ⓘ Free online encyclopedia. Did you know? page 267


                                               

రాగతి పండరి

రాగతి పండరి తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్టులలో, రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్ట్. అదొక్కటే ప్రత్యేకత కాదు, అనతి కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆ రంగంల ...

                                               

రాగిణి (నటి)

ఈమె 1937, మార్చి 27న కేరళ రాష్ట్రానికి చెందిన ట్రవన్కోర్ సంస్థానంలో తిరువనంతపురంలో గోపాలపిళ్లె, సరస్వతి అమ్మలకు జన్మించింది. ఈమె తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. అనేక నాటకాలలో కూడా నటించింది. ఈమె అక్కలులలిత, పద్మినిలు కూడా నర్తకుల ...

                                               

రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్ ఒక ప్రముఖ నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు. 1993 లో నృత్యదర్శకుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. తరువాత నటుడిగా అవకాశాలు వెతుక్కున్నాడు. 1998 లో మొదటి సారిగా ఓ తెలుగు సినిమాలో నటించాడు. 2001 లో లారెన్స్ ను తన పేర ...

                                               

రాచమల్లు రామచంద్రారెడ్డి

రారా గా ప్రసిద్ధుడైన రాచమల్లు రామచంద్రారెడ్డి బహుముఖప్రజ్ఞాశాలి. ఆయన తెలుగు సాహిత్యానికి తన విమర్శతో, అనువాదాలతో, పాత్రికేయ రచనలతో ఎంతో దోహదం చేశాడు. ఆయన రాసిన అనువాద సమస్యలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన మరో ప ...

                                               

రాజన్ - నాగేంద్ర

రాజన్ - నాగేంద్ర దక్షిణ భారతానికి చెందిన సంగీత దర్శకద్వయం. వీరిద్దరూ అన్నదమ్ములు. 37 సంవత్సరాల పాటు వీరు తెలుగు సినిమాలకు వీరి సంగీత సేవలను అందించారు. సుమారుగా 60 సినిమాలకు వీరు సంగీతాన్ని సమకూర్చారు. సంఖ్య పరంగా చేసినవి తక్కువ సినిమాలైనా, దాదాపు ...

                                               

రాజన్ పి. దేవ్

రాజన్ పి. దేవ్ ఒక భారతీయ సినిమా నటుడు. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి 180 చిత్రాలకు పైగా నటించాడు. ఆయన నటించిన పాత్రల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలున్నాయి. రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఆయన కాలేయ వ్యాధి కారణంగా జూలై 29, 2009 న ...

                                               

రాజశ్రీ (నటి)

ఈమె అసలు పేరు కుసుమకుమారి. ఈమె విశాఖపట్నంలో ఎం.సూర్యనారాయణరెడ్డి, లలితాదేవి దంపతులకు రెండో సంతానంగా జన్మించింది. ఈమె తండ్రి రైల్వేలో స్టేషన్ మాస్టర్‌గా పనిచేసేవాడు. ఈమె బాల్యం విజయవాడ, ఏలూరులలో గడిచింది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప ...

                                               

రాజా (నటుడు)

రాజా ఒక తెలుగు సినీ నటుడు. రాజా స్వస్థలం విశాఖపట్నం. తల్లి క్రిష్టియన్, తండ్రి హిందూ మతానికి చెందిన వారు. ఇరువైపులా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే పెళ్ళి చేసుకున్నారు. కాబట్టి వాళ్ళింటికి బంధువులు ఎవరూ వచ్చే వాళ్ళు కాదు. ఆయనకు ఇద్దరు అక్కలు. రాజా ...

                                               

రాజా చెల్లయ్య

రాజా చెల్లయ్య భారతదేశ ఆర్థికవేత్త. ఈయన మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వ్యవస్థాపకుడు. ఈయన్ని పన్ను సంస్కరణల పితామహుడు అని పిలుస్తారు.

                                               

రాజా రవివర్మ

రాజా రవి వర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతములలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు ...

                                               

రాజా వత్సవాయ సూరిబాబు రాజు

రాజా సూరిబాబు రాజు పెద్దాపురం సంస్థానాన్ని 300 సంవత్సారాలు పరిపాలించిన వత్సవాయ వంశస్థుల కోవకి చెందినవారు. ఆయన పూర్తిపేరు "శ్రీ రాజా వత్సవాయ లక్ష్మీ సూర్యనారాయణ జగపతి బహద్దరు మహారాజు".

                                               

రాజీవ్ సూరి

నోకియా ప్రధాన కార్యాలయం, ఫిన్లాండ్‌లోని ఎస్పూలో నివసించే రాజీవ్ సూరికి అంతర్జాతీయంగా 23 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన 1995లో నోకియాలో చేరారు. మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాల్లో నోకియా కార్యకలాపాలకు సంబంధించి విలీనాలు.కొనుగోళ్లు, ప్రోడక్ట్ మార్క ...

                                               

రాజు సుందరం

రాజు సుందరం సినిమా నృత్య దర్శకుడు, నటుడు. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలకు పనిచేశాడు. అతను జీన్స్, 123, ఐ లవ్ యు డా, క్విక్ గన్ మురుగన్ చిత్రాలలో నటించాడు. ఇతని తండ్రి సుందరం మాస్టారు కూడా నృత్య దర్శకుడే. ఈయన ఇద్దరు తమ్ముళ్ళు ప్రభుదేవా, నాగేంద్ర ప ...

                                               

రాజేంద్ర భరద్వాజ్

రాజేంద్ర భరద్వాజ్ సినీ మాటల రచయిత, కథారచయిత. ఇతని రచన ఆలోచనను రేకెత్తించే దృక్పథానికి, కుటుంబవిలువలకీ పెట్టింది పేరు. ఇతను 1999 లో శివరంజని తెలుగు సిని వారపత్రికలో పాత్రికేయ వృత్తిని ప్రారంబించి ఆతరువాత బైరవి సినిమా ద్వారా కధ, మాటల రచయితగా సినిమా ...

                                               

రాజేష్ కృష్ణన్

రాజేష్ కృష్ణన్ కర్ణాటక కు చెందిన నేపథ్య గాయకుడు, నటుడు. 1991 లో వచ్చిన గౌరి గణేశ అనే చిత్రంతో తన పాటల ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజేష్ కన్నడ సినిమాల్లో సుమారు 4000కి పైగా పాటలు పాడాడు. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 1000 కి పైగా పాటలు పాడాడు. అంతే ...

                                               

రాజేష్ ఖన్నా

రాజేష్ ఖన్నా హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. భారతీయ సినిమా మొదటి సూపర్ స్టార్ గా వ్యవహరింపబడే ఈయన 163 చిత్రాలలో నటించారు. 1970 నుండి తను సోలోగా నటించిన చిత్రాలు వరుసగా 15 విజయవంతం కావటంతో ఈయనకు ఈ పేరు సార్థకమైనది. ఇంతవరకూ ఈ రికార్డుని ...

                                               

రాజ్యం. కె

ఈవిడ తన ఏడవ ఏటనే పునర్జన్మ నాటకంలో పాప పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేశారు. తణుకుకు చెందిన కీ.శే. ముంగడ నాగేశ్వరరావు తొలి గురువై నటనలో ఈవిడకు ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. పి. సత్యనారాయణ రెడ్డి, ఈడేపల్లి రామారావు, మల్లాది సూర్యనారాయణ, ఎర్రంశెట్టి రామ్ ...

                                               

రాణినారెడ్డి

రాణినారెడ్డి ఒక భారతీయ నేపధ్య గాయని. ఈమె హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, కోంకణి భాషలలో, వివిధ సంగీత స్వరకర్తలైన యువన్ శంకర్ రాజా, హరీస్ జయరాజ్, దేవి శ్రీ ప్రసాద్, సాయి తమన్, సెల్వ గణేష్, రఘు దీక్షిత్, ఎస్.ఎ.రాజ్‌కుమార్ లతో పాటలు పాడారు.

                                               

రాణీ ముఖర్జీ

రాణీ ముఖర్జీ ప్రముఖ బాలీవుడ్ నటి. ఎన్నో సినిమాలకు ఫిలింఫేర్ వంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు ఆమె. ఇప్పటికి ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. భారతీయ సినీరంగంలోని ప్రము ...

                                               

రాధ (నటి)

రాధ గా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందిన ఉదయ చంద్రిక ; జ. జూన్ 3, 1966) భారతీయ సినీనటి తెలుగు, తమిళ చలనచిత్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధి చెందిన రాధ దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించింది. ఈమె అక్క అంబిక కూడా సినిమా నటే. రాధ, భారతీరాజా ...

                                               

రాధశ్రీ

రాధశ్రీ అనే కలంపేరుతో సాహిత్యలోకానికి పరిచితుడైన ఇతని అసలు పేరు దిడుగు అనంత వేంకట రాధాకృష్ణ ప్రసాద్. ఇతడు 1958, అక్టోబర్ 19వ తేదీ దుర్గాష్టమి పర్వదినాన గుంటూరు జిల్లా, పిడుగురాళ్లలో కోటయ్య, వీరమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించాడు. ఇతని బాల్యం ...

                                               

రాధా బాలకృష్ణన్

రాధా బాలకృష్ణన్ భారత దేశానికి చెందిన మహిళా భౌతిక శాస్త్రవేత్త. ఈమె 1970 లో బ్రాండీస్ లో పి.హెచ్.డి చేశారు. ఆమె ఫుల్‌బ్రైట్ అవార్డు, తమిళనాడు శాస్త్రవేత్తల అవార్డు, దర్శన్ రంగనాధన్ మెమోరియల్ లెక్చర్ అవార్డు పొందిన శాస్త్రవేత్త. ఈమె ప్రస్తుతం చెన్న ...

                                               

రాధా విశ్వనాథన్

రాధావిశ్వనాథన్ భారతీయ సంగీత విద్వాంసురాలు, శాస్త్రీయ నర్తకి. ఆమె ప్రముఖ సంగీత విద్వాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత అయిన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి కుమార్తె. ఆమె తన తల్లితో పాటు కచేరీలను చేసింది.

                                               

రాధాకుమారి

రాధాకుమారి తెలుగు సినిమా నటి. ఈమె ప్రముఖ రచయిత, సినీ నటుడు రావి కొండలరావు గారి సతీమణి. గయ్యాళితనం, సాత్వికత్వం ఇవి రెండూ కలబోసిన పాత్రల్లో నటించి మెప్పించారు. సహాయనటిగా, హాస్యనటిగా తెలుగు తెరపై తనదైన ముద్రవేసారు. ఇప్పటి వరకు ఈమె సుమారు 400కి పైగా ...

                                               

రాధిక ఆప్టే

వీరిది సినిమాలతో సంబంధం లేని కుటుంబం. వీరి నాన్న గారు చారుదత్ ఆప్టే ఒక్క పుణేలోనే కాదు. మహారాష్ట్ర అంతటా పేరున్న నరాల వైద్యుడు. అమ్మ జయశ్రీ ఆప్టే పేరున్న మత్తు మందు వైద్యనిపుణురాలు. ఈమె, ఇద్దరు తమ్ముళ్ళు - మొత్తం ముగ్గురు సంతానం. ఈవిడ లండన్‌లో నృ ...

                                               

రాధిక కుమారస్వామి

రాధిక కుమారస్వామి, భారతీయ సినిమా నటి, నిర్మాత. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి 2000లలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది.

                                               

రానా దగ్గుబాటి

దగ్గుబాటి రామానాయుడు అలియాస్ దగ్గుబాటి రానా భారతీయ బహుభాషా చలనచిత్ర నటుడు, నిర్మాత, పారిశ్రామక వేత్త. ఇతను సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు. ఆయన సినిమా తెరంగేట్రం లీడర్ అనే తెలుగు సినిమా తో కాగా తమిళం, హిందీ భాషల్లో కూడా వివిధ సినిమాల్లో న ...

                                               

రాప్తాటి ఓబిరెడ్డి

రాప్తాటి ఓబిరెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన అజ్ఞాతకవి. చిత్రకవిత్వం చెప్పడంలో దిట్ట. ఒక మారుమూల కుగ్రామంలో బడి పెట్టుకొని, పేదపిల్లలకు పాఠం చెప్తూ, తీరిక సమయంలో తోచిన విషయాలపై కవిత్వం చెప్తూ మరోప్రక్క వ్యవసాయంచేస్తూ జీవనం సాగించిన నిరాడంబర జీవి ఇ ...

                                               

రాబర్ట్ కాల్డ్వెల్

బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్ ప్రఖ్యాత భాషా శాస్త్రజ్ఞుడు. ద్రవిడభాషలను అధ్యయనము చేసిన మొదటి ఐరోపా వ్యక్తి. 1856 లో ఆయన Comparative Grammar of Dravidian Languages అన్న గ్రంథము ప్రచురించాడు. ఈ భాషలు సంస్కృతము కంటే పురాతనమైనవనీ, వేరైనవనీ ఆయన ప్రతిపాదించాడు.

                                               

రాబర్ట్‌ డౌనీ జూనియర్‌

రాబర్ట్ జాన్ డౌనీ జూనియర్ ఒక అమెరికన్ నటుడు, నిర్మాత, గాయకుడు. డౌనీ వృత్తిలో అతని చిన్న వయసులో విమర్శనాత్మక, ప్రజాదరణ పొందిన విజయాలు ఉన్నాయి, వాణిజ్యపరంగా విజయం సాధించటానికి ముందు, మాదకద్రవ్య దుర్వినియోగం, చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయి. 2008 లో, డౌ ...

                                               

రామకృష్ణ (చిత్రకారుడు)

రామకృష్ణ తెలుగులో మనకున్న మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. ఇతని పూర్తి పేరు మునగపాటి శివరామకృష్ణ. ఇతడు తెలుగులోనే కాక, ఆంగ్లంలోకూడ కార్టూన్లు వేయటం జరిగింది. చిత్రకారుడు బాపు ప్రభావంతో వ్యంగ్య చిత్రరంగానికి ఆకర్షించబడిన మరొక మంచి చిత్రకారుడితను. భ ...

                                               

రామజోగయ్య శాస్త్రి

రామజోగయ్య శాస్త్రి సినీ గీత రచయిత. ఆయన స్వస్థలం ముప్పాళ్ళ. చిన్నతనంలో గాయకుడి కావాలని కలలు కనేవాడు. ఐదారు తరగతుల్లో సినిమాల ప్రభావం మొదలైంది. ఇంటర్‌కి ఊరు దగ్గర్లో ఉన్న నర్సరావుపేట వచ్చాడు. నచ్చిన పాటలన్నీ రికార్డ్‌ చేయించుకుని విని నేర్చుకునేవాడ ...

                                               

రామదాసు

భద్రాచల రామదాసు గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థాన ...

                                               

రామదాస్ గాంధీ

రాందాస్ గాంధీ మహాత్మాగాంధీ యొక్క మూడవ కుమారుడు. ఆయన దక్షిణ ఆఫ్రికా లో జన్మించారు. ఆయన తన తల్లిదండ్రులు, సోదరుల కంటే ఎక్కువకాలం జీవించారు. ఆయన, ఆయన భార్య నిర్మలా లకు ముగ్గుకు కుమారులు;వారు సుమిత్రా గాంధీ,కానూ గాంధీ, ఉషా గాంధీ. ఆయన తన తండ్రితో పాటు ...

                                               

రామానంద్ సాగర్

రామానంద్ సాగర్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు. దూరదర్శన్‌లో ప్రసారమై విశేష జనాదరణ పొందిన ధారావాహిక "రామాయణ్"ను ఇతడు నిర్మించాడు. 78 భాగాల ఈ టెలివిజన్ ధారావాహిక భారతీయ పురాతన ఇతిహాసం రామాయణం ఆధారంగా తీయబడింది. ఈ సీరియల్‌లో రామునిగా అరుణ్ గోవిల్, సీతగ ...

                                               

రామిరెడ్డి (నటుడు)

గంగసాని రామిరెడ్డి భారతదేశపు ప్రముఖ నటుడు. ఇతడు ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి. దాదాపు అన్ని భారతీయ భాషలలో నటించాడు. తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన రామిరెడ్డి, అ చిత్రం ఘనవిజయం సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాల, ...

                                               

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా, హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తులు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. ఆయనకు ...

                                               

రామ్ పోతినేని

రామ్ నిర్మాత "స్రవంతి" రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకు. హైదరాబాదులో పుట్టినా తన విద్యాభ్యాసం తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమం, సెంట్ జాన్ పాఠశాలలో చేసాడు.

                                               

రామ్ మాధవ్

రామ్‌మాధవ్ భారతదేశ రాజకీయనాయకుడు, రచయిత, జర్నలిస్టు. అతడు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ పనిచేసిన ఇతను 2014లో బీజేపీలో చేరాడు. అనేక పుస్తకాలను రచించాడు. అతడు రాసిన ప్రస్తుత పుస్తకం "అన్‌ఈజీ నైబర్స్"50 యేం ...

                                               

రామ్‌ వెంకీ(సినీ దర్శకుడు)

ఆయన పూర్తిపేరు కంచరాన వెంకటరమణ. సరుబుజ్జిలి మండలం మతలబుపేట ఆయన స్వగ్రామం. శ్రీకాకుళంలోనే ఇంటర్‌, డిగ్రీ ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో చదువుకున్నారు. పుస్తకాల్లోని చిన్న చిన్న నాటికలను స్నేహితులతో వేయించేవారు. ఆయనదెప్పుడూ తెరవెనుక పాత్రే. జిల్లా కేంద ...

                                               

రాయంకుల శేషతల్పశాయి

శేషతల్పశాయి పొనుగుపాడు గ్రామంలో ది.10.11.1956 న రాయంకుల తాతయ్య, లీలావతి దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామం పొనుగుపాడులో ఇతని ముత్తాత రాయంకుల తాతయ్య స్థాపించిన వీధి బడిలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన ఇతని తండ్రి రాయంకుల తాతయ్య వద ...

                                               

రాయప్రోలు సుబ్రహ్మణ్యం

రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారు గొప్ప నటుడు. చిత్తూరులో శ్రీరామ విలాస సభలో చిత్తూరు వి.నాగయ్య నాటకాల్లో నటించినప్పుడు సుబ్రమణ్యంగారే దర్శకుడు. నాగయ్య గారికి నాడు గురువు. నాగయ్యగారు త్యాగయ్య నిర్మించినప్పుడు రాయప్రోలు సుబ్రహ్మణ్యం, త్యాగయ్యకు గురువైన ...

                                               

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అనంతకృష్ణశర్మ అగ్రేసరుడు. విమర్శనా రీతులలో వీరు మార్గదర్శకుడు. అన్నమాచార్యులు వారి కృతులను - కొన్ని వందల కృతులను - ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. ...

                                               

రాళ్ళబండి కవితాప్రసాద్

కవితాప్రసాద్ కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం, నెమలి గ్రామంలో 1961, మే 21వ తేదీన జన్మించాడు. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేంకటేశ్వర ప్రసాదరాజు. కవిత్వం పట్ల మోజుతో తన పేరును కవితాప్రసాద్‌గా మార్చుకున్నాడు. ఈయన తండ్రి కోటేశ్వర రాజు గారు తెలుగు ...

                                               

రావి ప్రేమలత

డా. రావి ప్రేమలత తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీవేత్త, పరిశోధకురాలు. గత మూడుదశాబ్దాలు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసి, ఉత్తమ విమర్శకురాలిగా, సాహిత్య పరిశోధకురాలిగా అనేక అవార్డులు పొందింది. 2019లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మ ...

                                               

రావికంటి వసునందన్

ఇతడు మే 4వ తేదీ 1949లో కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ గ్రామంలో కిష్టయ్య, జగ్గమ్మ దంపతులకు జన్మించాడు. ఎం.ఎ. చదివాడు. భూమిక - ఒక సమగ్ర పరిశీలనం అనే అంశంపై పరిశోధించి ఎం.ఫిల్ పట్టాను, ఆధునికాంధ్ర కవిత్వంలో మానవతావాదం - విశ్వంభర విలక్షణత అనే అంశంపై పరిశ ...

                                               

రావిచెట్టు రంగారావు

రంగారావు 1877, డిసెంబర్ 10 న నరసింహారావు, వేంకమాంబ దంపతులకు నల్లగొండ జిల్లా, దండంపల్లి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. వీరి వివాహం 13వ యేట లక్ష్మీ నరసమ్మతో జరిగింది.

                                               

రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ

రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞానగ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.

                                               

రావిపల్లి నారాయణరావు

రావిపల్లి నారాయణరావు తెలుగు కథా రచయిత. ఈయన 1932 సంవత్సరంలో ఆగష్టు 31 న విజయనగరం జిల్లా రావిపల్లి గ్రామంలో జన్మించాడు. వృత్తిరీత్యా దక్షిణ మధ్య రైల్వేలో ఆఫీస్ సూపరింటెండ్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈయన గమనించిన రైల్వే కూలీల, కార్మికుల కష్టసుఖాలకు ...

                                               

రావిశాస్త్రి

రాచకొండ విశ్వనాధశాస్త్రి వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రి గా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే. నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపుతన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకు ...