ⓘ Free online encyclopedia. Did you know? page 194
                                               

మా పసలపూడి కథలు

మా పసలపూడి కథలు ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన వంశీ కలం నుండి వెలువడిన అందమైన కథలు. స్వాతి వారపత్రికలో ఈ కథలు అశేష ప్రజాధరణ పొందినవి. ఈ కథలకు ప్రసిద్ధ చిత్రకారుడు బాపు వేసిన బొమ్మల ద్వారా మరింత అందం తీసుకొచ్చారు స్వాతి పత్రిక వారు. స్వాతి వారపత్రికల ...

                                               

మానవ వంశావళి

మానవ వంశావళి ఒక పరిశోధనాత్మక తెలుగు పుస్తకం. దీనిని కంచి శేషగిరిరావు రచించగా 1964 సంవత్సరంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, వాల్తేరు వారు తొలిసారిగా ముద్రించారు. ఈ పుస్తకంలో మానవుడు ఏకకణజీవుల నుండి ఎలా పరిణామం చెందినదీ విపులంగా వివరించారు. ఇది ఆంధ్ర వి ...

                                               

మానుషశాస్త్రం - ఆదిమ నివాసులు

మానుషశాస్త్రం - ఆదిమ నివాసులు మానుష శాస్త్రము గురించి తెలియజేసే ఒక ప్రత్యేకత కలిగిన తెలుగు పుస్తకం. దీనిని ఎ.ఎం. సోమసుందరం రచించారు. దీనికి ఎ.అయప్పం తొలిపలుకు రచించగా గిడుగు వెంకట సీతాపతి పంతులు పరిచయ వాక్యాలు వ్రాసారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ ...

                                               

మాల్గుడి కథలు

మాల్గుడి కథలు అనే కథాసంకలనపుస్తకం ప్రముఖ, ప్రసిద్ధ ఆంగ్లకథా రచయిత ఆర్.కె. నారాయణ్ రచించిన మాల్గుడి డేస్ అనే ఆంగ్లకథాసంకలమునకు తెలుగుసేత. తెలుగు అనువాదాన్ని డా.సి.మృణాళిని చేసారు.ఈ తెలుగు అనువాదపుస్తకము ప్రిజం బుక్సు లిమిటెడ్, బెంగళూరు వారిద్వారా ...

                                               

మిట్టూరోడి కతలు

చిత్తూరు జిల్లాలోని గ్రామీణ పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన రచయిత బాల్యం ఈ కథల్లో చిత్రీకరించారు. చిన్నతనం ఆడిన ఆటలు, తిన్న తిళ్లు, చూసిన మనుష్యుల గురించి చెబుతూనే లోతైన సార్వజనీనమైన అంశాలను ఈ కథలు స్పృశిస్తాయి. రచయిత తన ఊళ్లోని వ్యక్తులను గురించి ...

                                               

మిట్టూరోడి పుస్తకం

ఈ మిట్టూరోడి పుస్తకం అనే తెలుగుకథాసంకల ప్రసిద్ధ తెలుగు కథారచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు చే వ్రాయబడింది. ఈపుస్తకము అంతకు ముందు ప్రచురణ పొందిన కథాసంకలనాలను కలిపి ఒకే పుస్తకంగా అచ్చొత్తిన పుస్తకము. అంతకుముందే అచ్చయి అశేష తెలుగు పాఠకలోక ఆదరణపొందిన ప ...

                                               

ముఖ్యమైన ఔషధమొక్కలు-సాగుపద్ధతులు

అశోక - సరాకా అశోక గుగ్గులు - కామ్నిఫొరా వైటై సునాముఖి - కాషియా అంగుష్టిఫోలియా శతావరి - ఆస్పరాగస్ రెసిమోసస్ వాయువిడంగాలు - ఎంబెలియా రైబ్స్ మారేడు - ఎగీల్ మార్మెలోస్ పిప్పలి - పైపర్ లాంగమ్‌ సర్పగంధ - రవుల్ఫియా సర్పెంటైనా కుంకుమపువ్వు - క్రోకస్ ఇండి ...

                                               

మునిమాణిక్యం నాటికలు

మునిమాణిక్యం నరసింహారావు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన హాస్యరచయిత. మరీ ముఖ్యంగా దంపతుల నడుమ జరిగే సున్నితమైన హాస్య శృంగార ఘట్టాలను అందించడంలో ఆయన అందె వేసిన చేయి. ఇవి ఆయన రచించిన హాస్య ప్రధానమైన రేడియో నాటికలు.

                                               

మునెమ్మ

కథని ఒక పదేళ్ళ కుర్రాడు మునెమ్మకు మరిది వరస చెపుతూ ఉంటాడు. మునెమ్మ ఒక పాతికేళ్ళ పడుచు. రైతు భార్య. ఆమె భర్త జయరామిరెడ్డి తన బండికి కట్టే బొల్లి గిత్తను రక్తం కారేలా కొట్టడంతో కథ ప్రారంభమవుతుంది. అతడలా కొట్టడానికి కారణం ఏమిటంటే, గడ్డి కోస్తున్న ము ...

                                               

మైదానం (నవల)

మైదానం గుడిపాటి వెంకట చలం 1927 లో రచించిన నవల. ఈ నవల ప్రధానంగా స్త్రీ స్వేఛ్ఛ గురించి ప్రస్తావిస్తుంది. ఈ నవలను ఆ సంవత్సరం ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీకి పంపించాడు కానీ బహుమతి రాలేదు. ఈ బహుమతి విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడగలు, అడ ...

                                               

మ్యూజింగ్స్ (చలం రచన)

మ్యూజింగ్స్ అనేది ఒక ఆంగ్ల పదం. మ్యూజింగ్స్ అంటే అలోచనలో ముణిగి ఉండటం, లేదా ఒక విషయాన్ని గురించి లోతుగా అలోచిచటం. ఒకేఒక్క పదంగా ఈ అంగ్ల పదానికి అర్ధం తెలుగులో దొరకదు, అందుకనే చలం అంతటి రచయితకూడా, తను వ్రాస్తున్న తెలుగు పుస్తకానికి అంగ్ల పదం పేరుగ ...

                                               

యాజ్ఞసేని

యాజ్ఞసేని నవల ప్రముఖ ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ప్రతిభా రాయ్ రాసిన ఒడియా నవలకు తెలుగు అనువాదం. ఈ నవల మహాభారతంలోని ద్రౌపది జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఇతివృత్తంగా చేసుకుని సాగుతుంది.

                                               

యోగామృతం

యోగామృతం ప్రాచీనమైన ఆరోగ్య ప్రధానమైన యోగా గురించి తెలుగులో వెలువడిన పుస్తకం. ఇది యోగాసనములు, ప్రాణాయామం, షట్క్రియలు, ధ్యానం, యోగనిద్ర, యోగ చికిత్స ద్వారా వ్యాధి నివారణకు సంబంధించిన మార్గదర్శక గ్రంథము. దీనిని యోగశిరోమణి యోగాచార్య డా.పైళ్ళ సుదర్శన్ ...

                                               

రంగుటద్దాల కిటికీ

తెలుగు బ్లాగర్ గా "కొత్తపాళీ" కలంపేరుతో సుప్రసిద్ధులైన ఎస్.నారాయణస్వామి అమెరికాలోని డెట్రాయిట్లో ఇంజనీరుగా పనిచేస్తున్నారు. భారతదేశం నుంచి అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడేక్రమంలో తొలితరం ప్రవాసులకు ఎదురయ్యే సాంస్కృతిక సమస్యల గురించి చిత్రీకరించారు ఈ ...

                                               

రంగూన్ రౌడీ (నాటకం)

రంగూన్ రౌడీ అను పతిభక్తి వేశ్యల కోసం పురుషులు తిరిగి తమ సంసారాలు పాడుచేసుకోవడం ఇతివృత్తంగా సోమరాజు రామానుజరావు రచించిన తెలుగు నాటకం. అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ నాటకం సినిమాగా కూడా రూపొందించారు. దీని మూడవకూర్పును కురుకూరి సుబ్బారావు గారు 1935లో ప్ ...

                                               

రజనీ భావతరంగాలు

రజనీ భావతరంగాలు బాలాంత్రపు రజనీకాంతరావు అనుభవాల సమాహారం. ఇందులో మొత్తం 59 వ్యాసాలున్నాయి. వీనిలో తన వ్యక్తిగత అనుభవాలు మొదలుకుని అనేక ఇతర విషయాలపై రజనీ వ్రాసిన వ్యాసాల సంకలనం ఇది. ఇవన్నీ 2007-08 ప్రాంతాల్లో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక లలో వచ్చిన వ్యాస ...

                                               

రాజస్థాను కథావళి

రాజస్థాన్ ప్రాంతానికి చెందిన రాజపుత్ర రాజులు భారత చరిత్రలో శౌర్యానికి, పౌరుషానికి పేరొందినవారు. మొఘల్ సామ్రాజ్యంతో పోరాటాలు చేసి, కొన్నాళ్లకు సంధి ఒప్పందాలు చేసుకుని రాజపుత్రులు బ్రిటీష్ వారు దేశాన్ని విడిచిపోయే వరకూ ఉత్తర భారతదేశంలో సంస్థానాధీశు ...

                                               

రాణీ లక్ష్మీబాయి (పుస్తకం)

ఝాన్సీ లక్ష్మీబాయి మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ ...

                                               

రాధాగోపాలం కథలు

రాధాగోపాలం కథలు ప్రముఖ హాస్యరచయిత, సినీనిర్మాత, రచయిత ముళ్లపూడి వెంకట రమణ రచించారు. యువ దంపతులైన రాధ, గోపాలం పాత్రలుగా వారి సాంసారిక జీవితంలోని గిల్లికజ్జాలు, కోపతాపాలు, సరసాలు, సరదాలు కథాంశాలుగా రాసిన కథలు ఇవి.

                                               

రామాయణ విషవృక్షం

రామాయణ విషవృక్షం గ్రంథం రామాయణంపై మార్క్సిస్టు ధృక్పథంతో రంగనాయకమ్మ వ్రాసిన విమర్శనాత్మక గ్రంథం. రామాయణం భూస్వామ్య సంస్కృతికి ప్రతీక అని రచయిత్రి ఈ గ్రంథంలో నిరూపించే ప్రయత్నం చేసింది. ఈ గ్రంథం వామపక్ష, హేతువాద, మార్క్సిస్టు వర్గాలలో మంచి ఆదరణ పొ ...

                                               

రాముడికి సీత ఏమవుతుంది

రాముడికి సీత ఏమవుతుంది పుస్తకం ప్రముఖ రచయిత ఆరుద్ర వ్రాసిన పరిశోధనా రచన. ఈ పుస్తకం పరిచయంలో ఇలా ఉంది. ప్రపంచ మహాకావ్యాలలో రామాయణానిదే అగ్రతాంబూలం. "రాముడికి సీత ఏమవుతుంది" అన్న ప్రశ్న ద్వారా ఏమైనా గందరగోళం ఉత్పన్నమయితే అది ఆరుద్ర కల్పించినది మాత్ ...

                                               

రియాలిటీ చెక్

రియాలిటీ చెక్ పుస్తకం ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పూడూరి రాజిరెడ్డి రాసిన వ్యాసాల సంకలనం. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో రచయిత పర్యటించి అక్కడి అనుభవాన్ని, ఆ ప్రాంతం వ్యక్తిత్వాన్ని ఈ వ్యాసాల్లో రచించారు. కొన్ని వ్యాసాలకు భూమికగా హ ...

                                               

రెండో ప్రపంచయుద్ధమా?

రెండో ప్రపంచయుద్ధమా? అనేది రెండవ ప్రపంచయుద్ధం గురించిన వ్యాసాల సంకలనం. దీనిని ఆంధ్రకేసరి గ్రంథమాల వారు రెండు భాగాలుగా 1940లో ముద్రించారు. వీనికి బూర్గుల రంగనాథరావు, అందుగుల తిరుమలరావు, అవురుపల్లి కృష్ణారావు సంపాదకులుగా వ్యవహరించారు.

                                               

వంటలు పిండి వంటలు

వంటలు - పిండివంటలు మాలతీ చందూర్ రచించిన వంటల పుస్తకం. ఇది మొదటిసారి 1974 లో ముద్రించబడి; ఇప్పటికి 30 ముద్రణలు పూర్తిచేసుకున్న అశేష ప్రజాదరణ పొందిన రచన. మొదట మూడు భాగాలుగా; తర్వాత రెండు భాగాలుగా ప్రకటించబడింది. విడిభాగాల కంటే అన్నీ కలిపి ఒక సమగ్ర ...

                                               

వామన చరిత్రము

వామన చరిత్రము వ్యాసమహర్షి రచించిన భాగవతంలోని ఘట్టం. దశావతారాలలో ఒకడైన వామనుడి చరిత్రము ఇది. వామనుడు అదితి కి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గరనుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బల ...

                                               

విజయ విలాసము

విజయుడు అనగా అర్జనుడు. అతడి విజయగాధను తెలిపేది కనుక ఇది విజయవిలాసం అనబడినది. ఇందులో ముగ్గురు కావ్యనాయికలు, ఈ నాయకుడు అర్జునుడు కలరు. కావ్యనాయికలు, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర లు.

                                               

విదేశీ కోడలు

విదేశీ కోడలు కోసూరి ఉమాభారతి రచించిన కథా సంకలనం. దీనిని చింతలచెరువు సువర్చల ఈ సంపుటిలోని కథలు విదేశాల్లోని మనుగడల్ని ప్రదర్శించినా తమ భారతీయ పునాదుల్ని, సంప్రదాయ శిల్పాన్నీ ఎక్కడా కోల్పోలేదు. రచయిత్రి తన స్వానుభవాల్ని, తన దృష్టికి వచ్చిన వాస్తవ జ ...

                                               

వివేకానంద విజయము

సుప్రసిద్ధ హిందూ యోగి, ఆధ్యాత్మిక నాయకుడు స్వామి వివేకానంద. ఆయన ప్రభావం ఆసేతు హిమాచలమే కాక విదేశాలైన ఎన్నో ప్రాక్పశ్చిమ ప్రాంతాలపై కూడా పడింది. హిందూ మత పునరుజ్జీవనానికి, భారతీయ సంస్కృతి పునర్వికాసానికి జీవితాన్ని ధారపోసిన వివేకానందుడు రచించిన సా ...

                                               

విశ్వనట చక్రవర్తి

విశ్వనట చక్రవర్తి ఎస్. వి. రంగారావు గురించి ఎమ్. సంజయ్ కిషోర్ రాసిన పుస్తకం. తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వించదగిన మహానటుడు ఎస్. వి. రంగారావు. ఎంతో పట్టుదలతో అకుంఠిత దీక్షతో స్వయంకృషితో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి. వీరికి సంబంధించిన జీవ ...

                                               

విశ్వనాథ శారద

వైవిధ్యభరితమైన ప్రక్రియల్లో, విస్తారమైన విషయాలపై విశ్వనాథ సత్యనారాయణ సృజించిన సాహిత్యంలోని లోతుపాతులను, విశేషాలను వెలికితీస్తూ రచించిన విమర్శరచనల సంపుటి ఇది. ఈ గ్రంథానికి సుప్రసిద్ధులైన విమర్శకులు, సాహిత్యవేత్తలు పలువురు వ్యాసాలను అందించారు.

                                               

విషాదం(చలం రచన)

దేశం - ఈర్ష అన్యకాంత లడ్డంబైన భయం పత్రికలు చేసే అపచారం బాధ పుణ్యం - పాపం త్యాగం సినిమా జ్వరం ప్లాటోనిక్ లవ్ కామం కవిత్వం దీనికి? సెక్స్ కంట్రోల్ హిందూ ప్రతివతలు

                                               

వెయ్యేళ్ళ తెలుగు వెలుగు (పుస్తకం)

వెయ్యేళ్ళ తెలుగు వెలుగు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, విశాఖపట్నం 2009లో ప్రచురించిన పుస్తకం. దీనిని ఆచార్య ఎలవర్తి విశ్వనాథ రెడ్డి ప్రధాన సంపాదకులు. దీనిని రచయిత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారికి అంకితం ఇచ్చారు. ఇది తెలుగు భాషకు సంబంధించిన 15 వ్యాసాల ...

                                               

వైతాళికులు

వైతాళికులు అనేది ముద్దుకృష్ణ యొక్క కవితా సంకలనం. ఆధునిక చైతన్యాన్ని ప్రతిబింబించే కవితా సంకలనాలలో మొదటగా చెప్పుకోవాలి. కవులు ప్రపంచంలో నీతిని ప్రచ్చన్నం గా తీర్చి దిద్దే శాసనాధికారులు అన్నాడు ఆంగ్లకవి షెల్లీ. ఏ కవి రచనలోనైనా తన దేశ, కాల,పరిస్థితు ...

                                               

శంకర గ్రంథ రత్నావళి

సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు. ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. శంకరుడు సాక్షాత్ ...

                                               

శంకరదర్శనం

శంకరదర్శనం ఆదిశంకరుల జీవితం - రచనలు గురించిన తెలుగు పుస్తకం. దీనిని డా. వింజమూరి విశ్వనాధమయ్య రచించగా ఋషి ప్రచురణలు 2005 లో తొలిసారిగా ముద్రించారు. ఈ గ్రంథాన్ని రచయిత తన తల్లిగారైన కీ.శే. వింజమూరి వెంకట శేషమ్మకు అంకితమిచ్చారు.

                                               

శశిరేఖ (చలం రచన)

శశిరేఖ, ప్రఖ్యాత తెలుగు రచయిత గుడిపాటి వెంకటచలం వ్రాసిన ఒక రచన. శశిరేఖ గురించి రాస్తూ శివశింకరశాస్త్రి తన పీఠికలో-ప్రేమ శాశ్వతమా చంచలమా అని కొందరు ప్రశ్నిస్తారు. గాడానురాగం శాశ్వతము కాదని యెవరనగలరు? అయితే జీవితంలో ప్రేమ ఒకసారి కలుగుతుందా, అనేక పర ...

                                               

శాసన పద్యమంజరి

పద్యాలను కేవలం కావ్య రచన కోసమే కాక పలు విధములైన ఇతర రచనల కోసం కూడా వినియోగించేవారు. కవిత్వం కాక శాస్త్ర సాంకేతిక గ్రంథాలు, గణిత గ్రంథాలు, ఇతర గ్రంథరచనల్లోనూ ఉపయోగపడ్డాయి పద్యాలు. అలానే పద్యాలను శాసనాల్లో కూడా వినియోగించారు పూర్వ ప్రభువులు. అటువంట ...

                                               

శోధన (కథలు)

బలివాడ కాంతారావు గారు అనేక రచనలు చేసారు. ఆయన రాసిన అనేక కథల్లో చాలావరకూ ఏరి కూర్చిన రచన శోధన కథలు. తెలుగు సాహిత్యంలో ఉత్తరాంధ్ర జనజీవన విధానాన్ని చిత్రిస్తూ సాగిన కథలు ఈ శోధన కథలు.

                                               

శ్రీ అమృత తులసి

శ్రీ అమృత తులసి తులసి యొక్క గొప్పదనమును తెలియజేయు మంచి తెలుగు పుస్తకము. దీని రచయిత ప్రముఖ ఆయుర్వేద, హోమియోపతి వైద్యులు డా. టి.కె. గిరిధరన్. దీనిని 2000 సంవత్సరంలో మొదటిసారిగా ముద్రించారు. వైద్య విషయాలే కాకుండా ఆధ్యాత్మిక, ప్రాచీన గ్రంథాల నుండి సే ...

                                               

శ్రీ మహర్షి జీవిత కథామృతం

శ్రీ మహర్షి జీవిత కథామృతము బులుసు వేంకటేశ్వరులు రచించిన ప్రాచీన భారతవర్ష మహర్షుల జీవితచరిత్రలు పుస్తకం. భారతీయ సంస్కృతిలోని సకలమైన ఊహలకు, ఆశలకు, ఆశయాలకు, తత్త్వాలకు మూలమైన మహాపురుషులు మహర్షులు. తపన జెందుతూ, ప్రకృతి నడకలోని సూత్రాలను అర్థం చేసుకుం ...

                                               

శ్రీకృష్ణకవి చరిత్రము

ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, బహుగ్రంథకర్త, గ్రాంథికవాది శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్రమిది. కృష్ణమూర్తిశాస్త్రి తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి అనంతపంతుల రామలింగస్వామి ఈ గ్రంథా ...

                                               

శ్రీరమణ పేరడీలు

ప్రముఖ హాస్యరచయిత, పత్రికా సంపాదకుడు శ్రీరమణ చేసిన సాహిత్య వ్యంగ్యానుకరణ ల సంకలనం శ్రీరమణ పేరడీలు. తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన రచయితలు, కవులు, సంపాదకుల రచనలను శ్రీరమణ పేరడీలు చేశారు. మంచి సాహిత్యకారులకు అందరికీ ప్రత్యేకమైన శైలి, ఒరవడి ఉంటా ...

                                               

శ్రీరామదండు

శ్రీరామదండు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్య సమరంలో స్థాపించిన యువసేన. ఇతడు శ్రీరాముని భక్తుడు. చేసిన పనులన్నీ రామాంకితం చేసిన ధన్యజీవి. భారత స్వతంత్ర పోరాటానికి సేవాదళములను సమకూర్చు సమయమున ఆంధ్ర సాంప్రదాయకంగా శ్రీరామదండు అను సంస్థన ...

                                               

శ్రీవేంకటాచల మాహాత్మ్యము

శ్రీవేంకటాచల మాహాత్మ్యము పరవస్తు వేంకటరామానుజస్వామి వచనానువాదము చేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణ. "వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మండే నాస్తి కించన వేంకటేశ నమోదేవో న భూతో న భవిష్యతి." శౌనకాది మహర్షులు శ్రీ మహావిష్ణువు యొక్క స్వయం వ్యక్త స్థలా ...

                                               

శ్రీశ్రీ కవితాప్రస్థానం

1950లో శ్రీశ్రీ వ్రాసిన మహాప్రస్థానంని నళినీకుమార్ బందరు నుండి వెలువరించాడు. 1964 ప్రాంతాలలో మహాప్రస్థానంను చదివిన అద్దేపల్లి రామమోహనరావు శ్రీశ్రీ ప్రాచీనధోరణిని తన శైలికీ, భావస్ఫురణకీ వినియోగించిన అపూర్వమైన పద్ధతీ, సామాజిక వైరుధ్యాలను ప్రతిబింబి ...

                                               

సమగ్ర ఆంధ్ర సాహిత్యం

ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాల ద్వారా తెలుగు సాహిత్య చరిత్రని ప్రజల ముందుకు తెచ్చారు. * ఇది తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి ఒక గొప్ప ఉపయుక్త గ్రంథం. ఇలాంటి రచన చేయడం అకాడమీలు, ప్రభుత్వ సంస్థలు వంటి వనరులు గలిగిన సంస్థలు మాత్రమే పూనుకొ ...

                                               

సాక్షి వ్యాసాలు

సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడా చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి. తెలుగు మాతృభాష గల వారు కూడా అర్ధం చేసుకోవటానికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసాలన్నీ కూడా కొంత వి ...

                                               

సావిత్రీ చరిత్రము (హరికథ)

సావిత్రీ చరిత్రము 1923 అక్టోబరు 22న హరికథా పితామహునిగా పేరుగాంచిన ఆదిభట్ట నారాయణ దాసు రచించిన హరికథ. ఈ పుస్తకానికి ప్రకాశకులు కందుల గోవిందం. ఈ పుస్తకాన్ని బెజవాడ లోని వాణీ ముద్రాక్షరశాలయందు ముద్రించారు.

                                               

సినిమా ఒక ఆల్కెమీ

మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాలను పరిచయం చేసి ఎంతో అందంగా, వివరంగా విడమర్చి చెప్పే గ్రంథం ఇది. ఒక్క ఫ్రేములో ప్రపంచాన్ని చూపించే దర్శకుల నుంచి, ఆ దర్శకుడి సృజనాత్మకతలోని కీలక సన్నివేశం’ ని చ ...

                                               

సిపాయి కథలు

సిపాయి కథలు ఉమామహేశ్వరరావు రచించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం, స్వయంగా తాను ఒక సైనికునిగా బ్రిటీష్ సైన్యంలో పనిచేసిన ఉమామహేశ్వరరావు స్వీయానుభవాలు, తోటి సైనుకుల జీవితగాథలు సిపాయి కథలుగా మలిచారు.