోవటానికి వెనుక కథ, ఇతనికి మంచి గీతల మీద ఉన్న మమకారం, అప్పటికే పేరు తెచ్చుకున్న బాపు మీద గౌరవం. ...

                                               

సురేష్ (నటుడు)

ఇతని రెండవ భార్య రాజశ్రీ రచయిత్రి. ఇతను నిర్మించే చేసే టేలివిజన్ ధారావాహికలకు ఆమె రచనా సహకారం అందిస్తుంది. ఇతను 2014 దాకా మై నేమ్ ఈజ్ మంగతాయారు, మా ఇంటి మహాలక్ష్మి, రాజేశ్వరీ కల్యాణం, నాటకం. ఇలా ఏడు సీరియల్స్ నిర్మించాడు. వీరి అబ్బాయి నిఖిల్ సురే ...

                                               

సురేష్ భట్

సురేష్ భట్ మరాఠీ కవి. మరాఠీలో గజల్‌ను పరిచయం చేశాడు.అందువల్ల అతన్ని గజల్ చక్రవర్తి అని పిలుస్తారు. అతను మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించాడు.అతని తండ్రి శ్రీధర్ భట్ వృత్తిరీత్యా డాక్టర్. అతని తల్లికి కవిత్వం అంటే చాలా ఇష్టం. దాని వల్ల సురేష్ భట్ చ ...

                                               

సుర్జీత్ పతర్

సుర్జిత్ పతర్ పంజాబీ భాషకు చెందిన రచయిత, కవి. వీరి కవిత్వం సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తుంది. ప్రాంతీయతా గోడలను దాటి విశ్వజనీన సత్యాలను ఆవిష్కరిస్తుంది. వీరు ఏడు కవితా సంపుటులను వెలువరించారు. అనేక యూరోపియన్ నాటకాలను, నెరుడా కవిత్వాన్ని పంజ ...

                                               

సులగిట్టి నర్సమ్మ

ఈమె 1920లో కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూర్ జిల్లాలోని పావగడ గ్రామంలో జన్మించింది. ఈమె మాతృభాష తెలుగు. ఈమె తన 12 సంవత్సరాల వయసులో అంజినప్పను వివాహం చేసుకుంది. ఈమెకు 12 మంది సంతానం, వీరిలో నలుగురు చిన్నతనంలోనే మరణించారు. ఈమె మంత్రసాని నైపుణ్యాలను మంత ...

                                               

సులభా పాఠక్

సులభా పాఠక్ మంద్యతరగతి కుటుంబంలో జన్మించింది. సులభా పాఠక్‌కు టీచింగ్, ప్రపంచం చుట్టిరావడం అంటే చాలా ఇష్టం. మద్యతరగతి మహిళగా స్వతంత్రభారతంలో టీచర్‌ కావడం సులభమైనా ప్రపంచన్ని చుట్టిరావడం మాత్రం ఖరీదైనదే అన్నది ఆమె భావన. వాస్తవానికి టీచర్ కావాలన్నది ...

                                               

సులోచన (నటి)

సులోచన తొలి తరం హిందీ సినిమా నటి. ఈమె మొదట మూకీలలోను ఆ తర్వాత టాకీలలోను సుమారు 200 చిత్రాలలో నటించింది. ఈమె అసలు పేరు రూబీ మేయర్స్. ఈమె ఒక ఆంగ్లో ఇండియన్. "ఇండియన్ గ్రేటాగార్బో"గా ప్రసిద్ధి చెందిన ఈమె రూబీ పిక్చర్స్ పేరుతో ఒక సంస్థను నెలకొల్పి దో ...