ⓘ Free online encyclopedia. Did you know? page 175




                                               

అమ్మకడుపు చల్లగా

అమ్మకడుపు చల్లగా 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ మిత్రా, యమున నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించారు.

                                               

అల్లుడు దిద్దిన కాపురం

అల్లుడు దిద్దిన కాపురం 1991, ఆగస్టు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై యు. సూర్యనారాయణ బాబు నిర్మాణ సారథ్యంలో కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శోభన, మోహన్‌బాబు, బి.సరోజాదేవి, గొల్లపూడి మారుతీరావు, ప్రభాకర రెడ్డి తది ...

                                               

అసెంబ్లీ రౌడీ

అసెంబ్లీ రౌడీ 1991 లో బి. గోపాల్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో మోహన్ బాబు, దివ్యభారతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొంది మోహన్ బాబుకు కలెక్షిన్ కింగ్ అనే బిరుదును సాధించి పెట్టింది.

                                               

ఆగ్రహం (1991 సినిమా)

ఆగ్రహం 1991 లో విడుదలైన తెలుగు సినిమా. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.రాజశేఖర్, అమల నటించగా, కోటి సంగీతం అందించాడు. ఈ సినిమాకు కళాదర్శకుడు తొట్ట యాదు. సినిమా నృత్యాలుని ప్రభుదేవా, రాజు సుందరం నిర్వహించారు. ఈ సినిమా తమిళంలోని "ఎ ...

                                               

ఆత్మబంధం

ఆత్మబంధం 1991లో విడుదలైన తెలుగు సినిమా. హరితా ప్రొడక్షన్స్ క్రింద బూరుగపల్లి కృష్ణ నిర్మించిఅ ఈ సినిమాకు సునీల్ వర్మ దర్శకత్వం వహించాడు. సుమన్, లిజి, కోట శ్రీనివాసరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతాన్నందించాడు.

                                               

ఇంట్లో పిల్లి వీధిలో పులి

ఇంట్లో పిల్లి వీధిలో పులి 1991 లో విడుదలైన తెలుగు చిత్రం. కౌసల్య పిక్చర్స్ పతాకంపై బి.కౌసల్య నిర్మించిన ఈ సినిమాకు పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, సురేష్, యమున, అంజన ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీతాన్న ...

                                               

ఎర్ర మందారం (సినిమా)

ఈ తరం ఫిలింస్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మించిన ఈ చిత్రం అప్పటి దాకా హాస్యరస ప్రధాన పాత్రలే పోషిస్తున్న రాజేంద్రప్రసాద్ ని కొత్త కోణంలో చూపించిన సినిమా. 1991లో ఉత్తమ కథా చిత్రంగానూ, ఉత్తమ నటుడు, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ కూర్పు, ఉత్తమ ప్రతి నాయకుడ ...

                                               

ఏప్రిల్ 1 విడుదల

అబద్ధాలతోనూ, లౌక్యంతోనూ ఆనందంగా బ్రతికే దివాకరం రాజేంద్రప్రసాద్ ఒక అనాథ. రైల్వేలో డాక్టరుగా పని చేసే వసుంధర అతడిని కొడుకులా పెంచుతుంది. విజయనగరంలో పెళ్ళికి వెళ్ళిన దివాకరం భువనేశ్వరి శోభన అనే ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. రైల్వేలో బుకింగ్ క్లర్ ...

                                               

కడప రెడ్డెమ్మ

కడప రెడ్డేమ్మ 1991లో విడుదలయిన తెలుగు చలన చిత్రం. ఆర్.సి.క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ, చలపతిరావులు నిర్మించిన ఈ సినిమాకు టి.భరధ్వాజ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, శారద, రంజిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.

                                               

కొబ్బరి బొండాం

కొబ్బరి బోండాం 1991 లో కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో రాజేంద్రప్రసాద్, నిరోషా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మొదటిసారిగా కథ, చిత్రానువాదం, సంగీతం అందించిన ఎస్. వి. కృష్ణారెడ్డి తర్వాత దర్శకుడిగా మారి అనేక విజయవంతమైన ...

                                               

క్షణక్షణం

క్షణక్షణం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం. శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం. చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పుతో కొత ...

                                               

గ్యాంగ్ లీడర్

గ్యాంగ్ లీడర్, విజయ బాపినీడు దర్శకత్వంలో 1991లో మే 9న విడుదలైన తెలుగు సినిమా. చిరంజీవి, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రధారులు. చిరంజీవికి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి ఈ చిత్రం విజయం చాలా దోహదం చేసింది.

                                               

చంటి

చంటి 1991 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో నటనకు వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా, ఉత్తమ గాయకుడిగా ఎస్. పి. బాలుకు నంది పురస్కారాలు లభించాయి. ఈ సినిమాకు చిన్నతంబి అనే తమిళ సినిమ ...

                                               

చైతన్య

చైతన్య ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో 1991 లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, గౌతమి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీ తిరుమలేశ ప్రొడక్షన్స్ పతాకంపై సత్యంబాబు నిర్మించాడు. సింగీతం శ్రీనివాసరావు మాటలు రాశాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వ ...

                                               

తల్లిదండ్రులు (1991 సినిమా)

తల్లిదండ్రులు 1991 లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.వి.సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించాడు. దీనికి తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ ...

                                               

తొలిపొద్దు (సినిమా)

తొలి పొద్దు మాదాల రంగారావు నిర్మాణ సారథ్యంలో పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. ఈ సినిమా ద్వారా రేణుక అనే నటి, ప్రజా గని అనే గాయకుడు తొలిసారిగా పరిచయమయ్యారు. గ్రామీణ రైతాంగ సమస్యలను ఇతివృత్తంగా కల ఈ సినిమా 1991లో విడుదలయ్యింది.

                                               

నియంత (సినిమా)

నియంత 1991ఏప్రిల్ 26న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సి.వెంకట్ రాజు, జి. శివరాజు లు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, సితార ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎన్.ఏ.రాజ్ క ...

                                               

నిర్ణయం (సినిమా)

వంశీ krishna నాగార్జున నిజాయితీ గల రక్షక భటుడు. జైలు నుండి తప్పంచుకున్న రఘురాం మురళిమొహన్ను వెతుకుతూ హైదారాబాదు వచ్చి రఘురాం కూతురు అయిన గీత అమలతో ప్రేమలో పడి, రఘురాం అమాయకత్వం చూసి, రఘురాం పై గల case ను తిరగదొడి, శరత్ సక్సెనా తన స్నేహితుడైన శుభల ...

                                               

పందిరి మంచం (సినిమా)

పందిరిమంచం 1991 లో విడుదలైన సినిమా. దీనిని శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ పతాకంపై బలరామ్ నిర్మించగా, ఓంకార్ దర్శకత్వం వహించాడు. ఇందులో జగపతి బాబు, రాధ, భాగ్యశ్రీ నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చాడు.

                                               

పరమశివుడు (సినిమా)

పరమ శివుడు 1991 లో విడుదలైన సినిమా. కృష్ణ ఘట్టమనేని, రాధ, రామిరెడ్డి, అర్చన, రమ్య కృష్ణ, గిరిబాబు ప్రధాన పాత్రల్లో నటించగా జి. అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. కన్నడ నటుడు రమేష్ అరవింద్ రాజాగా ఓ చిన్న పాత్ర పోషించాడు. రాజ్-కోటి ఈ చిత్రానికి సంగీత ...

                                               

పరిష్కారం

పరిష్కారం 1991 లో వచ్చిన యాక్షన్ చిత్రం, నవ భారత్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై, తరణి దర్శకత్వంలో ప్రతాప రాజు నిర్మించాడు. విద్యాసాగర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాఅలో జగపతి బాబు, నాగేంద్ర బాబు, వాణి విశ్వనాథ్ నటించారు.

                                               

పీపుల్స్ ఎన్‌కౌంటర్

పీపుల్స్ ఎన్‌కౌంటర్ 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో మోహనగాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, భానుప్రియ, శ్రీకాంత్, యమున తదితరులు నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అదించాడు.

                                               

పెద్దింటల్లుడు

పెద్దింటల్లుడు 1991 లో వచ్చిన హాస్య చిత్రం. దీనిని శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర నిర్మాణ సంస్థ కింద టిఆర్ తులసి నిర్మించింది. శరత్ దర్శకత్వం వహించాడు. రాజ్-కోటి సంగీతం సమకూర్చాడు. ఇందులో సుమన్, నగ్మా, మోహన్ బాబు, వాణిశ్రీ నటించారు. ఇది 1962 లో వచ్చిన ...

                                               

పెళ్ళి పుస్తకం

పెళ్ళి పుస్తకం 1991 లో విడుదలయిన ఒక తెలుగు చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు బాపు ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే ఒక మనోరంజకమైన సకుటుంబ కథా చిత్రం.

                                               

భార్గవ్

భార్గవ్ 1981లో విడుదలైన తెలుగు సినిమా. రేస్వా సిరీస్ పతాకంపై డి.ఎస్.నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ఆర్.ఎస్.రామరాజు దర్శకత్వం వహించాడు. సుమన్, బిందియా ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.

                                               

మట్టి మనుషులు

ప్రముఖ దర్శకుడు బి.నర్సింగ్‌రావు దర్శకత్వం వహించిన మట్టిమనుషులు చిత్రం తెంగాణ గ్రామీణ వలస కార్మికుల జీవితాలకు అద్దం పట్టేదిగా నిలిచింది. కె.ముఖర్జీ, మణికొండ వేదకుమార్‌ నిర్మాణసారథ్యంలో రూపొందిన ఈ చిత్రం నాటి సామాజిక విలువలను చాటేదిగా ఉంది. అర్చన, ...

                                               

మామగారు (1991 సినిమా)

మామగారు పేరున మరిన్ని వ్యాసములు ఉన్నాయి. మామగారు పేరున బంధు సూచక వ్యాసము కొరకు చూడండి. మామగారు మామగారు 1991 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమున ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నాన ...

                                               

లేడీస్ స్పెషల్

లేడీస్ స్పెషల్ నటనాల మూవీస్ పతాకంపై జంధ్యాల రచన-దర్శకత్వంలో, సురేష్, వాణీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన 1991 నాటి తెలుగు చలనచిత్రం. సూపర్ నీడ్స్ అనే సూపర్ మార్కెట్లో నలుగురు సేల్స్ గర్ల్స్ తమ ఉద్యోగాలు ఊడిపోకుండా ఉండేందుకు మేనేజర్ని సైతం దాచ ...

                                               

విచిత్రప్రేమ

విచిత్ర ప్రేమ 1991 లో వచ్చిన హాస్య చిత్రం. శ్రీ లక్ష్మి నారాయణ ఎంటర్ప్రైజెస్ పతాకంపై జంధ్యాల దర్శకత్వంలో A. సూర్యనారాయణ నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, అమృత ప్రధాన పాత్రల్లో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు.

                                               

విధాత

విధాత 1991 లో విడుదలైన తెలుగు సినిమా. భాను పిక్చర్స్ బ్యానర్ కింద పెనుమత్స గాంధీరాజు నిర్మించిన ఈ సినిమాకు జ్యోతి కుమార్ దర్శకత్వం వహిస్తుంది. కృష్ణంరాజు, శివాజీరాజా,కిన్నెర ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు శ్యాం సంగీతాన్నందించాడు.

                                               

వియ్యాలవారి విందు

వియ్యాల వారి విందు 1991 అక్టోబరు 18న విడుదలైన తెలుగు చిత్రం. శాలివాహనా మూవీస్ బ్యానర్ పై బెజ్జా దామోదర్ నిర్మించిన ఈ సినిమాకు పామర్తి గోవిందరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, గాయత్రి ప్రధాన తారాగణంగా నటించగా జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.

                                               

శాంతి-క్రాంతి

శాంతి క్రాంతి 1991 లో క్రైమ్ చిత్రం. వి. రవిచంద్రన్ తన ఈశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగార్జున, వి.రవిచంద్రన్, జూహి చావ్లా, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు.హంసలేఖ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగు, ...

                                               

సూర్య ఐ.పి.ఎస్

సూర్య ఐ. పి. ఎస్ 1991లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తిక్కవరపు సుబ్బరామిరెడ్డి మహేశ్వరి పరమేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించాడు.

                                               

స్టూవర్టుపురం పోలీసుస్టేషన్

స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ 1991 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం. యండమూరి వీరేంద్రనాథ్ రచన, దర్శకత్వం వహించాడు. చిరంజీవి, విజయశాంతి, నిరోషా ప్రధాన పాత్రల్లో నటించారు. కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ ప్రధాన విలన్‌గా నటించాడు.

                                               

స్వతంత్ర భారతం

స్వతంత్ర భారతం 1991లో విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ కింద విడుదలైన ఈ సినిమాకు ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆర్.నారాయణమూరెతి, గుమ్మడి, రాళ్లపల్లి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్న ...

                                               

420 (సినిమా)

420, 1992 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకుడు. 1992 లో ఆ ఒక్కటి అడక్కు లాంటి సంచలన విజయం నమోదు చేసిన ఈ.వీ.వీ అదే ఏడాదిలో ఈ చిత్రాన్ని విడుదల చేశాడు. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో లాగే ఈ సినిమా టైటిల్స్ కూడా విభిన్నంగా ఉ ...

                                               

అక్క మొగుడు

గంగ సుహాసిని ఐదుగురు సోదరీమణులలో పెద్దది అక్క. వారి తండ్రి కోట శ్రీనివాసరావు త్రాగుబోతు. కొన్ని ప్రయోజనాల కోసం వారిని విడిచిపెట్టాడు. కాబట్టి, చెల్లెళ్లను తీసుకువచ్చి గంగ వారి దివంగత తల్లి పాత్రను పోషించి, పూర్తి బాధ్యతను తీసుకుంటుంది. ఆమె తన ఐదు ...

                                               

అగ్రిమెంట్

అగ్రిమెంట్ 1992లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు జి.మట్టయ్య నిర్మాత కాగా మణివణ్ణన్ దర్శకత్వం వహించాడు. నాగేంద్రబాబు, అనూష ప్రధాన తారాగణంగా నిర్మించబడ్డ ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్నందించాడు.

                                               

అత్తసొమ్ము అల్లుడుదానం

అత్తసొమ్ము అల్లుడు దానం 1992లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాబా సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, రోజా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతాన్నందించారు.

                                               

అలెగ్జాండర్ (1992 సినిమా)

అలెగ్జాండర్ 1992లో విడుదలైన తెలుగు చిత్రం. వరుణ్ మూవీస్ పతాకంపై కె.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు కె.రంగారావు దర్శకత్వం వహించాడు. సుమన్, వాణీ విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతాన్నందించాడు.

                                               

అల్లరి మొగుడు

అల్లరి మొగుడు 1992 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఇది తమిళంలో రజనీకాంత్, మీనా, రోజా ప్రధాన పాత్రల్లో వచ్చిన వీర చిత్రానికి పునర్నిర్మాణం. దీనినే కన్నడ, హిందీలోకి కూడా ...

                                               

అల్లరిపిల్ల

అల్లరి పిల్ల, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 1992 నాటి తెలుగు సినిమా. చిత్రానువాదం గణేష్ పాత్రో రాశాడు. ఇది 1991 లో అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రం కిళుక్కుం కు రీమేక్. ఆ సినిమాను హిందీలో కూడా ముస్కురాహట్ పేరుతో పునర్నిర్మించారు. తన తండ్రిని ...

                                               

అశ్వమేధం (1992 సినిమా)

అశ్వమేధం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992 లో విడుదలైన చిత్రం. ఇందులో శోభన్ బాబు, బాలకృష్ణ, మీనా, నగ్మా, అమ్రిష్ పురి ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రానికి సత్యా ...

                                               

ఆ ఒక్కటీ అడక్కు

ఆ ఒక్కటీ అడక్కు 1993లో ఇ. వి. వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హాస్య చిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రంభ ప్రధాన పాత్రలు పోషించారు. ఇతర ముఖ్య పాత్రల్లో రావు గోపాలరావు, నిర్మలమ్మ, బ్రహ్మానందం తదితరులు నటించారు. దీనిని "మిస్టర్ అండ్ మిసెస్ ఖిలాడీ" ...

                                               

ఎంకన్నబాబు

ఎంకన్నబాబు 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం. తారక ప్రభు ఫిలింస్ పతాకంపై ఈసినిమాను దాసరి నారాయణరావు నిర్మించి, దర్శకత్వం వహించాడు. దాసరి నారాయణరావు, సుజాత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రాజశ్రీ సంగీతాన్నందించాడు.

                                               

ఏంటిబావా మరీనూ

ఏంటిబావా మరీనూ 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్, సింధుజ నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు. సుచిత్రా క్రియేషన్స్ పతాకంపై సంగం వెంకటేశ్వరరావు, జి.చంద్రన్ రాజా ఈ సినిమాను నిర్మించారు.

                                               

కలెక్టర్ గారి అల్లుడు

కలెక్టర్ గారి అల్లుడు 1992లో విడుదలైన తెలుగు సినిమా. బాలాజీ మువీ క్రియేషన్స్ పతాకంపై బాలాజీ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. సుమన్, వాణిశ్రీ, వాణీ విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతాన్నందించారు.

                                               

కాలేజీ బుల్లోడు

కాలేజీ బుల్లోడు 1992 లో విడుదలైన కామెడీ చిత్రం, దీనిని శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ కింద పి. బలరామ్ నిర్మించాడు. శరత్ దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, రాధిక, హరీష్ నటుంచారు. రాజ్-కోటి సంగీతం అందించారు.

                                               

గౌరమ్మ

గౌరమ్మ 1992 లో విడుదలైన తెలుగు సినిమా. వాణి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై వజ్జా శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు రామనారాయణ దర్శకత్వం వహించాడు. నిళల్‌గల్ రవి, యమున, మాస్టర్ తరుణ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

                                               

చక్రవ్యూహం (సినిమా)

చక్రవ్యూహం సుమన్, గౌతమి, అర్చన నటించిన 1992 నాటి సస్పెన్స్ చిత్రం. బాలూ మహేంద్ర దర్శకత్వం వహించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రం 1992 సంవత్సరంలో విడుదలైంది.