ⓘ Free online encyclopedia. Did you know? page 108
                                               

ఆంధ్రభూమి

మద్రాసు నుండి 1932 సంవత్సరంలో ప్రారంభించబడి ఏడు ముద్రణా కేంద్రాలకు విస్తరించిన తెలుగు దినపత్రిక ఆంధ్రభూమి. దీనికి ఆండ్ర శేషగిరిరావు సంపాదకులు. యాజమాన్యం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది.

                                               

ఆగ్ఫా ఫోటో

ఆగ్ఫా ఫోటో ఐరోపా ఖండానికి చెందిన ఒక ఫోటోగ్రఫీ సంస్థ. ఆగ్ఫా-గేవర్ట్ తమ కన్జ్యూమర్ ఇమేజింగ్ డివిజన్ ను 2004 విక్రయించిన నేపథ్యంలో ఈ సంస్థ ఏర్పడింది. దీని మాతృసంస్థ అయిన ఆగ్ఫా ఫిలిం, ఫోటోగ్రఫిక్ కాగితం, కెమెరాలను విక్రయిస్తుండగా 1964 లో మరొక ఫిలిం త ...

                                               

ఆచంట రుక్మిణమ్మ

ఆనాడు దేశంలో సుప్రసిద్ధులైన ఆయుర్వేద వైద్యులు ఎందరో ఉండేవారు. అటువంటి ఘన వైద్యులు శ్రీ ఆచంట లక్ష్మీపతి గారు. ఈయన సతీమణి శ్రీమతి ఆచంట రుక్మిణమ్మగారు. ఆమె జమీందారీ కుటుంబం నుంచి వచ్చింది. ఆనాడు ఆ కుటుంబాలలో ఆచారాలు ఎక్కువ. స్త్రీల చదువుకు ప్రోత్సాహ ...

                                               

ఆచార్య తిరుమల

ఆచార్య తిరుమల ప్రముఖ కవి. ఇతడు 1945లో రాజమండ్రిలో జన్మించాడు. పెంటపాడు, ఏలూరు, విశాఖపట్నం లలో చదువుకున్నాడు. హైదరాబాదులో ఒక ప్రైవేటు కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. వచన, పద్య, గేయకవిత్వాలు, నాటకము, విమర్శ, కథానిక ప్రక్రియలలో పాతికకు పైగా గ ...

                                               

ఆజాదీ కా అమృత్ మహోత్సవం

భారతదేశానికి స్వాతంత్రం ల‌భించి 75 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఎర్పాటు చేస్తున్న కార్యకమం పేరు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఇది భారత స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 2022 కు 75 వారాల ముందు ప్రారంభమవుతుంది. 2023 స్వాతంత్ర్య దినోత్స ...

                                               

ఆర్నాల్డ్, రిచ్టర్ సినీ టెక్నిక్

ఆర్నాల్డ్, రిచ్టర్ సినీ టెక్నిక్ కంపెనీగా పిలవబడే ఈ జర్మనీ సంస్థ సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఉత్పత్తులు మూవీ కెమెరాలు, లైట్స్, స్కాన్నేర్స్, ప్రోజేక్టర్లని తయారుచేస్తుంది.

                                               

ఆవాలు

ఆవాలు ముఖ్యమైన మసాలా దినుసులలో ఒకటి. Brassica spp. పోపు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, కాల్సియం, మాగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉంటాయి. ఘాటైన వాసనను కలిగి ఉండే ఆ ...

                                               

ఆస్కార్ వైల్డ్

ఆస్కార్ వైల్డ్ ఐర్లండుకు చెందిన ఒక నాటక రచయిత, నవలా రచయిత, కవి, కథా రచయిత. ఆయన రచనల్లోని చతురత పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. లండన్ ను విక్టోరియా రాణి పరిపాలించే కాలంలో ఆయన ప్రముఖ రచయితల్లో ఒకడిగానే కాక ఆయన సమకాలికుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంప ...

                                               

ఇమ్మాన్యూయెల్‌ చార్పెంటీర్‌

ఎమ్మాన్యుయేల్ మేరీ చార్పెంటైర్ మైక్రోబయాలజీ, జెనెటిక్స్,బయోకెమిస్ట్రీలో ఫ్రెంచ్ ప్రొఫెసర్,పరిశోధకురాలు. 2015 నుంచి జర్మనీలోని బెర్లిన్ లో మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇన్ ఫెక్షన్ బయాలజీలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. 2018లో ఆమె ఒక స్వతంత్ర ప ...

                                               

ఇల్వలుడు

ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు సోదరులు, రాక్షసులు. వీరి వృత్తాంతం రామాయణంలోని అరణ్యకాండలో చెప్పబడింది. శ్రీ రాముడు అరణ్యవాసం చేస్తూ సుతీష్ణుడు అనే ఋషి సాయంతో అగస్త్య మహర్షి ఉండే ఆశ్రమం జాడ కనుగొంటాడు. సీతారామ లక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని వెదుక్క ...

                                               

ఉగ్ర శ్రీనివాసుడు

ఉగ్ర శ్రీనివాసుడు స్వామి వారి ఆగ్రహదశను సూచిస్తుంది. మూలబేరం తరువాత ప్రాచీనకాలానికి చెందిన తొలి విగ్రహం ఇదియే అయి ఉంటుంది. ఈ విగ్రహాన్నే స్నపన బేరం అని కూడా అంటారు. ఈ విగ్రహం దాదాపు 18 అంగుళాల ఎత్తు కలిగి రమారమి 7 అంగుళాల ఎత్తు పీఠం మీద నిలువబడి ...

                                               

ఉత్తర కుమారుడు

ఉత్తరుడు విరాటరాజు, సుధేష్ణ కుమారుడు. ఉత్తర ఇతని సహోదరి. పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేసారు. ఒకసారి పాండవుల అజ్ఞాతవాసం భంగము చేయుటకు ధుర్యోధనాది కౌరవులు విరాట రాజ్యముపై ఇరువైపులా దండెత్తారు. అందరు వీరులు ఒకవైపు దండెత్తిన కౌరవ సైన్యాన ...

                                               

ఉభయచరము

ఉభయచరాలు జలచర జీవనం నుంచి భూచర జీవనానికి నాంది పలికిన మొట్ట మొదటి జీవులు. భూచర జీవనానికి పూర్తిగా అనుకూలత సాధించడంలో విఫలమయి భూమికి నీటికి మధ్య జీవిస్తాయి. అందువల్ల ఉభయచరాలు పేరు ద్వంద్వ జీవితాన్ని సూచిస్తుంది. ఇవి చేపల నుంచి డిపోనియన్ కాలంలో ఏర్ ...

                                               

ఉర్దూ అకాడమీ

ఉర్దూ అకాడమి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగుతో పాటు రెండవభాష అయిన ఉర్దూ భాష పరిరక్షణకు 1976లో ఉర్దూ అకాడమిని స్థాపించింది. ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల అటానమస్ సంస్థ. ఉర్దూ భాషాభివృద్ధి, పరిరక్షణ దీని బాధ్యతలు. తన కార్యకలాపాలను విస్తరింపజేసేందుకు ...

                                               

ఉస్మానియా వైద్య కళాశాల

ఉస్మానియా వైద్య కళాశాల భారతదేశంలోని తెలంగాణలో హైదరాబాద్ లోని ఒక వైద్య కళాశాల. ఉస్మానియా మెడికల్ కాలేజ్ గతంలో హైదరాబాద్ మెడికల్ స్కూల్ అని పిలువబడేది. ఇది భారతదేశంలోని అగ్రశ్రేణి వైద్య కళాశాలలలో ఒకటి, దీనిని 1846 లో హైదరాబాద్ 7 వ నిజాం, బెరార్ - మ ...

                                               

ఊసరవెల్లి

ఊసర వెల్లి యొక్క సహజ గుణం రంగులు మార్చడం, ఇది ఏదైన చెట్టుమీద కాని వస్తువు మీద కాని వెళ్ళి దాని రంగులొకి మారిపొయి రక్షణ పొందుతూ వేటాడుతుంది. ఇంకొక విశేషం ఏమిటంటే దీని నాలుక సహజంగా కన్నా పొడుగు ఉంటుంది, దీని ద్వారా దూరంనుంచే క్రిమి, కీటకాలను వేటాడు ...

                                               

ఋష్యశృంగుడు

ఋష్యశృంగ మహర్షి గురించి రామాయణము లోని బాల కాండములో వివరించబడింది. దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు.దశరథమహారాజు అశ్వమేథ యాగము, పుత్రకామేష్టి యాగము చేస్తాడని సనత్కుమారుడు ఋషులకు చెప్పుచుండగా తాను విన్నట్లు సుమంతుడు ...

                                               

ఎంకి పాటలు

ఎంకి పాటలు లేదా యెంకి పాటలు నండూరి వెంకట సుబ్బారావు రచించిన గేయ సంపుటి. తెలుగు సాహిత్యంలో ప్రణయ భావుకతకూ, పదాల పొందికకూ క్రొత్త అందాలు సమకూర్చిన ఈ రచనను "ఎంకిపాటల గాలి దుమారము" అని తెలుగు సాహితీకారులు పలు సందర్భాలలో ప్రస్తావించారు. ఎంకిపాటలలో సుబ ...

                                               

ఎద్దుల బండి

మనుష్యులను కాని వస్తువులను కాని ఒక చోటి నుండి మరొక చోటికి చేరవేయడానికి పల్లెల్లో ఉపయోగించే ఎద్దులు లాగే వాహనం. భారతీయ రైతుల దైనందిన జీవితంలో ప్రధాన భాగమైన ఈ వాహనాన్ని ఇప్పటికీ ధాన్యాన్ని ఇంటికి చేర్చడం, ఇంటి నుంచి పొలాలకు సరుకులను మోయడం వంటి అవసర ...

                                               

ఎన్నికలు

ఒక వ్యక్తిని నాయకునిగా ఎన్నుకోవటానికి ఎన్నికలు నిర్వహిస్తారు. సాధారణంగా ప్రజా ప్రతినిధిని ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాం. దీనిని ఏ రంగంలోనైన నాయకుడిని ఎన్నుకోనుటకు ఉపయోగించవచ్చు. ఎన్నికలలో నాయకులు కావాలనుకుంటున్న వ్యక్తులు పోటీ చేస్తారు. కానీ కొన్నిస ...

                                               

ఎస్.ఎ.కె.దుర్గ

డాక్టర్ ఎస్.ఎ.కుమారి దుర్గ, భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, సంగీత శాస్త్రవేత్త. ఆమె చెన్నైలో ఎత్నోమ్యూజికాలజీ సెంటర్ వ్యవస్థాపకురాలు.

                                               

ఐఎన్‌జి వైశ్యా బ్యాంకు

ఐఎన్‌జి వైశ్యా బ్యాంకు ఒక భారతీయ బ్యాంకు. ఇది ఇంతకు ముందు వైశ్యా బ్యాంకు గా ఉండేది. వైశ్యా బాంకుగా ఉన్నప్పుడు ప్రైవైటు యాజమాన్యంలో ఉన్న బాంకులలో చాలా చురుకుగా పని చేస్తున్న బాంకుగా పేరు తెచ్చుకున్నది. కొన్ని ఆర్థిక కారణాల వల్ల, వైశ్యా బాంకు, నెదర ...

                                               

ఒడ్డెవారు

ఒడ్డె వారంటే గ్రామాల్లో చెరువుల్నీ, నూతుల్నీ, కాలువల్నీ త్రవ్వేవారు. ఎక్కడ ఆ పనులుంటే అక్కడకు వెళుతూ సంచారము చేస్తారు. కష్టజీవులు, పనిలో నిమగ్న మైనప్పుడు కష్టాన్ని మరిచి పోవడానికి పదాలు పాడుతూ వుంటారు. వాటినే వడ్డె వుప్పర పదా లంటారు. వడ్డే వారికే ...

                                               

ఓబులేసుకోన

తాడిపత్రి మండలం ఆవుల తిప్పాయపల్లె గ్రామ సమీపమున ఓబులేశుని కోన వెలయుటకు కారణభూతమైన చరిత్ర వివరము 1470వ సంవత్సరమునకు పూర్వము అప్పుడు ఆ రోజులలో కాలినడకన అహోబిల క్షేత్రమునకు ఈ మార్గములో ప్రయాణము సాగించెడివారు. ఒకరోజున భక్తజన సమూహము కోలాహలముగా భజనలు చ ...

                                               

ఓషో

రజినీష్ చంద్రమోహన్ జైన్. 1960లలో ఆచార్య రజినీష్‌ గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్‌ గా ఆ తరువాత ఓషో గా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్‌మెంట్ అనే ఒక వివాదాస్ప ...

                                               

కంప్యూటర్ ఆధారిత రూపకల్పన

కంప్యూటర్ ఆధారిత రూపకల్పన ను ఆంగ్లంలో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అంటారు, దీని సంక్షిప్త రూపం కాడ్. గతంలో ఇంజనీరింగ్ రంగంలో ప్లానులు వేయవలసినపుడు రోజుల తరబడి పట్టేది. ఒకసారి తయారు చేయబడిన డిజైనులకు మార్పులు చేయటం కష్టంగా వుండేది. డిజైనింగ్ రంగంలో ...

                                               

కంసుడు

కంసుడు భాగవత పురాణంలోని ఒక పాత్ర. ఉగ్రసేనుడు అనె యాదవ రాజుకు కొడుకు. మధురాపురమునకు రాజు. శ్రీకృష్ణుని మేనమామ. ఇతడు పూర్వజన్మమునందు కాలనేమి అను రాక్షసుడు. కనుక ఈ జన్మమందును ఆవాసనతప్పక దేవతలకు విరోధియై అనేకులను రాక్షసులను తోడుచేసికొని సాధువులను బాధ ...

                                               

కనప

కనప అనునది ఒక అందమైన చెట్టు పేరు. ఈ కనపచెట్టు 4 నుంచి 8 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొన్ని ప్రదేశాలలో 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం Barringtonia racemosa. దీనిని సముద్రపండు అని కూడా అంటారు. ఆకులు ప్రత్యామ్నాయంగా ఉంటాయి కొమ్మల చివ ...

                                               

కప్ప

కప్ప లేదా మండూకం శాలూకము అనూర, క్రమానికి చెందిన ఉభయచరాలు. కప్ప లేదా మండూకం శాలూకము ఆంగ్లం: frog అనూర, క్రమానికి చెందిన ఉభయచరాలు. కప్పల ముఖ్యమైన లక్షణాలు- పొడవైన వెనుక కాళ్ళు, పొట్టి శరీరం, అతుక్కున్న కాలివేళ్ళు, పెద్దవైన కనుగుడ్లు, తోక లేకపోవడం. ...

                                               

కర్నూలు కడప కాలువ

కే సి కెనాల్ లేదా కే సి కాలువగా వ్యవహరించబడే కర్నూలు కడప కాలువ రాయలసీమ లోని ఒక ప్రధాన పంట కాలువ. ఇది ఆంగ్లేయుల కాలములో 1950లో నిర్మితమైనది. కర్నూలు, కడప జిల్లాల గుండా సాగుతూ వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న కాలువ. సాగునీటి కే కాకుండా తాగునీటి ...

                                               

కవలలు

ఒకే తల్లికి ఒకసారి పుట్టిన లేదా ఒకే గర్భ నుంచి జన్మించిన ఇద్దరు పిల్లలను కవలలు అంటారు. వాళ్ళు ఏ లింగానికైనా చెంది ఉండవచ్చు. వారు ఒకే పోలికలతో ఉంటే మోనోజైగోటిక్, వేర్వేరు పోలికలతో డైజీగోటిక్ అని వ్యవహరిస్తారు.

                                               

కాఫీ బోర్డు అఫ్ ఇండియా

భారతదేశంలో కాఫీ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడుతున్న సంస్థ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ప్రధాన కార్యాలయం బెంగుళూరు లో ఉంది.

                                               

కాలాశోకుడు

కాలాశోకుడు శిశునాగ వంశాన్ని స్థాపించిన శిశునాగుని కుమారుడు, ఈ వంశానికి చెందిన చివరిరాజు. హిందూ పురాణాలలో ఈయనను కాకవర్ణ గా అభివర్ణించాయి. కానీ బౌద్ధ గ్రంథాలలో కాలాశోకునిగా ఉల్లేఖించబడినాడు. మౌర్య చక్రవర్తి అశోకునితో వేర్చరచడానికి బౌద్ధ గ్రంథాలలో ఈ ...

                                               

కాలీఫ్లవరు

కాలీఫ్లవరు ని తెలుగులో కోస పువ్వు లేదా క్యాబేజి పువ్వు అని అంటారు అనీ, మట్టకోసు అనీ అంటారు. కాలీఫ్లవరు, బ్రొక్కొలి రెండూ బ్రాసికేసి కుటుంబం మొక్కల నుండి లభించే కూరగాయలు; కాలీఫ్లవరు పువ్వులు తెల్లగా ఉంటాయి, బ్రాకలీ పువ్వులు ఆకుపచ్చగా ఉంటాయి. కాలీఫ ...

                                               

కావడి

కావడి లేదా కావిడి బరువుల్ని మోయడానికి ఉపయోగించే సాధనం. దీనిలో పొడవైన కట్టెకి రెండు వైపులా బరువైన వస్తువుల్ని ఉంచడానికి ఉట్టి లాంటివి వేలాడుతూ ఉంటాయి. మోయాల్సిన నీటి బిందెలు మొదలైన వస్తువుల్ని రెండు ఉట్టెలలో ఉంచి బాలన్సింగ్ చేసుకుంటూ భుజం మీద పెట్ ...

                                               

కిమేర

కిమేర లైకాౢ దేశ౦ లో అనటోలియలో ఉంటుంది.ఇది నిప్పుని విడుదల చేసే ఆడ మృగం.దాని తల్లి, తంఁడులు "త్య్ఫఓన్,ఎచిడ్న".కిమేరని కారోయొ అనే దేశపు రాజు, "అమిసోడారుస్" పైకి తెచారు.దీనికి మూడుు తలలు ఉంటాయి.దాని నుదురు సింహం లా ఉందగా దాని మద్యమ భాగం మేక లా ఉందగా ...

                                               

కుక్కర్

కుక్కర్ అన్నం, కూరగాయలు, పప్పులు ఉడికించి వండే వంటింటి పరికరం. మామూలుగా పొయ్యి మీద నేరుగా చేసేదాని కంటే దీనితో వంట త్వరగా పూర్తవుతుంది. నీటి ఆవిరి యొక్క వత్తిడి తో పనిచేసే కుక్కర్ ను ప్రెషర్ కుక్కర్ అంటారు. ఒక్క అన్నం ఉడికించడానికి మాత్రమే ఉపయోగి ...

                                               

కుచేలుడు

కుచేలుడు శ్రీకృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుదాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కంధములో వస్తుంది. కుచేలుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీకృష్ణుడు సాందీపని వద్ద విద్యాభ్యాసము చేసేటపుడు కుచేలుడు శ్రీకృష్ణుడికి సహాధ్యాయి. ...

                                               

కృపాచార్యుడు

కృపాచార్యుడు శతానంద మహర్షి మనుమడు. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువు. మహాభారత యుద్ధమందు కౌరవుల తరపున యుద్ధం చేసాడు. యుద్ధం ముగిసిన తరువాత బ్రతికిఉన్న వారిలో ఇతడు ఒకడు. సప్త చిరంజీవులలో ఒకడు. యుద్ధం తరువాత అర్జునుడి మనుమడైన పరీక్షిత్తుకు ఆచార్ ...

                                               

కృష్ణా జలవివాదాల న్యాయస్థానం

కృష్ణా జలాల పంపకంపై మూడు పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించి, లభ్యమయ్యే నీటిని పంపకం చేసేందుకు ఉద్దేశించినది, బచావత్ ట్రిబ్యునల్. జస్టిస్ ఆర్.ఎస్.బచావత్ అధ్యక్షుడిగా ఏర్పడింది కాబట్టి దీన్న ...

                                               

కె. విజయ భాస్కర్

విజయ భాస్కర్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రార్థన ఆయన మొట్టమొదటి సినిమా. నువ్వే కావాలి సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఈ సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కింది. ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా ...

                                               

కె.వి.రంగారెడ్డి

కొండా వెంకట రంగారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. ఈయన పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లాకు ఆ పేరు వచ్చింది. 1959 నుండి 1962 వరకు దామోదరం సంజీవయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఉప ముఖ్యమం ...

                                               

కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు

ఒక వస్తు వర్ణన చేయవలసి వచ్చినప్పుడు దాని స్వభావాన్ని, ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని వర్ణన చేస్తాం. ఇదే విధమైన దృష్టితో దత్తాంశ వర్ణన చేయవలసి ఉంటుంది. లక్క్ష్యనిర్దేశం ఆధారంగా దత్తాంశ సేకరణ పద్థతిని అనుసరించి ఏ విధమైన సాంఖ్యక పద్థతులను వాడాలో నిర్ ...

                                               

కొంగ

కొంగ ఒక రకమైన పక్షులు. ఇవి గ్రూయిఫార్మిస్ క్రమంలో గ్రూయిడే కుటుంబానికి చెందినవి. ఇవి పొడవైన కాళ్ళు, మెడ కలిగివుంటాయి. ఎగిరేటప్పుడు మెడను సాగదీస్తాయి. ఇవి ధ్రువప్రాంతాలు, దక్షిణ అమెరికా ఖండాలలో తప్ప ప్రపంచమంతా వ్యాపించాయి. కొంగలలో చాలా జాతులు అంతర ...

                                               

కొడవలి

వీటిని వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వరి పంట పక్వానికి వచ్చాక కొడవళ్ళనుపయోగించి కోత కోస్తారు. పొలాలలో సాదారణ ఉపయోగాలైన గడ్డి కోయడం, పళ్ళు కోయడం, కూరగాయలు కోయడం, చిన్న చిన్న చెట్లు, కొమ్మలు నరకడానికి, పాకలు, పూరిగుడిసెల నిర్మాణంలో ఇలా అనేక సంద ...

                                               

కొత్తసాలు (60 మంది కవుల కవిత్వం)

కొత్తసాలు పుస్తకం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడిన మూడవ పుస్తకం. తెలంగాణ రాష్ట్రంలోని 60 మంది కవుల కవితలను ఇందులో పొందుపరచడం జరిగింది.

                                               

కొవిషీల్డ్‌

ఇది కోవిడ్-19 వ్యాధి నివారణకు భాగస్వామ్యంలో తయారైన కొవిషీల్డ్ వ్యాక్సిన్.ఇదిఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, జెన్నర్ ఇన్స్టిట్యూట్ వద్ద అభివృద్ధి చేయబడిఎం, బ్రిటిష్ ఔషధ తయారీదారు ఆస్ట్రాజెనెకా నుండి లైసెన్స్ పొంది భారతదేశంలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండి ...

                                               

కొసరు

కొసరు అంటే వస్తువులు కొన్నప్పుడు కొన్నవస్తువులకు పైన ఉచితంగా లభించిన కొసభాగం అని అర్థం. కొసరు పొందిన కొనుగోలుదారుడు ఎక్కువ ఆనందం పొందటం వలన అసలు కన్నా కొసరు ఎక్కువ అంటారు. కొసరు కోరడాన్ని కొసరడం లేక కొసరించడం అంటారు. అమ్మకందారుడు కూడా కొసరు ఇచ్చి ...

                                               

కోకిల

కోకిల లేదా కోయిల ఒక పక్షి. వసంత కాలంలో కూ కూ అంటూ రాగాలాలపిస్తుంది. నిజమైన కోయిలలు కుకులిఫార్మిస్ క్రమంలో, కుకులిడే కుటుంబంలోని యూడైనమిస్ ప్రజాతికి చెందినవి. ఇవి ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాలలో నివసిస్తాయి. ఇవి పండ్లను, కీటకాలను తింటాయి. ఇ ...

                                               

కోడి

కోడి లేదా కుక్కుటము ఒక రకమైన పక్షులు. వీటిలో మగ కోడిని కోడిపుంజు, ఆడ కోడిని కోడిపెట్ట అని వ్యవహరిస్తారు. కోళ్ళల్లో అనేక రకాల జాతులు ఉన్నాయి. అవి బ్రాయిలర్=ప్రత్యేకంగా మాంసం కై పెంచు కోళ్ళు.వీటి ఎముకలు చాలా మృదువుగా వుండును. ఫారంకోళ్ళు=గుడ్ల ఉత్పత ...