ⓘ Free online encyclopedia. Did you know? page 226
                                               

మతంగుడు

అతను తన తండ్రి ఆజ్ఞ ప్రకారం ఒక యజ్ఞానికి వెళుతున్నప్పుడు దారిలో ఒక గాడిద పిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి మతంగుడు అనవసరంగా కొట్టిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో అమ్మా! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అంద ...

                                               

మయుడు

మయుడు త్రిపుర అను మూడు ఎగిరే పట్టణములను నిర్మించి వాటికి రాజుగా ఉన్నాడు. ఈ పట్టణాలు గొప్ప ఐశ్వర్యము, బలముతో ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయి. కానీ వాటి చెడు గుణము వల్ల శివుడు వాటిని నాశనము చేసాడు. ఆ నాశనమును శివ భక్తుడైన మయుడు తప్పించుకున్ ...

                                               

మయూర ధ్వజుడు

మయూర ధ్వజుడు మణిపుర పాలకుడు,మహా పరాక్రమవంతుడు, గొప్ప దాత. మయూరధ్వజుని కుమారుడైన తామ్ర ధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధించి తనతో యుద్ధం చేసిన నకుల సహదేవ భీమార్జునుల్ని ఓడిస్తాడు. తమ్ముళ్ళు ఓడిపోయిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు ...

                                               

మహాగౌరీ దుర్గా

మహాగౌరీ దుర్గా నవదుర్గల అలంకారాల్లో ఎనిమదవ అవతారం. నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలనూ ఈ అమ్మవారు తీర్చగలదు. జీవితంలోని కష్టాలన్నిటినీ ఈ అమ్మవారి ఉ ...

                                               

మహిషాసురుడు

మహిషాసురుడు హిందూ పురాణాలలో రాక్షసుడు. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభ ఒకనాడు మహిషం దున్నపోతు తో కలిసిన మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు. మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు, దేవత ...

                                               

మాండవి

మాండవి కుశధ్వజుని కుమార్తె. శ్రీరాముని తమ్ముడు భరతుని భార్య. హిందూ ఇతిహాసం ప్రకారం రామాయణంలో, కుశధ్వజ మహారాజు, చంద్రభాగల కుమార్తె మాండవి. కుశధ్వజ మహారాజు జనక మాహారాజుకు సోదరుడు. అతని సోదరుని కుమార్తె సీత రామాయణంలో ప్రధాన పాత్ర. ఆమె శ్రీరాముని వివ ...

                                               

మాద్రి

మాద్రి మహాభారతం పురాణంలో పాండురాజు భార్య. పాండవులలో నకుల సహదేవులకు తల్లి. శాల్య సోదరి, మద్రా రాజ్యానికి చెందిన యువరాణి. మాద్రి అనే పదానికి మద్రా రాజ్యానికి యువరాణి అని అర్ధం. కుంతికి చెల్లెలు లాంటిది.

                                               

మారిష

1.మారిష ప్రచేతసుల భార్య. కండుఁడు అను ఒక మహర్షికి ప్రమ్లోచ అను అప్సరస యందు పుట్టిన కన్య. తొల్లి కండుఁడు అను ఒక ఋషి తపము చేయుచు ఉండఁగా దేవేంద్రుఁడు దానికి విఘ్నము కావించుటకయి ప్రమ్లోచ అను అప్సరసను పంపెను. దానిని చూచి ఆఋషి చిత్తచాంచల్యము చెంది అనేకస ...

                                               

మిత్రవింద

మిత్రవింద శ్రీకృష్ణుడి ఎనిమిదిభార్యలైన అష్టమహిషులలో ఆరవ భార్య, శ్రీకృష్ణుని మేనత్త రాధాదేవి కూతురు. ఈమె స్వయంవరంలో శ్రీకృష్ణునికి వరమాల వేసి వరించింది. వీరికి వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధ ...

                                               

ముచికుందుడు

ముచికుందుడు లేదా ముచుకుందుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. మాంధాత కుమారుడు. అంబరీషుడు ఇతనికి సోదరుడు అవుతాడు. ఇక్ష్వాకు వంశాన్నే సూర్యవంశం అని కూడా అంటారు. హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘు చక్రవర్తి, శ్రీరాముడు కూడా సూర్యవంశానికి చెందిన రాజులు. కాల ...

                                               

ముద్గలుడు

ముద్గలుడు ఒక రాజర్షి. అతను మొదట క్షత్రియ రాజుగా జన్మించాడు. తరువాత ధ్యానం, యోగా కారణంగా అతను బ్రహ్మత్వం పొందాడు. దీని కారణంగా అతని వారసులు తరువాత బ్రాహ్మణులుగా పిలువబడ్డారు. ముద్గల పురాణం అనే పురాణం ఉన్న ఏకైక రిషి ముద్గలుడు. ఈయన 108 ఉపనిషత్తులలో ...

                                               

మేనక

మేనక దేవతలు, దానవులు నిర్వహించిన క్షీరసాగర మథనం లో జన్మించింది. ఆమె శీఘ్ర మేధస్సు, సహజ ప్రతిభ కలిగిన ప్రపంచంలోనే అత్యంత అందమైన అప్సరసలలో ఒకతె. కానీ ఆమె కుటుంబాన్ని కోరుకుంది. ప్రాచీన భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఋషులలో ఒకరైన విశ్వామిత్రుడు, దేవతల ...

                                               

మైరావణుడు

మైరావణుడు రావణుని మేనమామ, పాతాళలంక పాలకుడు. జానపద కథలనుసరించి మైరావణుడు మహా మాయావి. మైరావణునికి ఒక చెల్లెలు ఉండేది. ఆమెకు కుమారుడు జన్మించగానే జ్యోతిష్కులు అతడు పాతాళలంకకు రాజు అవుతాడని వైభవోపేతంగా పరిపాలన సాగిస్తాడని చెప్పారు. అది విన్న మైరావణుడ ...

                                               

యముడు

యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. యముడు దక్షిణ దిశకు అధిపతి. యముని నగరమును యమపురి, నరకము అంటారు. యముని వ ...

                                               

యయాతి

వృషపర్వుడనే వాడు దానవులకు రాజు. ఆయన కుమార్తె శర్మిష్ట. శుక్రాచార్యుని కూతురు దేవయాని. శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు కనుక వీరిద్దరూ ప్రాణ మిత్రులయ్యారు. ఒక నాడు వారిరువురూ నదిలో స్నానం చేయడానికి వెళ్ళగా వాళ్ళను అనుసరించిన దేవేంద్రుడు వారి దుస్త ...

                                               

యశోద

నందుని భార్య. మహాభాగవతం ప్రకారం కృష్ణుడి పుట్టుకతో మేమమామకు ప్రాణగండం ఉంటుంది. దీంతో తన సోదరి దేవకి సంతానంపై కంసుడు కనిపెట్టుకుని ఉంటాడు. ఆమెకు మగపిల్లాడు పుడితే తనకు ప్రాణహాని ఉంటుందనే భయంతో గడుపుతుంటాడు. దేవకి వరుసగా ఎనిమిది మంది ఆడపిల్లలకు జన్ ...

                                               

యోగసిద్ధి

యోగ సిద్ధి బ్రహ్మమానసపుత్రులలో ఒక్కఁడు. ఇతని భార్య పేరు స్మృతి. ఇతనికి బృహస్పతి, ఉతథ్యుఁడు లేక సంవర్తుఁడు అను నిరువురు కొడుకులును, యోగసిద్ధి అను నొక కూఁతురును కలిగిరి. ఈయోగసిద్ధి అష్టవసువులలో ఒక్కఁడగు ప్రభాసుని వివాహము చేసికొని అతనియందు విశ్వకర్మ ...

                                               

రఘువు

రఘు అనే పదంలోని అక్షరాలలో "ర" అనాగా కాంతి, "ఘు" అనగా కదలిక. రఘు అనగా ప్రయాణిస్తున్న కాంతి అని అర్ధము. అనగా సంస్కృతమందు మిక్కిలి వేగము అని, సూర్యుడు అని అర్ధము. ఇతని పేరుమీదనే రఘు వంశము అని పేరుపొందింది. దిలీపుని కుమారుడు అజ మహారాజు. అజ మహారాజు కు ...

                                               

రాధ

రాధ లేదా రాధిక శ్రీకృష్ణుని ప్రియురాలు. కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు. భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు ఉన్నాయి.రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్నిశతాబ్ధాలుగా వర్ణిస్తూ, చిత్రీకరిస్తూనే వు ...

                                               

రుక్మి

రుక్మి విదర్భ దేశాన్ని పరిపాలించే భీష్మకుడు అనే రాజు యొక్క పెద్ద కుమారుడు. ఇతనికి రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే నలుగురు సోదరులు, రుక్మిణి అనే సోదరి ఉంది. శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవి ఒకరినొకరు ఇష్టపడతారు. రుక్మి మాత్రం తన సోదరిని శ ...

                                               

రురు మహర్షి

రురు, రురుడు లేదా రురు మహర్షి హిందూ పురాణాలలోని భృగు సంతతికి చెందిన గొప్ప ఋషి. చ్యవన మహర్షి, సుకన్య దంపతుల పుత్రుడు ప్రమతి. ప్రమతి మహాతపస్సంపన్నుడై విరాజిల్లుచుండెను. ఘృతాచి అను అప్సరస ఆతనిని వలచి ఆశ్రమమునకు వచ్చి సేవ చేయుచుండగా కొంతకాలమునకు వారి ...

                                               

లక్ష్మణుడు

ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు.కౌసల్య, సుమిత్ర, కైకేయి అయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్ ...

                                               

వికర్ణుడు

హిందూ ఇతిహాసం మహాభారతంలో, వికర్ణుడు కౌరవులలో మూడవవాడు. అతను ధృతరాష్ట్రుడు, గాంధారి ల కుమారుడు. అతను దుర్యోధనుడికి సోదరుడు. కొన్ని గ్రంథాలలో అతను కౌరవులలో మూడవ వానిగానూ, మరికొన్నింటిలో "మూడవ-బలమైన" వ్యక్తిగానూ చెప్పబడింది. అతను గాంధారి 99 మంది పిల ...

                                               

విదురుడు

కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబికని అంబాలిక ని దేవరన్యాయం ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడ ...

                                               

వినత

వినత కశ్యపుని భార్య. ధరణి, దక్షుడు ఈమె తల్లిదండ్రులు. దితి, అదితి, కద్రువ ఈమె సవతులు. అనూరుడు, గరుత్మంతుడు ఈమె సంతానం. శాప కారణంగా ఈమె కద్రువకు దాసి అవుతుంది. గరుత్మంతుడీమెను దాసీత్వంనుండి తప్పిస్తాడు.

                                               

విరాటుడు

విరాటరాజు మహాభారతం ఇతిహాసంలోని నాలుగవ భాగం విరాట పర్వము ప్రథమాశ్వాసము లోని పాత్ర. పాండవులు తమ అజ్ఞాతవాసం సమయంలో ఒక సంవత్సరం విరాటురాజు కొలువులో గడిపారు. విరాటరాజు భార్య సుదేష్ణ.వీరి కుమారుడు యువరాజు ఉత్తరుడు, యువరాణి ఉత్తర. విరాటరాజు కురుక్షేత్ర ...

                                               

విశ్వామిత్రుడు

విశ్వామిత్రుడు హిందూపురాణ గాథలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. విశ్వామిత్రుని గురించిన గాథలలో ప్రధానమైనవి: త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష ...

                                               

విష్ణుచిత్తుడు

పెరియాల్వర్ హిందూ మతంలో వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా పేరుగాంచిన దక్షిణ భారతదేశంలోని పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడు. అతనిని విష్ణుచిత్తుడు అని కూడా పిలుస్తారు. అతను హిందూ మతం వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా ఉన్నాడు. అతనిని పెరియల్వార్, లేదా పెరియా ...

                                               

వేదవతి

వేదవతి రామాయణంలో సీత పూర్వజన్మపు పతివ్రత. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. ఈమె బ్రహ్మర్షి కుశధ్వజుడు, మాలావతి దంపతుల కుమార్తె. ఈమె జన్మించినప్పుడు వేదధ్వని వినిపించెను. అందువలన ఈమెకు వేదవతి అని పేరుపెట్టిరి. ఈమెను విష్ణుమూర్తి కే యిచ్చి వివ ...

                                               

శకుని

శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు తమ భాగం ఆహారాన్ని కూడా శకునికి ఇచ్చి, తమ పగ తీర్చమని ప్రమాణం చేయించుకుంటారు. తద ...

                                               

శక్తి మహర్షి

శక్తి మహర్షి గురించి మహాభారతంలో ఒక పురాణ కథ ఉంది. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన అయోధ్య నగరాన్ని పాలిస్తున్న కల్మషపాదుడు ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళి అడవిలో చాలా జంతువులను చంపుతాడు. అలసిపోయి, ఆకలితో, దాహంతో ఉన్న కల్మషపాదుడు వసిష్ఠ మహర్షి ఆశ్రమ సమీపంలో ...

                                               

శతానంద మహర్షి

గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు దాంపత్య బ్రహ్మచర్యమును గడిపిన పిమ్మట అహల్యను ఆదరించి వలసిన కోరిక కోరుమనెను. ఆమె స్త్రీసహజమగు మాతృత్వాన్ని కాంక్షించింది. గౌతముడానందించి యోగబలమున నవయువకుడై అహల్యాకాంత నిండు యౌవనమునకు పండువెన్నెలయై సర్వలోకములందలి మ ...

                                               

శత్రుఘ్నుడు

శత్రుఘ్నుడు రామాయణంలో దశరథుని కుమారుడు, శ్రీరాముని తమ్ముడు. ఈయన తల్లి సుమిత్ర. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కవల పిల్లలు. రామాయణం ప్రకారం రాముడు విష్ణువు ఏడవ అవతారం అయితే లక్ష్మణుడు ఆదిశేషుడి అంశ. భరతుడు సుదర్శన చక్రం అంశ కాగా శత్రుఘ్నుడు శంఖం అంశ. శ్ర ...

                                               

శబరి

శబరి రామాయణంలో శ్రీరాముని భక్తురాలు. రాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచియుండి చివరికి రామ దర్శనం పొందిన ధన్యజీవి.

                                               

శల్యుడు

మహాభారతంలో శల్యుడు మాద్ర రాజ్యానికి రాజు. ఇతను మాద్రికి సోదరుడు. మాద్రి నకులుడు, సహదేవులకు తల్లి. ఆలా అతను నకులుడు, సహదేవులకు మేనమామ. పాండవులు ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు కుంతిని పెళ్ళి చేసుకొనుటకు రాజులతో పోటీప ...

                                               

శిఖండి

తన మనుమరాలైన కూతురు కూతురు అంబ విషయం తెలుసుకున్న హోత్రవాహనుడనే రాజర్షి తనను చూసేందుకు వచ్చిన పరశురాముడికి చెప్పి సహాయం చేయమని అడిగాడు. తన తపశ్శక్తితో ఒక వరమాలను చేసి "అంబా ఈ మాల ధరించిన వారి చేతిలోనే భీష్ముడి ఓటమి, తప్పదు". ఇదే నీకు చేయగల సహాయం అ ...

                                               

శ్రవణ కుమారుడు

శ్రవణ కుమారుడు హిందూ పురాణమైన రామాయణంలో ఒక ఉదాత్తమైన పాత్ర. తల్లిదండ్రుల పట్ల ఎంత అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే ఒక మహోన్నత వ్యక్తిత్వం గలవాడు. శ్రవణుడు వయసు మీరిన ఒక అంధ దంపతులకు జన్మించాడు. వారిరువురినీ పోషించిడం కోసం బాలుడైన శ్రవణ కుమారుడు ...

                                               

శ్రుతకీర్తి

శ్రుతకీర్తి కుశధ్వజుని కుమార్తె. శత్రుఘ్నుని భార్య. కుశధ్వజుడు జనకుని తమ్ముడు. రామాయణం బాలకాండలో రాముడు శివధనుస్సును భంగం చేసిన తరువాత వీర్యశుల్కయైన సీతను రామునకిచ్చి పెండ్లి చేయాలని జనకుడు నిశ్చయించి విశ్వామిత్రుని అనుమతితో దశరధునికి కబురు పెట్ట ...

                                               

శ్వేతుడు

3. శ్వేతుడు విదర్భదేశపు రాజు. తండ్రి సుదేవుఁడు. సోదరుఁడు సురథుడు. ఇతఁడు చిరకాలము రాజధర్మము తప్పక రాజ్యము చేసి వెనుక అతినిష్ఠతో తపము ఆచరించి దేవత్వమును పొందియు అన్నదానము చేయనందున ఆకలి విడువక బాధింపగా బ్రహ్మయొద్దకు పోయి తన దుఃఖమును చెప్పుకొనెను. అప ...

                                               

సాందీపుడు

సాందీపుని దగ్గర ఎంతోమంది శిష్యులు చదువుతుండగా వారిలో ఏకసంథాగ్రాహులైన బలరాముడు, శ్రీకృష్ణుడు మాత్రమే గురువు చెప్పిన విద్యలన్నీ నేర్చుకొని చదువులో ప్రావీణ్యం సంపాదించారు. చదువు పూర్తయిన తరువాత వారు సాందీపునిని గురుదక్షిణ గురించి అడుగగా, ప్రభాస గుజర ...

                                               

సాంబుడు

సాంబుడు శ్రీకృష్ణునికి జాంబవతి వలన కలిగిన మొదటి పుత్రుడు. సాంబుని గురించి మహాభాగవతంలో రెండు ముఖ్య కథలు ఉన్నాయి. ఒకటి దుర్యోధనుడు సాంబుని బంధించడం, బలరాముడు వచ్చి దుర్యోధనునితో మాట్లాడడం, దుర్యోధనుడు దానికి అంగీకరించకపోవడం. అప్పుడు బలరాముడు హస్తిన ...

                                               

సాత్యకి

సాత్యకి కి యుయూధనుడు అను పేరు కూడా ఉంది. ఇతను కృష్ణునికి చెందిన వృషణి యాదవ వంశమునకు చెందిన మహా యోధుడు. సాత్యకి కృష్ణుని భక్తుడు. ఇతను అర్జునునితో కలసి ద్రోణుని వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను అర్జునుడు మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి సాత్యక. ...

                                               

సుభద్ర

సుభద్ర పాత్ర మహాభారతములోను భాగవతములోని వస్తుంది. సుభద్ర బలరాముడికి చెల్లి. vasudevudi కి బలరాముడు జన్మించిన ముందు సంతానం. సుభద్ర అర్జునుడి భార్య. అభిమన్యుడికి తల్లి.

                                               

అమరావతి (స్వర్గం)

అమరావతి హిందూ పురాణాలలో దేవతల ముఖ్య పట్టణంగా, అనగా స్వర్గలోకంలో ఇంద్రుని రాజధాని. ఇది మేరు పర్వతం మీద ఉందని వివరించారు.ఇందు దేవతలు, అప్సరసలు, కిన్నరులు, యజ్ఞ యాగాదులు చేసిన మానవులు ఉంటారు.ఇక్కడ ఉండే వారికి ఆకలి, దప్పిక, నిద్ర, ముసలితనం, చావు ఉండవ ...

                                               

బ్రహ్మ వైవర్త పురాణం

బ్రహ్మ వైవర్త పురాణం ఓ సంస్కృత ఉద్గ్రంథం. హిందూ మతానికి చెందిన ప్రధాన పురాణం. ఇది కృష్ణుడు రాధల గురించిన వైష్ణవ గ్రంథం. ఆధునిక యుగ పురాణాలలో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. 1 వ సహస్రాబ్ది చివరలో ఈ పురాణం యొక్ఒక కూర్పు ఉనికిలో ఉన్నప్పటికీ, దాని ప్రస్త ...

                                               

యక్ష ప్రశ్నలు

మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మరాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. వ్యవహారికములో చిక్కు ప్రశ్నలను, సమాధానం కష్టతరమైన ప్రశ్నలకు పర్యాయంగా యక్ష ప్రశ్నలు అనే మాటను వాడతారు. ప ...

                                               

వైతరణీ నది

వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. పాపములు చేసిన వారు చని పోయిన పిమ్మట ఈ నదిని దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహించును. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గు ...

                                               

శౌనక మహర్షి

శౌనకుడు సకల యజ్ఞ నిర్వహణా సామర్థ్యము, వేదవేదాంగములు, నియమ నిష్టాగరిష్టుడై నేర్చుకొని తల్లిదండ్రుల అనుమతితో నిర్జన ప్రదేశము కొరకు బయలు దేరి, చివరకు నైమిశారణ్యము చేరుకొన్నాడు. ఇంక ముందుకు వెళ్ళలేక, ఇక్కడే స్థిర నివాసము ఏర్పరుచుకొని, అనేక మంది ముని ...

                                               

జ్ఞాన యోగము

జ్ఞాన యోగము, భగవద్గీతలో నాలుగవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవా ...

                                               

భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము

గమనిక భగవద్గీత ఒక్కో శ్లోకానికీ తెలుగు అనువాదం వికీసోర్స్‌లో ఉన్నది: భగవద్గీత తెలుగు అనువాదము భగవద్గీత అధ్యాయానుసారం పూర్తి పాఠము వికిసోర్స్‌లో ఉంది. అక్షరపరబ్రహ్మ యోగము, భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము ...